Harmful Chemicals in Sanitary Pads :
Now a days many women choose to use sanitary pads during the menstrual cycle. But, over the years, several studies reported that menstrual hygiene products are causing not only harm to the body, but also the environment, since they are single-use products that potentially contain plastic.
Recently a lab released a report on sanitary pads stated that Major brands of sanitary pads which are sold in India , even the organic ones have been found to be containing toxic chemicals and volatile organic compounds that are likely to have direct impact on the health of consumers, besides having a major impact on the environment.
Harmful Chemicals in Sanitary Pads | శానిటరి ప్యాడ్స్ లో హానికరమైన రసాయనాలు
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు ఋతు స్రావ సమయంలో ఉపయోగించడానికి శానిటరీ ప్యాడ్‌లను ఎంచుకుంటున్నారు. కానీ, సంవత్సరాలుగా, అనేక అధ్యయనాలు ఋతు పరిశుభ్రత ఉత్పత్తులు శరీరానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నాయని వెల్లడి చేస్తున్నాయి, ఎందుకంటే అవి ప్లాస్టిక్‌ను కలిగి ఉండే సింగిల్-యూజ్ (ఒకసారి ఉపయోగించే) ఉత్పత్తులు.
భారతదేశంలో విక్రయించబడే ప్రధాన బ్రాండ్‌ల శానిటరీ ప్యాడ్‌లు, సేంద్రీయమైన శానిటరీ ప్యాడ్‌లు కూడా విషపూరితమైన రసాయనాలు మరియు అస్థిర సేంద్రియ సమ్మేళనాలను కలిగి ఉన్నట్లు ఒక ల్యాబ్ నివేదికల ఆధారంగా కనుగొనబడింది. ఇవి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపడమే కాకుండా పర్యావరణంపై పెను ప్రభావం చూపుతున్నాయి.
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండు శానిటరీ ప్యాడ్‌లలో ఆరు రకాల థాలేట్‌లు ఉన్నాయని వెల్లడించింది. థాలేట్‌ల మొత్తం గాఢత కిలోకు 10 నుండి 19,600 మైక్రోగ్రాముల వరకు చాలా విస్తృత పరిధిలో విస్తరించి ఉంది. ఉత్పత్తుల శ్రేణిలో మొత్తం 12 వేర్వేరు థాలేట్‌లు కనుగొనబడ్డాయి.
Effects of harmful chemicals in sanitary pads | శానిటరీ ప్యాడ్‌లలో హానికరమైన రసాయనాల ప్రభావాలు
- ఈ హానికరమైన రసాయన పదార్ధాలు, ప్యాడ్‌లు వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం మరియు పర్యావరణంపై పరోక్ష ప్రభావం చూపుతాయి. థాలేట్స్ మరియు అస్థిర సేంద్రీయ రసాయనాలు నీరు మరియు నేలను కలుషితం చేస్తాయి. వ్యర్థాలను సేకరించేవారు మరియు తరలించేవారు కూడా అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది.
- ఈ హానికరమైన రసాయన పదార్ధాలు ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం యొక్క పొరను పోలిన కణజాలం గర్భాశయం వెలుపల పెరుగుతుంది, నొప్పి మరియు/లేదా వంధ్యత్వానికి కారణమవుతుంది), గర్భధారణ సంబంధిత సమస్యలు, పిండం అభివృద్ధిలో సమస్యలు, ఇన్సులిన్ నిరోధకత, రక్తపోటు మరియు మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- అస్థిర సేంద్రీయ రసాయనాలు గాలిలో తేలికగా ఆవిరైపోతాయి. వీటిని ఎక్కువగా పెయింట్స్, డియోడరెంట్‌లు, ఎయిర్ ఫ్రెషనర్లు, నెయిల్ పాలిష్, చిమ్మట వికర్షకాలు, ఇంధనాలు మరియు ఆటోమోటివ్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శానిటరీ నాప్‌కిన్‌లలో, సువాసనను జోడించడానికి అవి ఉపయోగించడం వలన మానవ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
- గుండె మరియు పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావాలు, మధుమేహం, కొన్ని క్యాన్సర్‌లు మరియు పుట్టుకతో వచ్చే వైకల్యాలతో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో థాలేట్‌లు ముడిపడి ఉన్నాయి.
Steps taken by the government | ప్రభుత్వం తీసుకున్న చర్యలు
Menstrual hygiene scheme | రుతుస్రావ పరిశుభ్రత పథకం
రుతుస్రావ పరిశుభ్రత పథకాన్ని, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామీణ ప్రాంతాల్లో కౌమారదశలో ఉన్న బాలికలలో (10-19 ఏళ్లు) రుతుక్రమ పరిశుభ్రత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, పరిశుభ్రత పద్ధతులను మెరుగుపరచడానికి, సబ్సిడీతో కూడిన శానిటరీ శోషకాలను అందించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Precautions to be taken | తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తయారీదారులు ఉత్పత్తి పదార్థాల జాబితాను బహిర్గతం చేసేలా నిబంధనలను విధించాలి.
- భారతదేశంలో, శానిటరీ ఉత్పత్తులలో రసాయనాల ఉనికిని నియంత్రించడానికి సరియైన చట్టాన్ని రూపొందించాలి.
Harmful Chemicals in Sanitary Pads FAQ | శానిటరి ప్యాడ్స్ లో హానికరమైన రసాయనాలు – తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర. ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జ. ఋతుస్రావ పరిశుభ్రత దినోత్సవాన్ని మే 28 వ తేదీన జరుపుకుంటారు.
ప్ర. ఋతుస్రావ పరిశుభ్రత పథకాన్ని ఎవరు ప్రారంభించారు?
జ. ఋతుస్రావ పరిశుభ్రత పథకాన్ని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |