History MCQ Quiz in Telugu: Welcome to Adda 247. ADDA 247 Telugu is giving you History MCQ in Telugu for all competitive exams including TSPSC Groups & TS Gurukulam. Here you get History Multiple Choice Questions and Answers with Solutions every day. these questions are very unique and very helpful for those who are preparing for Competitive Exams. Practice daily basis and know your knowledge about History in Telugu for competitive exams. Study these History MCQs regularly and succeed in the exams.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు AP పోలీస్, TS పోలీస్ లాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు. దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పాలిటీ, చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, పర్యావరణ శాస్త్రం సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. ఈ ప్రశ్నలు చాలా ప్రత్యేకమైనవి మరియు కామెటిటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రోజూ ప్రాక్టీస్ చేయండి మరియు పోటీ పరీక్షల కోసం తెలుగులో పాలిటీ గురించి మీ జ్ఞానాన్ని తెలుసుకోండి. ఈ పాలిటీ MCQలను క్రమం తప్పకుండా అధ్యయనం చేయండి మరియు పరీక్షలలో విజయం సాధించండి.
History MCQs Questions And Answers in Telugu (హిస్టరీ MCQs తెలుగులో)
QUESTIONS
Q1. బ్రాహ్మణులకు “తుండి“ గ్రామంను ఎవరు దానం చేశాడు?
- మూడో మాధవ వర్మ
- రెండో మాధవ వర్మ
- మంచక భట్టారికుడు
- విక్రయేంద్ర భట్టారక వర్మ
Q2. గోవిందవర్మ భార్య పేరుపై నిర్మించిన మహాదేవ విహారానికి విక్రమేంద్ర భట్టారక వర్మ అగ్రహారంగా ఇచ్చిన గ్రామం ఏది?
A) పేణ్కపర
B) ఇరుందెర
C) రాయగిరి
D) భువనగిరి
Q3. ఉండవల్లి గుహాలయాలను నిర్మించింది ఎవరు?
- గోవిందవర్మ
- రెండో మాధవ వర్మ
- మంచన భట్టారికుడు
- 4వ మాధవవర్మ
Q 4. కీసర రామలింగేశ్వర, చెరువుగట్టు జడల రామలింగేశ్వర, ఇంద్రపాలనగర అమరేశ్వర ఆలయాలను నిర్మించింది ఎవరు?
A) మొదటి గోవిందవర్మ
B) మొదటి మాధవవర్మ
C) రెండో మాధవవర్మ
D) కీర్తివర్మ
Q 5. క్రీ.శ 350 నాటి ‘అత్తివర్మ గోరంట్ల’ తామ్ర శాసనం కన్నా ప్రాచీనమైన శాసనం ____ దగ్గర ఉన్నదని ఇటీవల పరిశోధకులంటున్నారు?
- నాగార్జున కొండ
- జగ్గయ్య పేట
- నల్గొండ
- నెల్లూరు
Q 6. ఎవరి కాలం నుంచి శాసనాల్లో తెలుగు పదాలు కనిపిస్తున్నాయి?
A) వాకాటకులు
B) రాష్ట్రకూటులు
C) విష్ణుకుండినులు
D) ఇక్ష్వాకులు
Q 7. క్రీ.శ. 435 నాటి విష్ణుకుండిన గోవిందవర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనం తెలంగాణాలో లభిస్తున్న తొలి శాసనం ఏది?
- సంస్కృతం శాసనం
- పాకృత శాసనం
- తుమ్మలగూడెం శాసనం
- ఏది కాదు
Q 8. జనాశ్రయ చంధా విచ్ఛిత్తి గ్రంథకర్త?
- మూడో మాధవ వర్మ
- రెండో మాధవ వర్మ
- మంచన భట్టారికుడు
- 4వ మాధవవర్మ
Q 9. తెలంగాణ తొలి లక్షణ గ్రంథం ఏది?
- నచికేతోపాఖ్యానం
- జనాశ్రయచ్చందో విచ్ఛిత్తి
- శ్రీపర్వత స్వామి
- ఏది కాదు
Q 10. జనాశ్రయచ్చందో విచ్ఛిత్తి గ్రంథంలోని ముఖ్యాంశాలు కింది వాటిలో ఏవి?
1) వివిధ జాతుల పద్యాలున్నాయి.
2) శీర్షికను ఏడు విధాలుగా పేర్కొన్నారు.
3) శీర్షిక అంటే ‘సీసం’. పద్యాంతంలో ‘గీత’ పద్యం ఉంది.
4) ‘ద్విపద’, ‘త్రిపదలు కూడా ఉన్నాయి.
పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?
(a) 1 మాత్రమే
(b) 1 మరియు 3 మాత్రమే
(c) 1 మరియు 2 మాత్రమే
(d) పైన పేర్కొన్నవన్ని
Q 11. విష్ణుకుండినులు వంశంలో చివరి వాడు ఎవరు?
- మూడో మాధవ వర్మ
- రెండో మాధవ వర్మ
- మంచక భట్టారికుడు
- 4వ మాధవవర్మ
SOLUTIONS
Q 1. ANS (d)
విక్రయేంద్ర భట్టారక వర్మ తన రాజధాని అమరపురం నుంచి దెందులూరు (లెందులూరు)కు మార్చాడు. బ్రాహ్మణులకు తుండి (తుని) గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇతడికి ఉత్తమాశ్రయుడు అనే బిరుదు ఉంది. ఇతడు తన 11వ రాజ్య సంవత్సరంలో ఇంద్రపాలనగరంలోని పరమమహాదేవి విహారానికి ఇరుందెర గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
Q 2. ANS (B)
ఇంద్రపాలపురంలో గోవిందవర్మ భార్య మహదేవి నిర్మించిన విహారానికి విక్రయేంద్ర భట్టారక వర్మ (రెండవ విక్రయేంద్ర వర్మ) తన 11వ రాజ్య సంవత్సరంలో ఇరుందెర అను గ్రామంను దానం చేశాడు. ఇతడు బ్రాహ్మణులకు తుండి అను గ్రామంను దానం చేశాడు.
Q 3. ANS (a)
ఉండవల్లి గుహాలయాలు: ఇవి నాలుగు అంతస్తుల్లో ఉన్నాయి. వీటిని గోవిందవర్మ నిర్మించాడు. ఇందులో మొత్తం 64 గుహలు ఉన్నాయి. మొదటి అంతస్తులో త్రిమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. రెండో అంతస్తులో ‘అనంతశయన ‘ విష్ణువు దేవాలయం, మూడో అంతస్తులో ‘త్రికూఠ ఆలయం’ ఉన్నాయి. నాలుగో అంతస్తులో సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. ఈ గుహల్లో ‘పూర్ణకుంభం’ ఉంది.
Q 4. ANS (c)
రెండో మాధవ వర్మ భైరవకొండ, ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి బౌద్ధక్షేత్రాలను ధ్వంసం చేసి హైందవమతాన్ని పునరుద్ధరించారు. ఉండవల్లిలో బుద్ధుడి శిల్పాన్ని పగులగొట్టించి శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించారు. ఈయన కాలంలో అమరావతి కోసం బౌద్ధులు, శైవులు ఘర్షణపడ్డారు. బౌద్ధారామాన్ని పగులగొట్టి శివలింగాన్ని ప్రతిష్టించారు. కీసర (రంగారెడ్డి జిల్లా)లోని రామలింగేశ్వరాలయం, ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, చెరువు గట్టులోని జడల రామలింగేశ్వర ఆలయం మొదలైనవాటిని ఈయన నిర్మించారు.
Q 5. ANS (C)
క్రీ.శ. 370-400 నాటి గోవిందరాజ విహార (చైతన్యపురి) శాసనం తెలంగాణాలో లభిస్తున్న మొదటి ప్రాకృతశాసనం అయితే ఈ శాసనం కన్నా, క్రీ.శ 350 నాటి ‘అత్తివర్మ గోరంట్ల తామ్ర శాసనం కన్నా ప్రాచీనమైన శాసనం నల్లగొండ జిల్లా ఏలేశ్వరం దగ్గర ఉన్నదని ఇటీవల పరిశోధకులంటున్నారు.
Q 6. ANS (C)
4వ మాధవవర్మ ‘జనాశ్రయఛందోవిచ్ఛిత్తి’ రాసినాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథం. వీళ్ళు మొదట ప్రాకృత భాషనాదరించిన తరువాత సంస్కృతాన్ని రాజభాషగా స్వీకరించినారు. ఆనాడు తెలుగు వ్యవహారభాషగా ఉంది. తెలుగు కవిత ఆరంభదశలో ఉంది. ఈనాటి శాసనాల్లో తెలుగు పదాలు కన్పించడం అందుకు తార్కాణం.
Q 7. ANS (d)
మొదటి గోవిందవర్మ (క్రీ.శ. 398 – 440) వేసిన ‘ఇంద్రపాలనగర’ తామ్ర శాసనం తెలంగాణాలో లభించిన తొలి సంస్కృత శాసనం. ఈయన విష్ణుకుండినుల తొలిరాజుల్లో ప్రసిద్ధి చెందినవారు. మంచి రాజనీతిజ్ఞుడు, పరాక్రమవంతుడు.
Q 8. ANS (d)
4 వ మాధవవర్మ జనాశ్రయఛందోవిచ్ఛిత్తి’ రాసినాడు. ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణగ్రంథం. వీళ్ళు మొదట ప్రాకృత భాషనాదరించిన తరువాత సంస్కృతాన్ని రాజభాషగా స్వీకరించినారు. ఆనాడు తెలుగు వ్యవహారభాషగా ఉంది. తెలుగు కవిత ఆరంభదశలో ఉంది. ఈనాటి శాసనాల్లో తెలుగు పదాలు కన్పించడం అందుకు తార్కాణం.
Q 9. ANS (b)
జనాశ్రయచ్చందో విచ్ఛిత్తి: ఇది శాస్త్ర గ్రంథం. తెలంగాణ తొలి లక్షణ గ్రంథం ఇదే. కానీ ఇది అసంపూర్ణంగా ఉంది. అవతారిక పద్యాలు లేవు. దీన్ని ‘గుణస్వామి’ రచించి మాధవవర్మ పేరుతో ప్రకటించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. జనాశ్రయుని కాలంలో వ్యాప్తిలో ఉన్న కవితలకు, పద్యాలకు వివరణ గ్రంథం ఇది. మాధవవర్మకు తప్ప ఆ కాలంలో ఏ రాజుకు ‘జనాశ్రయ’ అనే బిరుదు లేదు
Q 10. Ans (d)
ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలు.
1) వివిధ జాతుల పద్యాలున్నాయి.
2) శీర్షికను ఏడు విధాలుగా పేర్కొన్నారు.
3) శీర్షిక అంటే ‘సీసం’. పద్యాంతంలో ‘గీత’ పద్యం ఉంది.
4) ‘ద్విపద’, ‘త్రిపదలు కూడా ఉన్నాయి.
Q 11. Ans (c)
మంచక భట్టారక వర్మ (క్రీ.శ. 623 – 624) ఇతను చివరి పాలకుడు.రాజ్యాన్ని విషయాలుగా విభజించి పాలించారు. వీరికాలంలో ఒక్కో ఉద్యోగి ఒక్కోపేరుతో పిలిచేవారు.
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |