Telugu govt jobs   »   APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్   »   APPSC గ్రూప్-2 పరీక్ష ని ఎలా రాయకూడదు

APPSC గ్రూప్-2 పరీక్ష ని ఎలా రాయకూడదు

APPSC గ్రూప్ 2 పరీక్ష OMR విధానం లో జరుగుతుంది. 25 ఫిబ్రవరి 2024న గ్రూప్-2 పరీక్ష వివిధ కేంద్రాల్లో జరుగుతుంది ఇప్పటికే హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాయి. ఇంకా పరీక్ష కి 2-3 రోజులు సమయం మాత్రమే ఉంది ఈ సమయంలో విధ్యార్ధులు పరీక్ష కి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కావున పరీక్ష ని విజయవంతంగా రాసేందుకు కొన్ని సూచనలు పాటించాలి.

APPSC గ్రూప్-2 పరీక్ష సమయం దగ్గర పడటంతో అభ్యర్ధులు చివరి నిమిషంలోఎక్కువ చదవాలి మరియు పరీక్ష ని బాగా రాయాలి అనే ఉద్దేశం తో ఎక్కువ గందరగోలానికి గురవుతారు. చదివింది పరీక్షలో గుర్తుకు వస్తుందో లేదో మరియు మరచిపోతామనే భయం వారిని పరీక్షలో విజయం వైపు సాగే వారి పయనాన్ని నిలిపివేస్తుంది. సిలబస్ లో ఉన్న అంశాలు పరీక్షల ముందే రివిజన్ చేస్తారు దానికి సరైన పద్దతిలో చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది.

పరీక్ష హాలు లోకి ప్రవేశించిన తర్వాత నుంచి పరీక్ష పేపర్ తీసుకుని పూర్తి చేసేంతవరకు ఒక తెలియని భయం ఆందోళన కలుగుతుంది, ఈ సమయం లో తెలిసిన ప్రశ్నలు కూడా కొన్ని తప్పుచేస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నందున వారు అనుకున్న మార్కులకి పరీక్ష రిసల్ట్ వచ్చే సమయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ కింద తెలిపిన అంశాలను దృష్టిలో పెట్టుకుంటే పరీక్ష హాలులో పరీక్షని విజయవంతంగా రాయడానికి ఒక మార్గం తెలుస్తుంది.

APPSC GROUP-2 Prelims Subject Wise MCQS Download Free PDF in Telugu and English_30.1Adda247 APP

APPSC గ్రూప్-2 పరీక్ష ని ఎలా రాయకూడదు

APPSC గ్రూప్-2 పరీక్ష ని ఎలా రాయాలి అని అందరికీ తెలిసే ఉంటుంది కానీ పరీక్ష ని ఎలా రాయకూడదో కూడా తెలుసుకోవాలి అప్పుడే కదా ఏ తప్పులు చేయకూడదు అనే ఆలోచనతో చాలా జాగ్రత్తగా పరీక్ష ని రాయగలుగుతాము. ఈ కధనం లో APPSC గ్రూప్-2 పరీక్షని ఎలా రాయకూడదో తెలుసుకుని పరీక్షా సమయంలో తప్పులు చేయకుండా ఉండండి.

OMR షీట్ పూరించడం: మొదటి సారి గ్రూప్-2 పరీక్ష రాస్తున్న అభ్యర్ధులకి OMR ని నింపడం కాస్త కష్టంగా ఉండవచ్చు కాబట్టి 2-3 రోజుల ముందు OMR నిపడం ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. మాక్ టెస్ట్ లు ప్రాక్టీస్ చేసిన అభ్యర్ధులు పరీక్ష పేపర్ ని సులువుగా పూర్తి చేయగలరు కానీ అతి నమ్మకంతో తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఏదైనా ప్రశ్నకి సమాధానం తప్పు చేసిన దానిని సరిదిద్దే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే దానివలన OMR షీట్ పడయ్యే అవకాశం ఉంది. తప్పులు జరగకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షని సజావుగా రాయండి.

నెగెటివ్ మార్కింగ్ : APPSC గ్రూప్-2 పరీక్షలో నెగెటివ్ మార్కులు లేదా ఋణాత్మక మార్కులు  1/3 ఉన్నాయి అంటే ప్రతి 3తప్పు సమాధనాలకి ఒక మార్కు పోతుంది మీరు సరైనది అయ్యిఉంటుంది అని అనుకున్న ప్రశ్నలు తప్పు అయితే ఎక్కువ మార్కులు కోల్పోతారు. కావున కచ్చితంగా సరైన సమాధానాలు మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రతి తప్పు సమాధానం మనల్ని మన విజయం నుండి దూరం చేసి క్వాలిఫై అవ్వకుండా చేస్తుంది. అభ్యర్ధులు చివరి సమయంలో కచ్చితంగా అవుతుంది అని అనుకుని సమాధానాలు చేస్తారు ఈ చర్యని మానుకోవాలి. పరీక్షా పేపర్ లో గెస్స్ లేదా అనుకుని సమాధానం చేసిన ప్రశ్నలు గరిష్టంగా 8-10 లోపు  ఉండాలి. లేకపోతే నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కులు సాధించలేరు.

APPSC GROUP-2 Prelims Free Full-Length Mock PDF

సమయం: పరీక్షా సమయం మొత్తం 150 నిముషాలు మరియు APPSC గ్రూప్-2 పరీక్షా సరళిని చూస్తే 5 విభాగాలు 30 ప్రశ్నలు చొప్పున వస్తాయి కావున ప్రతి విభాగానికి తగిన సమయం కేటాయించి అన్నీ ప్రశ్నలు తనిఖీ చేయాలి. ఒక విభాగం లేదా ప్రశ్న పై ఎక్కువ సమయం కేటాయిస్తే మిగిన విభాగలకి సమయం తగ్గిపోతుంది. APPSC గ్రూప్-2 పరీక్ష రాసేడప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మొత్తం 150 ప్రశ్నలు తనిఖీ చేసి ముందుగా వచ్చిన వాటికి సమాధానం చేయ్యాలి ఆ తర్వాత రాని ప్రశ్నలకి సమయం కేటాయించాలి. ఇలా చేస్తే అన్నీ విభాగలు మరియు అన్నీ ప్రశ్నలు తెలుస్తాయి. ఇది భవిష్యత్తు లో మైన్స్ కి తయారవ్వడం లో సహాయపడుతుంది.

ప్రశాంతమైన వాతావరణం:  పరీక్ష రోజు మరియు దానికి ముందు రోజు కూడా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. పరీక్ష హాలు లో ఉన్నట్టు ప్రాక్టీస్ చేయండి మరియు అనవసరమైన ఆలోచనలు దూరం చేసుకుని ఏకాగ్రత ని అలవాటుచేసుకోండి. ఇలా కనీసం 2-3 రోజులు రోజుకి 2-3 సార్లు చేస్తే పరీక్ష హాలు లో ఏకాగ్రత పొందగలరు. పరీక్ష హాలు లో కూడా ఎక్కువ హడావుడి పడకుండా ప్రశాంతంగా ఉండండి ఇది మీ మెదడు పనీతిరుకి ఆటంకం కలగనివ్వదు.

నిద్రకి ప్రాధాన్యత: పరీక్షకు ముందు రోజు రాత్రంతా చదవాలి ప్రతి అంశాన్ని మననం చేసుకోవాలి అని ఆలోచనతో రాత్రంతా మేల్కొని ఉంటారు. నిద్రలేమి అధ్యయన సెషన్లు గందరగోళానికి దారితీస్తాయి మరియు మీ పరీక్షలో మీ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయి. సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం మరియు తగినంత నిద్ర చాలా ముఖ్యం. మీ నిద్ర సరళికి భంగం కలిగించే అధిక కెఫిన్ లేదా అర్థరాత్రి అధ్యయన సెషన్లను మానుకోండి. చివరి నిమిషంలో హడావిడిని నివారించడానికి మెడిటేషన్, యోగా లేదా ప్రశాంతమైన సంగీతం వినండి. 2-3 రోజుల ముందునుంచి కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి ఇది మీ పరీక్షలో సామర్ధ్యానికి సహాయపడుతుంది.

రివిషన్ కి ప్రాధాన్యత: పరీక్ష సమయం దగ్గరపడటం తో అన్నీ అంశాలు రివిజన్ చేయాలి అనే ఆలోచన ని పక్కన పెట్టి సాధ్యమైన మేర రివిజన్ చేసి కొత్త అంశాలను చదవకుండా ప్రశాంతమైన వాతావరణం గడపండి. ఎక్కువ రివిజన్ కూడా కొంత గందరగోళానికి గురిచేస్తుంది కాబట్టి రివిజన్ మూస పద్దతి లో కాకుండా ప్రాక్టీస్ బిట్లు, చర్చలు, వంటివి చేయండి వీటి వలన రివిజన్ పూర్తవుతుంది మరియు మీ మెదడు కూడా నూతనంగా ఆలోచిస్తుంది.

అతి నమ్మకం:  APPSC గ్రూప్-2 పరీక్షకి హాజరావుతున్న అభ్యర్ధులు వారి పై వారికి నమ్మకం ఉండాలి, మరియు ప్రిపరేషన్ అనుకున్న విధంగా జరిగిన లేకపోయినా పరీక్ష రాసేందుకు అతి నమ్మకం పనికిరాదు. అతి నమ్మకం వలన సరైన ప్రశ్నలు కూడా తప్పుగా చేసేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్ధులు వారి పై ఉన్న నమ్మకం తో పరీక్ష కి హాజరవుతారు పరీక్షా పేపర్ సులువుగా ఉన్న లేక క్లిష్టంగా ఉన్న ఆనందం/ నిరాశ చెందకుండా పరీక్షని సజావుగా రాయాలి. పరీక్షా పేపర్ ఎలా ఉన్న దృడ సంకల్పం తో మనోధైర్యం తెచ్చుకుని పరీక్ష ని పూర్తి చేయాలి.

APPSC GROUP-2 2024 Complete Study Kit for APPSC GROUP-2 Prelims

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!