How to prepare for APPSC Group-I & Group-II simultaneously |APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షలకు ఒకేసారి ఎలా సన్నద్ధమవ్వాలి?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ తాజాగా గ్రూప్-I మరియు గ్రూప్-II అధికారిక ప్రకటన విడుదల చేసింది, ఈ తాజా నోటిఫికేషన్ తో ఎప్పటినుంచో గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు ఈ రెండు నోటిఫికేషన్ లు ఒకేసారి విడుదలవ్వడంతో దేనికి సన్నద్దమవ్వలి అనే మీమాంస ఉంటుంది. ఈ కధనం లో APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షలకు ఒకేసారి ఎలా సన్నద్దమవ్వలి అనే అంశం గురించి పూర్తివివరాలు తెలుసుకోండి. మీ ప్రిపరేషన్ ను ఎలా APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షలకి మలచుకోవాలో అర్ధం చేసుకోండి.
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II సిలబస్ లో తేడా
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II సిలబస్ లో గణనీయమైన మార్పులు ఉన్నాయి, మునుపటి నోటిఫికేషన్ తో పోలిస్తే పరీక్షా సిలబస్, పరీక్షా విధానంలో మార్పుని అభ్యర్ధులు గమనించి ఒక నిర్ణయానికి రావాలి. APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షా సిలబస్ ని పరిశీలిస్తే గ్రూప్-Iలో పేపర్- I జనరల్ స్టడీస్ 120 మార్కులు, పేపర్-2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 మార్కులు వెరసి మొత్తం 240 మార్కులకు నిర్వహిస్తారు. మైన్స్ లో రెండు భాషా పేపర్లతో పాటు మరో ఐదు ఇతర పేపర్లు ఉన్నాయి వీటికి మొత్తం 750 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ కి 75 మార్కులు మరియు కంప్యూటరు పరిజ్ఞానంకి 100 మార్కులు కేటాయించారు వీటిలో కూడా రాణిస్తేనే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు మైన్స్ మార్కులు ఇంటర్వ్యూ తో కలుపుకుని 825 మార్కులు. గ్రూప్-II సిలబస్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ పేపర్ లో ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్రభూగోళ శాస్త్రంభారతీయ సమాజంకరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు)మెంటల్ ఎబిలిటీ వంటి అంశాలు ఉన్నాయి మైన్స్ లో రెండు పేపర్లు ఉన్నాయి. ప్రిలిమ్స్ 150 మరులు, మైన్స్ 300 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు. మైన్స్ లో మంచి మార్కులు సాధిస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. రెండు పరీక్షల మధ్య ఇంత వ్యత్యాసంతో ప్రశ్నల్లో అడిగే విధానంలో ఉన్న తేడాతో అభ్యర్ధులు దేనికి ప్రిపేర్ అవ్వాలి అని నిర్ణయించుకుని పూర్తిగా ఒకే పరీక్ష మీద ధ్యాసపెడితే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరీక్షల మధ్య సమయం కూడా తక్కువగా ఉంది కావున ఒక పరీక్షపై మనసుపెడితే మంచిది.
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షా విధానం లో తేడా
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షా విధానం లో చాలా వ్యత్యాసం ఉంది కావున అభ్యర్ధులు గ్రూప్స్ పరీక్షలకి సన్నద్దమయ్యేడప్పుడు సిలబస్ మరియు పరీక్షా విధానం పై పూర్తి అవగాహన ఉండాలి. గ్రూప్-I పరీక్షని UPSC తరహాలో నిర్వహించడానికి APPSC సన్నాహాలు చేస్తోంది, ప్రిలిమ్స్(ఆబ్జెక్టివ్), మైన్స్ (డిస్క్రిప్టివ్ విధానం) మరియు ఇంటర్వ్యూ అన్నింటిలో ఉత్తీర్ణత సాధించాలి దానితోపాటు కంప్యూటరు పరిజ్ఞానం పరీక్ష కూడా ఉత్తీర్ణత సాధించాలి. కానీ గ్రూప్-IIలో ప్రిలిమ్స్ (క్వాలిఫై మాత్రమే) మరియు మైన్స్ జరుగుతాయి (రెండు కూడా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు) ఇందులో అభ్యర్ధులు మైన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఎందుకంటే అదే తుది ఫలితాలలో ప్రామాణికం. ఇలా పరీక్ష విధానంలోని వ్యత్యాసం వలన అభ్యర్ధులు రెండింటి పైన ఒకేసారి సన్నద్దమవ్వడానికి ప్రయత్నించాలి అనే ఆలోచన విరమించుకోవాలి.
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II ప్రిపరేషన్ విడిగా
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షలకు హాజరవుతున్నారా? కానీ దీనికి జాగ్రత్తగా ప్రణాళిక మరియు వ్యూహాత్మక విధానం అవసరం. నిపుణుల సలహా మేరకు పరీక్షా సమయం మరియు పరీక్షా శైలి భిన్నంగా ఉన్నందున రెండు పరీక్షలలో ఏదో ఒకదానికే సన్నద్దమవ్వడం మంచిది కానీ మీరు ఏదైనా పరీక్ష పై అధిక పట్టు సాధించినట్టయితే, ఒకేసారి రెండు పరీక్షలకు సమర్థవంతంగా సన్నద్ధం కావడానికి మీకు సహాయపడే కొన్ని విలువైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
సమగ్ర స్టడీ ప్లాన్: గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్లో మార్పుల కారణంగా అభ్యర్థులు రెండు పరీక్షలకూ ఒకేసారి చదవాలి అనుకుంటే రెండు పరీక్షల సిలబస్ లకు విడిగా సమయం కేటాయించి ఒక సమగ్ర స్టడీ ప్లాన్ ని ఏర్పరచుకోవాలి అడ్డా స్టడీమేట్ ద్వారా మీకు సరిపడే నిర్ధిష్టమైన స్టడీప్లాన్ ను తయారుచేసుకోండి. రెండు పరీక్షల మధ్య తగినంత సమయం లేనందు వలన సరైన ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయం ఉండాలి రెండు పరీక్షలకు ఒకేసారి సన్నద్ధం కావడం కాస్త కష్టమైన పని కావున ఒక పరీక్ష పై పూర్తి శ్రద్ధ పెడితే విజయం సాధించడం సులువుఅవుతుంది.
మీ విజయవకాశాలు పెంచుకోండి: ఏపీపీఎస్సీ తరచూ జోన్ల వారీగా, రోస్టర్ల వారీగా ఉద్యోగావకాశాలను విడుదల చేస్తుంది. మీ విజయావకాశాలను పెంచుకోడానికి, ఏ పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోండి మరియు తదనుగుణంగా మీ ప్రయత్నాలను కేంద్రీకరించండి. ఇంకా పూర్తి నోటిఫికేషన్ వివరాలు అందుబాటులో లేనందున ఒక పరీక్షకు ఎక్కువ సమయం కేటాయించి సన్నద్దమవ్వడం మంచిది.
ప్రశ్నల శైలికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవడం: UPSC పరీక్షల మాదిరి ప్రశ్నలు APPSCలో అడిగే అవకాశం ఉంది మరియు ఆబ్జెక్టివ్ ప్రశ్నల శైలి మారింది, ఇందులో అటాచ్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు, దృవీకరణ-తార్కిక ప్రశ్నలు మరియు సంక్లిష్ట ప్రశ్నలు ఉన్నాయి. విజయవంతం కావడానికి, మీ అధ్యయన ప్రణాళికలో అటువంటి ప్రశ్న రకాలను జోడించడం ద్వారా గ్రూప్-I ప్రిలిమ్స్ మరియు గ్రూప్-II పరీక్షలకు సిద్ధం అవ్వండి. పరీక్షా శైలికి అనుగుణంగా ఉండే మాక్ టెస్ట్ లు లేదా విభాగాల వారీగా టెస్ట్ సిరీస్ ను తరచూ సమాధానం చెయ్యండి ఇది మీకు నిజమైన పరీక్షా శైలికి అలవాటుపడేలా చేస్తుంది.
విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోండి: ఆబ్జెక్టివ్ పరీక్షలు ఇప్పుడు అభ్యర్థుల విశ్లేషణాత్మక సామర్థ్యాలను మరియు మొత్తం అవగాహనను అంచనా వేసే ప్రశ్నలను కలిగి ఉంటాయి. వీటిని పరిష్కరించడానికి, సిలబస్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి మరియు అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
బేసిక్స్ పై పట్టు: మీ ప్రిపరేషన్‌ను బేసిక్స్‌లో బలమైన పునాదిని ఏర్పరచుకోండి. ఫండమెంటల్స్‌పై గట్టి పట్టు ఉంటే దాదాపు 20 నుంచి 30 శాతం ప్రశ్నలకు సులభంగా సమాధానాలు చేయవచ్చు. సిలబస్‌లోని ప్రతి అంశం యొక్క ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడానికి పాఠశాల పుస్తకాలు, SCRT మరియు NCERT పుస్తకాలు మరియు ప్రామాణికమైన పుస్తకాలు చదవండి. ఆన్లైన్ విధానం లో అయిన స్వీయ అభ్యాసం అయిన మీరు బేసిక్స్‌పై పట్టు సాధించేలా చూసుకోండి.
ప్రాంతీయ పరిజ్ఞానం కీలకం: UPSC మార్గదర్శకాలు ప్రతి పరీక్షలో కనీసం 25 శాతం ప్రశ్నలు ప్రాంతీయ సబ్జెక్టులకు సంబంధించినవిగా ఉంటాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ భౌగోళికం, చరిత్ర, సామాజిక అంశాలు, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటుపై దృష్టి సారించాలి. ఇది మీకు పరీక్షలలో బలాన్ని చేకూరుస్తుంది.
కరెంట్ అఫైర్స్‌తో అప్‌డేట్ అవ్వండి: కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ఈ పరీక్షల్లో కీలకమైన అంశాలు. కరెంట్ అఫైర్స్‌తో అప్‌డేట్‌గా ఉండటానికి మరియు మీ సాధారణ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ కనీసం ఒక గంట కేటాయించండి అడ్డాపిడియా ను ప్రతి రోజు చదవండి. రాజకీయ, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, భౌగోళిక, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలతో పాటు మీకు రాష్ట్ర వార్తలు కూడా లభిస్తాయి ఇవి మీ కరెంట్ అఫ్ఫైర్స్ లో ఎంతో ఉపయోగపడతాయి.
APPSC గ్రూప్-I మరియు గ్రూప్-II పరీక్షలకు ఏకకాలంలో సిద్ధమవడం అనేది సవాలుతో కూడుకున్నది అయినప్పటికీ మీ ప్రయత్నం మరియు ప్రణాళిక పై నమ్మకం ఉంచండి. చక్కటి నిర్మాణాత్మక అధ్యయన ప్రణాళికతో, బేసిక్స్‌పై దృష్టి పెట్టడం మరియు ప్రస్తుత వ్యవహారాలతో అప్‌డేట్‌గా ఉండాలనే నిబద్ధతతో, మీరు ఈ పోటీ పరీక్షలలో మీ విజయావకాశాలను గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు. గుర్తుంచుకోండి, సరైన ప్రిపరేషన్ మిమ్మల్ని పోటీ పరీక్షల రంగంలో విజయవంతమైన కెరీర్ వైపు నడిపిస్తుంది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |