2023- 2024 సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ,సహకార, మార్కెటింగ్, మరియు ఫుడ్ ప్రొసెసింగ్ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు సభలో ప్రవేశ పెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ప్రతిలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్ శాఖ, సహకార శాఖ, ఫుడ్ ప్రొసెసింగ్, పశు సంవర్ధక శాఖ మత్స్య శాఖ, నీటి వనరుల శాఖల లో సాధించిన ప్రగతి చేపట్టిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, లెక్కలు వంటి ముఖ్య విషయాల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 యొక్క ముఖ్యాంశాలు రాబోయే అన్నీ పోటీ పరీక్షలలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
బడ్జెట్ ప్రచురించిన ప్రతీ సారి వాటినుంచి వివిధ పరీక్షలలో వివిధ రకాల ప్రశ్నలను తరచూ అడుగుతారు కాబట్టి 2023 కి సంభందించిన రాష్ట్రవ్యవసాయ బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఈ కధనంలో అందించాము.
భారతీయ సమాజం -భారతదేశంలో కుల వ్యవస్థ మరియు వర్ణ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ 2023లో రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన అభివృద్ది మరియు పురోగతి గురించి వివరించారు. 2021-2022 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ 13.07 శాతం వృద్ధి ని నమోదు చేసింది ఇది జాతీయ సగటు కంటే 3.07 శాతం ఎక్కువ. మరియు, 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర వృద్ధి రేటు 13.18 శాతం కానీ జాతీయ వృద్ధి 11.2 శాతం మాత్రమే. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ జాతీయ వృద్ధి కంటే ఎక్కువ. వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి 41436.29కోట్లు ప్రతిపాదించారు. గడచిన 44 నెలలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాలలో చేసిన ఖర్చు 1 లక్షా 54 వేల కోట్లు రూపాయలు:
- PM-కిసాన్: 27,062.09 కోట్లు
- సున్నా వడ్డీ పంట ఋణం: 1,442.66 కోట్లు
- ఉచిత పంట భీమా: 6,684.84 కోట్లు
- పంట నష్ట పరిహారం: 1,911.81 కోట్లు
- ధాన్యం కొనుగోలు: 5,5401.58కోట్లు
- ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలు: 7,156 కోట్లు
- శనగ రైతులకు: 300 కోట్లు (బోనస్)
- YSR యాత్ర సేవ పధకం లో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల కోసం: 240.67
- ఉచిత విధ్యుత్, విధ్యుత్ బకాయిలు: 53,645 కోట్లు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 యొక్క ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖ
వ్యవసాయ శాఖ
- రైతులకు అన్నీ విధాలుగా ఉపయోగపడతాయి అనే ఆలోచనతో 2020లో ఏర్పాటు అయిన ఈ రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. ఇప్పటి వరకూ 10,778 రైతు భరోసా కేంద్రాలు రైతులకోశం పని చేస్తున్నాయి.
- రైతు భరోసా కేంద్రాలకు 2023-2024 బడ్జెట్ లో 41.55 కోట్లు కేటాయించారు. PM కిసాన్ పధకం ద్వారా 51.12 లక్షల రైతులకి 6944.50 కోట్లు అందించారు. అటవీ భూముల సాగుదారులకు ROFR అందించి 2019 నుంచి ఇప్పటి వరకూ 27062.09 కోట్లు అందించారు.
- YSR రైతు భరోసా- PM కిసాన్ పధకం కోసం 2023-2024 బడ్జెట్ లో 7220 కోట్లు ప్రతిపాదించారు. YSR ఉచిత పంట భీమా కోసం 2019 నుండి ఇప్పటి వరకూ 6684.84 కోట్లు పరిహారం చెల్లించారు. 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి YSR ఉచిత పంట భీమా కోసం 1600 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించారు.
- సున్నా వడ్డీ పధకం 2019 లో ప్రారంభమైంది ఇప్పటి వరకూ 1442.66 రైతులకి చెల్లించారు. 2023-2024 బడ్జెట్ లో ఈ పధకానికి 500 కోట్లు ప్రతిపాదించారు.
- నాణ్యమైన విత్తనాలను అందించడం కోసం 2022-2023 సంవత్సరంలో 12.56 లక్షల మంది రైతులకు 202.66 కోట్ల రాయితీ తో 7.17 లక్షల క్వింటాల విత్తనాలు అందించారు. 2023-2024 సంవత్సరానికి దీనికి మళ్ళీ 200 కోట్లు మంజూరు చేయనున్నారు.
- 2019 నుంచి ఇప్పటి వరకూ ప్రకృతి వైపరీత్యాల వలన నష్ట పోయిన రైతులకు 1911.81 కోట్లు పట్టుబడి రాయితీ అందించారు. 2023-2024 బడ్జెట్ లో దీనికి 200 కోట్లు అందించనున్నారు.
- డా వై. ఎస్. ఆర్ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 37.39 కోట్లు ప్రతిపాదించారు
- ప్రమాదవశాత్తు మరణించిన రైతులకు 7 లక్షల రూపాయలు అందించనున్నారు దీనికోసం ప్రత్యేకంగా 20 కోట్లు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 యొక్క ముఖ్యాంశాలు: ఉద్యాన శాఖ
- ఉద్యాన శాఖకి 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి 656.64 కోట్లు ప్రతిపాదించారు.
- సూక్ష్మ సేద్యం కిందకి అదనంగా 3.75 లక్షలు ఎకరాలు తీసుకుని రానున్నారు.
- నేషనల్ మిషన్ ఆన్ ఏడిబిల్ అయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) పధకం ద్వారా రాయితిని 12,000 నుంచి 29,000 కు పెంచారు మరియు ఆయిల్ పామ్ పంటల కోసం 50 కోట్లు, సూక్ష్మ సేద్యం లో భాగమైన పెర్ డ్రాప్ మోర్ క్రాప్ లో రాయితీ కింద 472.50 కోట్లు ప్రతిపాదించారు.
- సమీకృత ఉద్యాన అభివృద్ధికి 83.33 కోట్లు కూడా ఈ బడ్జెట్ లో ప్రతిపాదించారు.
- పట్టు పరిశ్రమని బలోపేతం చేసేందుకు ఈ ఆర్ధిక సంవత్సరంలో 99.72 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 యొక్క ముఖ్యాంశాలు: మార్కెటింగ్ శాఖ
- ఈ ఆర్ధిక సంవత్సరానికి మార్కెటింగ్ శాఖ కు 513.74 కోట్లు ప్రతిపాధించారు.
- “ఈ-ఫామ్ మార్కెటింగ్” ను అభివృద్ది చేసి రైతులను వ్యాపారులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చారు. మార్కెటింగ్ శాఖలో నాడు నేడు కింద 212.314 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు.
APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 యొక్క ముఖ్యాంశాలు: సహకార శాఖ
ఈ ఆర్ధిక సంవత్సరానికి సహకార శాఖకు 233.71 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించారు. రాష్ట్రం లో 2046 PACsలలో 70.29 లక్షల రైతులు సభ్యులు గా ఉన్నారు. APCOB ద్వారా రైతులకి స్వల్ప కలయిక ఋణాలు మరియు దీర్ఘ కాలిక ఋణాలు రైతులకి అందించారు. జిల్లా సహకార బ్యాంకుల ద్వారా 18626 కౌలు రైతులకి 142.68 కోట్లు స్వల్ప కలయిక ఋణాలు అందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా RBK మరియు PACs లను బలోపేతం చేస్తూ గోదాములు, మౌలిక సదుపాయాలను అందించడానికి AIF లేదా మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేశారు. NABARD ద్వారా 1844.95కోట్ల నిధులతో AIF ప్రాజెక్ట్లు ప్రారంభించారు. మొదటి దశ లో 1166గోదాములు మంజూరు చేశారు.
మహిళా డైరీ సహకార సంఘాలు MDSS లను జగనన్న పాల వెల్లువ పధకంలో కి తీసుకుని వచ్చి మహిళా రైతులకు రాష్ట్ర పాడి పరిశ్రమకు లబ్ధి చేకూర్చానున్నారు. BMCU బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు ఏర్పాటుకి 680 కోట్లు వెచ్చించనున్నారు.
సహకార బ్యాంకులకు నిధులు అంధించి తద్వారా NABARD నుండి అదనపు ఋణం పొందే వెసులుబాటు కల్పించారు. APCOBకు 100 కోట్లు మరియు DCCBలకు195 కోట్లు మంజూరు చేశారు. PACsల కంప్యూటరీకరణ కోసం 25.18 కోట్లు మంజూరు చేయనున్నారు, అందులో 10 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరం విడుదల చేస్తారు.
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
సెకండరీ ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ల కోసం ఈ ఆర్ధిక సంవత్సరానికి 100 కోట్లు ప్రతిపాధించారు. PM-FME పధకం లో రాష్ట్రానికి 10035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు క్రమబద్దీకరించనున్నారు. 5 సంవత్సరాల కాల పరిమితి లో ఉన్న వీటికి ఈ ఏడాది 460 కోట్లు కేటాయించారు. ఆహార ప్రొసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల పధకం కింద 146.41 కోట్లు ప్రతిపాదించారు మరియు ఫుడ్ ప్రొసెసింగ్ కు 286.41 కోట్లు ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 ముఖ్యాంశాలు
కొన్ని ముఖ్యమైన విశ్వవిధ్యాలయాలకు కేటాయించిన నిధులు
విశ్వవిధ్యాలయం పేరు | 2023-2024 కి బడ్జెట్ కోట్లల్లో |
ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిధ్యాలయం | 472.57 |
డా” వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిధ్యాలయం (DR YSR-HU) | 102.04 |
శ్రీ వేంకటేశ్వరా పశువైద్య విశ్వవిద్యాలయం (SVVU) | 138.50 |
ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం (APFU) | 27.45 |
1114.23 కోట్లను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ లో పశుసంవర్ధక శాఖ కోసం ప్రతిపాదించారు మరియు మౌలిక సదుపాయాల కోసం 27.25 కోట్లను ప్రతిపాదించారు. మత్స్య శాఖ అభివృద్ది కోసం 500.83 కోట్లు ప్రతిపాదించారు.
- విద్యుత్ సబ్సిడీ కోసం ఈ ఆర్ధిక సంవత్సరానికి 5500 కోట్లు ప్రతిపాదించారు.
- వ్యవసాయానికి ఉపాది హామీని అనుసంధానిస్తూ కొన్ని పనులు చేపట్టారు దీనికోసం 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి 2833 కోట్లు ఖర్చు చేశారు.
- ఈ ఏడాదికి 5100 కోట్లు ఉపాది హామీ పధకం వ్యవసాయ అనుసంధానం బడ్జెట్లో ప్రతిపాదించారు.
- వై. ఎస్. ఆర్. జల కళ అమలు కోసం 252 కోట్లు ప్రతిపాదించారు.
- 2023-2024 లో నీటి వనరుల శాఖకు 11,908.10 కోట్లు ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2023 యొక్క ముఖ్యాంశాలు PDF డౌన్లోడ్ చేసుకోండి
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |