Telugu govt jobs   »   ap police sub inspector   »   AP పోలీస్ SI నియామక పక్రియ పై...
Top Performing

AP పోలీస్ SI నియామక పక్రియపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

AP పోలీస్ SI నియామక పక్రియపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

గతంలో జరిగిన AP SI తుది వ్రాత పరీక్ష నిర్వహణ పై స్టే విధించిన హై కోర్టు పై ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది. అభ్యర్ధులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు, ఎత్తు కొలతలలో ఎలాంటి తప్పు జరగలేదు అని తెలిపింది మరియు ఈ కేసు వలన దాదాపు 45,000 మంది యువతి యువకులు ఆధార పడ్డారు కావున స్టే ఎత్తివేయాలి అని ప్రభుత్వం తరపున న్యాయవాది ధర్మశానాన్ని కోరారు. హై కోర్టు సమక్షంలో అభ్యర్ధులు ఎత్తు తిరిగి కొలుస్తాము అని కోర్టు కి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అభ్యర్ధులు చేసిన వాదనలో తప్పు ఉంటే వారి నుండి భారీగా లక్ష రూపాయలు జరిమానా విధిస్తాము అని తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది. దీంతో AP SI నియామకాలు ఎత్తు కొలతలు మళ్ళీ జరగనున్నాయి.  ఈ నెల 29 న ఎంతమంది హాజరవుతారు అని పిటిషనర్ తరపు న్యాయ వాదికి తెలిపారు. AP SI ఫలితాలు ఈ ఎత్తు కొలతలు పై కేసు విచారణ తర్వాత విడుదల చేయనున్నారు.

గతంలో జరిగిన కేసు వివరాలు

AP SI నియామకాల్లో అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్‌ వేశారు.

పిటిషన్‌ వేసిన బాధితుల తరఫున జడ శ్రావణ్‌ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా, ఆ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్సై నోటిఫికేషన్‌పై స్టే విధించింది.

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

AP పోలీస్ SI నియామక పక్రియ పై స్టే ఎత్తివేసిన హై కోర్టు_4.1