Telugu govt jobs   »   APPSC GROUP 2   »   APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త...
Top Performing

APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్ 2 సిలబస్ మరియు పరీక్షా సరళిని మార్చింది. APPSC గ్రూప్ 2 పరీక్షల కోసం APPSC కొత్త సిలబస్ మరియు పరీక్షా సరళిని విడుదల చేసింది. కొత్త సిలబస్ ప్రకారం, ఫేజ్ Iలో ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష 150 మార్కులకు మరియు ఫేజ్ IIలో మెయిన్స్  పరీక్ష 300 మార్కులకు నిర్వహించబడుతుంది. మొత్తం రెండు దశలు కలిపి 450 మార్కులకు నిర్వహించబడుతుంది. APPSC గ్రూప్ 2 కొత్త సిలబస్ కి పాత సిలబస్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ కధనంలో మేము APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కొన్ని సూచనలు అందించాము. ఈ కధనాన్ని చదవడం ద్వారా APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అవగాహన వస్తుంది. మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.

APPSC Group 2 Exam Pattern 2023 [NEW], Check Updated Pattern_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?

చాలా వరకు పోటీ పరీక్షలలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ సిలబస్ 50% ఒకే అంశాలను కలిగి ఉంటాయి, కానీ, APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ మరియు మెయిన్స్ సిలబస్ లో ఒకే అంశాలు లేవు. కావున అభ్యర్ధులు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి విడిగా మెయిన్స్ కి విడిగా సన్నద్ధం కావాలి.

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఒక్కొక అంశం నుండి 30 మార్కులు చొప్పున ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర(30), భూగోళ శాస్త్రం(30), భారతీయ సమాజం(30), కరెంట్ అఫైర్స్(30), మెంటల్ ఎబిలిటీ(30). ఈ ఐదు అంశాల నుండి మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది. ఇచ్చిన 5 అంశాల నుండి సమనంగా ప్రశ్నలు వస్తాయి. కావున అభ్యర్ధులు ఏ ఒక్క అంశాన్ని కూడా చాయిస్ తీసుకోకుండా, అన్నీ అంశాలను చదవాలి.

చరిత్ర

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ లో ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పై దృష్టి పెట్టలేదు. ఇవి భారతదేశ చారిత్రకి సంబంధించినవి. ఈ విషయాన్ని అభ్యర్ధులు ఒకసారి గమనించాలి.

కరెంట్ అఫైర్స్

ప్రతి పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) అనేవి సాధారణంగా ఉంటాయి. పరీక్షలో అభ్యర్ధులు తమ చుట్టూ జరిగే అంశాల పై ఎంత అవగాహన కలిగి ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) ప్రశ్నలు అడుగుతారు. కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) అంశాల కోసం అభ్యర్ధులు తప్పనిసరిగా న్యూస్ పేపర్ రోజు చదవాలి. పరీక్ష సమయానికి ఒక సంవత్సరం ముందు వరకు జరిగిన సమకాలీన అంశాల పై మీకు అవగాహన ఉండాలి.

భూగోళ శాస్త్రం

భూగోళ శాస్త్రం 3 అంశాలు (భారతదేశం మరియు AP ఆర్థిక భౌగోళిక శాస్త్రం, భారతదేశం మరియు AP యొక్క మానవ భూగోళశాస్త్రం) గా విభజించారు. అభ్యర్ధులు భూగోళ శాస్త్రం అంటే భూగోళ శాస్త్రం స్టడీ మెటీరీయల్ ఒక్కటే చదవడం కాకుండా, అందులో విభజించిన అంశాల పై దృష్టి పెట్టాలి. అలాగే భూగోళ శాస్త్రం చదివేటప్పుడు, మ్యాప్స్ చూస్తూ చదివితే మంచి ఫలితం ఉంటుంది

భారతీయ సమాజం

భారతీయ సమాజం అనే అంశం కొత్తగా చేరింది. ఇలాంటి అంశాలు యూపిఎస్సి వంటి పరీక్షలో అడుగుతారు కానీ ఇప్పుడు APPSC గ్రూప్ 2 సిలబస్ లో చేర్చారు. దీని ద్వారా అభ్యర్ధులు ప్రస్తుతం గ్రూప్స్ వంటి పరీక్షకి ఎంత పోటీ ఉందో ఊహించవచ్చు. భారతీయ సమాజం (భారతీయ సమాజ నిర్మాణం, సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం) స్టడీ మెటీరీయల్ మేము adda 247 తెలుగు వెబ్సైట్ లో అందిస్తున్నాము. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు భారతీయ సమాజం స్టడీ మెటీరీయల్ ని ఒకసారి తనిఖీ చేయవచ్చు.

మెంటల్ ఎబిలిటీ

ఇక చివరిగా మెంటల్ ఎబిలిటీ లో లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ప్రాథమిక సంఖ్యాశాస్త్రం అంశాలు ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ మరియు ప్రాథమిక సంఖ్యాశాస్త్రం ఇలాంటి అంశాలను తరచూ ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే సాల్వ్ చేయగలరు. మెంటల్ ఎబిలిటీ కి సంబంధించిన ప్రశ్నలు  మనం చూసినప్పుడు సులభంగా పరిష్కరించగలము అనుకుంటాము కానీ అవి సాధన లేకుండా ప్రయత్నిస్తే సరైన సమాధానాలు రావు. మెంటల్ ఎబిలిటీ లో మంచి మార్కులు పొందాలంటే సాధన ఒకటే మార్గం.

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో రెండు పేపర్స్ ఉంటాయి. పేపర్ I  150 మార్కులకు, పేపర్ II  150 మార్కులకు చొప్పున మొత్తం 300 మార్కులకు  మెయిన్ పరీక్ష  నిర్వహిస్తారు.

పేపర్ I

APPSC గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్, పేపర్ I లో ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక చరిత్ర అంటే, ఆంధ్ర ప్రదేశ్ లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర మరియు భారత రాజ్యాంగం యొక్క సాధారణ వీక్షణ అంశాలు ఉంటాయి. ఇలాంటి అంశాలు ఏదయినా స్టాండర్డ్ మెటీరీయల్ మరియు తరచూ న్యూస్ పేపర్ చదవడం ద్వారా మన ప్రిపరేషన్ ని మెరుగు పరుచుకోవచ్చు

APPSC గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ లో ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అంశం ఉంది. అంటే అభ్యర్ధులు ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లో ఉన్న ప్రతీ అంశం పై దృష్టి సారించాలి. ఆంధ్ర ప్రదేశ్ ని ఎవరు పాలించారు, వారి పాలన కాలంలో వచ్చిన మార్పులు, ప్రజల జీవన విధానం, బ్రిటిష్ పాలన, ఆంధ్ర ఉద్యమం ఇలా అన్నీ అంశాలను 360 డిగ్రీ ల కోణంలో చూడాలి.

భారత రాజ్యాంగానికి సంబంధించి ఏదయినా స్టాండర్డ్ మెటీరీయల్ మరియు తరచూ న్యూస్ పేపర్ చదవడం ద్వారా పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు

పేపర్ II

APPSC గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్, పేపర్ II లో భారతీయ మరియు A.P. ఆర్థిక వ్యవస్థ , శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలకి సంబంధించిన అంశాలు ఉంటాయి.

ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే రెండు సబ్జెక్ట్స్ డైనమిక్ గా ఉంటాయి. బేసిక్స్ కోసం స్టాండర్డ్ మెటీరీయల్ చదవాలి. రెండు డైనమిక్ సబ్జెక్ట్స్ కాబట్టి తరచూ న్యూస్ చదవాలి. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్స్, బడ్జెట్, వంటివి చదవాలి. ప్రభుత్వ పథకాల కోసం PIB వంటి ప్రభుత్వ వెబ్సైట్ తరచూ సందర్శిస్తూ ఉండాలి.

APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్ 

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి?
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)
APPSC గ్రూప్ 2 జీతం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 సిలబస్ APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్
APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023
APPSC గ్రూప్ 2 అర్హత ప్రమాణాలు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 ఉద్యోగ వివరాలు, విధులు మరియు బాధ్యతలు_80.1

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?_5.1

FAQs

APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మేము ఈ కధనంలో వివరించాము

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అయ్యిందా?

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ నవంబర్ 2023 నెలాఖరులో విడుదల కానుంది