Telugu govt jobs   »   APPSC GROUP 2   »   APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్...

How to Prepare Indian Society for APPSC Group 2 Prelims? | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల APPSC గ్రూప్ 2 పరీక్షకి సిలబస్ విడుదల చేసింది. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ లో ఇండియన్ సొసైటీ అనే సబ్జెక్ట్ ను కొత్తగా చేర్చారు. ఇండియన్ సొసైటీ అంశం నుండి పరీక్షలో 30 మార్కులకు 30 ప్రశ్నలు వస్తాయి. అంటే ఇండియన్ సొసైటీ సబ్జెక్టు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్  పరీక్షలో 20% మార్కులను కలిగి ఉంది. కాబట్టి అభ్యర్ధులు ఇండియన్ సొసైటీ సబ్జెక్టు  మీద దృష్టి సారించాలి. ఇండియన్ సొసైటీ సబ్జెక్టు చాలా లిమిటెడ్ సిలబస్ ను కలిగి ఉంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ పై కొంచెం దృష్టి పెడితే అభ్యర్ధులు సులభంగా APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 20% మార్కులు పొందగలరు. పైగా  ఇలాంటి అంశాలు యూపిఎస్సి వంటి పరీక్షలో అడుగుతారు కాబట్టి ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ చదవడానికి చాలా మేటెరియల్స్ ఉంటాయి. ఈ కధనంలో మేము APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద కొన్ని సలహాలు అందించాము. మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.

APPSC గ్రూప్ 2 పరీక్ష కి కొత్త సిలబస్ తో ఎలా ప్రిపేర్ అవ్వాలి?_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

How to Prepare for APPSC Group 2 Prelims Indian Society | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ సొసైటీ కి ప్రిపేర్ అయ్యే విధానం

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ నుండి 30 మార్కులు వస్తాయి కాబట్టి, అభ్యర్ధులు నిర్లక్ష్యం చేయకుండా చదవాలి. ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ కి ఉండే ప్రయోజనం ఏంటంటే, తక్కువ సిలబస్ మరియు స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ సొసైటీ సిలబస్ లో ఉన్న అంశాలు ఇక్కడ అందించాము.

  • భారతీయ సమాజ నిర్మాణం
  • సామాజిక సమస్యలు
  • సంక్షేమ యంత్రాంగం

STUDYMATE Free Sample Notes For Geography Download PDF

Structure of Indian society | భారతీయ సమాజ నిర్మాణం

భారతీయ సమాజ నిర్మాణం అంశంలో  కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, తెగ, జాతి, మతం మరియు మహిళలు వంటి అంశాలు ఉన్నాయి. భారతీయ సమాజ నిర్మాణం అనే అంశాలు సోషియాలజీ కి సంబంధించినది. ఇక్కడ మేము అంశాల వారీగా ఏమేమి చదవాలో అందించాము.

కుటుంబం : కుటుంబం యొక్క నిర్వచనం, 1955 కంటే ముందు ఉన్న నిర్వచనాలు, 1955 తరువాత నిర్వచనాలు (తొలి & మలి నిర్వచనాలు), మతాల వారీగా కుటుంబ వ్యవస్థ, కుటుంబ లక్షణాలు, కుటుంబ విధులు, కుటుంబ సిద్ధాంతాలు, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కుటుంబ వ్యవస్త  అనే అంశాలు చదవాలి.

వివాహం: వివాహం యొక్క లక్షణాలు, వివాహ రూపాలు (ఎన్ని రూపాలు ఉన్నాయి), వివాహం రకాలు (ప్రజలు మరియు గిరిజనుల సంప్రదాయ వివాహ పద్ధతులు), వివాహ సిద్ధాంతాలు, మత పరంగా వివాహ పద్ధతులు (ఏ చట్టాల రూపం లో వివాహం అమలు జరుగుతుంది, ప్రత్యేక వివాహ చట్టం, మత పరంగా వివాహ పద్ధతులు) అనే అంశాలు ఉన్నాయి.

బంధుత్వం : బంధుత్వంఏర్పడే విధానం (వివాహ, రక్త సంబంధం, దత్తత), బంధుత్వం వర్గీకరణ, బంధుత్వం రకాలు, బంధుత్వం సిద్ధాంతాలు, గిరిజన తెగలు మరియు భారతీయ వ్యవస్థలో బంధుత్వ స్థానాలు, బంధుత్వ ఆచరణలు (పరిహాస సంబంధం, వైదొలగు నడవడి, కుహనా ప్రసూతి, మాతృ స్వాధీకారము, పితృ స్వాధీకారము) అంశాలు చదవాలి.

కులం : కులం లక్షణాలు, కులం సిద్దాంతలు, కులం నిర్వచనాలు, సామాజిక వ్యవస్థలో కులం ప్రాధాన్యత, మిగస్థనీస్ కులాంతర/మతాంతర ప్రతిపాదనలు, కులం అనే పదం ఏ భాష నుండి వచ్చింది మొదలైన సమకాలీన అంశాలు

తెగలు : భారత దేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిరిజనులుగా గుర్తిచలంటే గల కారణాలు (ఆర్టికల్ 342), గిరిజన లక్షణాలు, భారత దేశంలో మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న గిరిజనులు, గిరిజనులు వర్గీకరణ, C.P. విద్యార్ధి వర్గీకరణ, జనాభా అంశాలు.

మతం మరియు మహిళలు : మత సాంప్రదాయాలు, మత సంస్కృతికరణ, భారత దేశంలో మహిళల పై జరిగిన హత్య చర్యలు, మహిళల పరిస్థితి, మహిళా చట్టాలు, ఇటీవల మహిళా భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు చర్యలు మొదలైనవి.

 Adda’s Study Mate APPSC Group 2 Prelims

Social problems | సామాజిక సమస్యలు

కులతత్వం, మతతత్వం మరియు ప్రాంతీయకరణ, మహిళలు మరియు బాలల పై జరుగుతున్న నేరాలు, బాల కార్మికులు, యువత అశాంతి మరియు ఆందోళన అంశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుత భారత  సామాజిక వ్యవస్థలో మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రస్తుతం, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై అవగాహన కలిగి ఉండాలి.

welfare mechanism | సంక్షేమ యంత్రాంగం

భారత మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ పాలసీలు మరియు సంక్షేమ కార్యక్రమాలు,  మహిళలు, వికలాంగులు, పిల్లలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, బీసీలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలు, రాజ్యాంగ నిబంధనలు, రాజ్యాంగ పరిరక్షణలు, ప్రభుత్వం వల్ల భద్రత కోసం తీసుకున్న నిర్ణయాలు.

Indian Society Ebook for APPSC GROUP’s Exams by Adda24

Preparation tips and advice | ప్రిపరేషన్ చిట్కాలు మరియు సలహాలు

సిలబస్‌ని అర్థం చేసుకోండి

ఏ పరీక్షా అయిన ముందుగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మీ ప్రిపరేషన్‌ను ప్రారంభించండి. ప్రతి విభాగానికి ఇవ్వబడిన సబ్జెక్ట్‌లు, టాపిక్‌లు మరియు వెయిటేజీ వివరాలు తెలుసుకోండి. సిలబస్ మరియు పరీక్షా సరళి పై అవగాహన మీ ప్రణాళికను రూపొందించడంలో మరియు తదనుగుణంగా సమయాన్ని కేటాయించడంలో మీకు సహాయం చేస్తుంది.

ఒక మంచి ప్రణాళికను రూపొందించండి

సిలబస్ మరియు పరీక్షా సరళిపై మీ అవగాహన ఆధారంగా, సమర్థవంతమైన ప్రిపరేషన్‌కు ఒక చక్కటి  ప్రణాళిక ను సిద్ధం చేసుకోండి. సబ్జెక్ట్‌లు మరియు టాపిక్‌ల ఆధారంగా మీ అధ్యయన సమయాన్ని విభజించండి, మీరు బలహీనంగా భావిస్తున్న ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ చూపండి. రివిజన్ మరియు ప్రాక్టీస్ కోసం తగినంత సమయం కేటాయించండి.

సరైన స్టడీ మెటీరియల్స్ ఎంచుకోండి

మీకు ఖచ్చితమైన మరియు తాజా సమాచారం కోసం స్టాండర్డ్ స్టడీ మెటీరియల్స్ ఎంచుకోవాలి.  పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు, ఆన్‌లైన్ వనరులు మరియు మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాల వంటి వాటిని ఉపయోగించి ప్రిపరేషన్ చేయాలి.

మాక్ టెస్ట్‌లు మరియు మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాల ప్రాక్టీస్

మాక్ టెస్ట్‌లు వాస్తవ పరీక్ష వాతావరణాన్ని అనుకరిస్తాయి మరియు మీ పనితీరు యొక్క నిజ-సమయ అంచనాను అందిస్తాయి. ఈ పరీక్షల ద్వారా మీ బలాలు మరియు బలహీనతలను విశ్లేషించండి మరియు మీ బలహీన ప్రాంతాలను మెరుగుపరచడంలో పని చేయండి. అలాగే మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాల ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా యొక్క ట్రెండ్ పై అవగాహన వస్తుంది. మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షలో అడిగే ప్రశ్నలు తొందరగా అర్ధం చేసుకోగలుగుతారు.

పునర్విమర్శ మరియు స్వీయ-మూల్యాంకనం

మీరు ఎంత చదివారో, చదివిన దానిని రివిజన్ చేయడం అంతే అవసరం. పునర్విమర్శ కోసం షార్ట్ నోట్స్ లాంటివి తయారు చేసుకోండి.  స్వీయ-అంచనా పరీక్షలను తీసుకోని తద్వారా మీ పురోగతిని క్రమానుగతంగా మూల్యాంకనం చేయండి మరియు మెరుగుదల అవసరమైన ప్రాంతాలను గుర్తించండి. మీ ప్రిపరేషన్‌ని ఆప్టిమైజ్ చేయడానికి తదనుగుణంగా మీ స్టడీ ప్లాన్‌ని మార్చుకోండి.

👍ALL THE BEST👍

👇మీ అభిప్రాయాలు మరియు సూచనలను మాకు కామెంట్ చేయండి👇

Indian Society Bit Bank Ebook for GROUP-2, AP Grama Sachivalayam and other APPSC Exams by Adda247 Telugu

 

Read More
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు APPSC గ్రూప్ 2 పరీక్ష కోసం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలకు నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవాలి? APPSC గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలకు భౌగోళిక శాస్త్రం ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 పరీక్షా సరళి
కొత్త సిలబస్‌తో APPSC గ్రూప్ 2 పరీక్షకు ఎలా సిద్ధం కావాలి?
APPSC గ్రూప్ 2 మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ APPSC గ్రూప్ 2 పరీక్ష పుస్తకాల జాబితా (కొత్త సిలబస్)

Sharing is caring!

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?_6.1

FAQs

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇండియన్ సొసైటీకి ప్రిపరేషన్ చిట్కాలు ఈ కధనంలో అందించాము.

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అయ్యిందా?

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 pdf 20 డిసెంబర్ 2023న విడుదలైంది