ఏ పరీక్ష లోనైనా విజయం సాధించాలి అంటే ఆ పరీక్ష యొక్క పరీక్షా శైలి, క్లిష్టత స్థాయి, సిలబస్ వంటి ప్రధమిక అంశాలపై అవగాహన అవసరం. ప్రాధమిక అంశాలను అవగతం చేసుకున్న తర్వాత పరీక్షకి అవసరమయ్యే వనరులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి, ఒక సరైన ప్రణాళిక రచించుకుని అన్నీ అంశాలపై పట్టు సాధిస్తే పరీక్షలో అడిగే ప్రశ్నలను సులువుగా సమాధానం చేయగలుగుతారు.
పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 2023 పరీక్షా సరళి
AP అనిమల్ హస్బెండ్రి డిపార్ట్మెంట్ రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన పరీక్షా విధానం గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత 20 రోజుల్లో పరీక్ష నిర్వహించబడుతుంది కాబట్టి అభ్యర్థులు ముందుగానే పరీక్షా సరళిని పై అవగాహన తెలుసుకోవాలి. పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
- పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు
- ఆన్లైన్ పరీక్ష 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏ మరియు పార్ట్ బి
- పరీక్షకు కేటాయించిన మొత్తం వ్యవధి 150 నిమిషాలు.
- 150 మల్టిపుల్ చాయిస్ ఆధారిత ప్రశ్నలు (MCQలు) ఉంటాయి ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు.
- పరీక్ష ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమాలలో నిర్వహిస్తారు.
- అలాగే, అభ్యర్థులు గుర్తించిన ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 2023 పరీక్షా సరళి |
||||
విభాగం | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు | సమయం |
A | General Studies and Mental Ability | 50 | 50 | 50 Minutes |
B | Subject Related to Animal Husbandry | 100 | 100 | 100 Minutes |
మొత్తం | 150 | 150 | 150 Minutes |
పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ స్టడీస్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలి?
పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పరీక్ష పార్ట్ A లో జనరల్ స్టడీస్ నుండి ప్రశ్నలు వస్తాయి. పార్ట్ A మొత్తం 50 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్ విభాగంలో చరిత్ర, జాగ్రఫీ, సైన్స్ & టెక్నాలజీ, పొలిటీ, ఎకానమీ, కరెంట్ అఫ్ఫైర్స్ వంటి తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. ఒక్కో సబ్జెక్టు కి సంభందించిన వనరులు కూడా సేకరించుకుని ప్రతి సబ్జెక్టు కి సరైన ప్రణాళికా రచించుకోవాలి. ఈ సబ్జెక్టులలో ముఖ్యంగా ఏ అంశాల పై పట్టు సాధించాలి అనే అంశాలను తెలుసుకోండి.
చరిత్ర: రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, భారతదేశంలో ఆంధ్రరాష్ట్రం యొక్క విశిష్టత వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రాచీన చరిత్ర, ఆధునిక చరిత్ర ప్రత్యేకంగా రాష్ట్రం కేంద్రంగా ఉన్న అంశాలు, జాతీయోద్యమంలో ఆంధ్రరాష్ట్రం యొక్క పాత్ర విభజన గురించిన అంశాల పై పట్టు సాధించాలి. ప్రతి అంశాన్ని కూలంకషంగా అవగాహన చేసుకుని కుదిరితే స్నేహితులు, మిత్రులు లేదా మీతో పాటు పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులతో చర్చించండి. ముఖ్యమైన విషయాలను ఒక పుస్తకం లేదా పేపర్లో రాసుకోండి రివిజన్ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
జాగ్రఫీ: వ్యవసాయ వనరులు, జీవ సంపద, రాష్ట్రం లో ఉన్న జీవ వైవిధ్యం గురిచి కూడా తెలుసుకోవాలి. పశు సంవర్ధక శాఖ పరీక్ష కాబట్టి వాటికి అనుగుణంగా ప్రశ్నలు అడుగుతారు. రాష్ట్రంలో పండే పంటలు, పంటల వైవిధ్యం వంటి అంశాలను తాజా పరిస్థితులతో అన్వయం చేసుకుని సన్నద్దమవ్వలి.
సైన్స్ & టెక్నాలజీ:
రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో టెక్నాలజీ ఆధ్వర్యంలో అమలవుతున్న పధకాలు, ICT విధానాలు, స్పేస్ ప్రోగ్రామ్లు, ISRO, DRDO, గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక విధానాలు ఆ కోవలో పని చేసే సంస్థలు. సైన్స్ అండ్ టెక్నాలజీ లో భారతదేశం సాధించిన అభివృద్ది, రాష్ట్ర మరియు దేశ సాంకేతిక విధానాలు, విపపట్టు నిర్వహణ అనుసరిస్తున్న విధానాలు, పర్యావరణ సంభందిత అంశాల పై పట్టు సాధించాలి. రాష్ట్ర ప్రభుత్వం మరియు అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణ కై చేపట్టిన చర్యలు, జాతీయ, రాష్ట్ర స్థాయి లో అమలవుతున్న చట్టాలు, తాజాగా చేసిన సవరణలు విధి విధానాల పై పూర్తి అవగాహన ఉండాలి.
పాలిటీ: రాజ్యాంగ ప్రాధమిక అంశాలు, చట్ట సవరణలు, రాష్ట్రప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా చట్ట సవరణలు వాటి ప్రాముఖ్యత, ప్రభావం, ఎథిక్స్, పాలనా పరమైన విషయాలు, గవర్నెన్స్, ప్రజా సేవ,
ఎకానమీ: రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, GDP, వివిధ గణాంకాలు, వడ్డీ రేట్లు, బ్యాంకింగ్ లేదా ఆర్ధిక రంగం లో చేపట్టిన తాజా సంస్కరణలు, రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఆర్ధిక ప్రగతి వంటి అన్నీ అంశాలను అర్ధం చేసుకోవాలి . పరీక్ష కు సన్నద్దమయ్యేడప్పుడు ముఖ్య విషయాలను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అమలవుతున్న పధకాలు, గణాంకాలు, వంటి వివరాల పై అధిక ప్రాధాన్యం చూపాలి.
కరెంట్ అఫ్ఫైర్స్: జాతీయ అంతర్జాతీయంగా ముఖ్య అంశాలు, రాష్టంలో జరిగిన ప్రాధమిక అంశాలు నూతనంగా జరిగిన సంఘటనలు, ముఖ్య వివరాలు తెలుసుకోవాలి కరెంట్ అఫ్ఫైర్స్ పై పరీక్ష లో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది పొలిటీ, ఎకానమీ జాగ్రఫీ వంటి విషయాలు కరెంట్ అఫ్ఫైర్స్ రూపంలో అడిగే అవకాశం ఎక్కువ కాబట్టి కరెంట్ అఫ్ఫైర్స్ పై పట్టు సాధించడం వలన మంచి మార్కులు పొందే అవకాశం ఉంది.
మెంటల్ ఎబిలిటీ: మెంటల్ ఎబిలిటీ కి సంభందించిన అంశాలు నంబర్స్, కాలిక్యులేషన్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా విశ్లేషణ, సమీకరణ వంటి అంశాలపై అవగాహన ఉండాలి వర్బల్ మరియు నాన్ వర్బల్ రీజనింగ్ అంశాలు కూడా ప్రాక్టీస్ చేయాలి.
పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పరీక్ష కి అర్హత డిప్లొమా, డిగ్రీ కాబట్టి పోటీ పరీక్ష కి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయిలో పార్ట్A విభాగం లో ఉన్న అంశాలను అవగతం చేసుకోవాలి. మీ ప్రిపరేషన్ స్థాయి లో ప్రాక్టీస్ కోసం మాక్ టెస్ట్లు కూడా చేయాలి పరీక్ష స్థాయి లో ఉండే మాక్ టెస్ట్లు మీ ప్రిపరేషన్ ను మెరుగుపరుస్తాయి. adda247 అందించే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ మాక్ టెస్ట్ను తీసుకుని మీ ప్రిపరేషన్ని మరింత వేగవంతం చేసుకోండి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |