APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోసం చరిత్రను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
ఆంధ్రప్రదేశ్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలలో చరిత్ర ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ త్వరలో APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అభ్యర్ధులు ఇప్పటి నుండే తమ ప్రిపరేషను ప్రారంభించాలి. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో చరిత్ర సబ్జెక్ట్ నుండి 30 మార్కులకు 30 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, అభ్యర్ధులు పోటీ పరీక్షల చరిత్రకు సిద్ధం కావడానికి, చరిత్ర కాలంలో రూపుదిద్దుకున్న కీలక అంశాలు మరియు సంఘటనలను ముందుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అభ్యర్థులు చరిత్ర పుస్తకాల కోసం మంచి మూలం కోసం కూడా శోధిస్తారు. ఈ కథనంలో మేము చరిత్రను చదవడానికి చిట్కాలు మరియు సలహాలను అందిస్తున్నాము. మరిన్ని వివరాలు మరియు చిట్కాలను తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ చరిత్ర ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో భారత దేశ చరిత్ర అంశాలు ఉన్నాయి. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో చరిత్ర సబ్జెక్ట్ నుండి 30 మార్కులకు 30 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి అభ్యర్ధులు చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో అంశాలను చదవాలి. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ చరిత్ర అంశాలు ఇక్కడ అందించాము
- ప్రాచీన చరిత్ర
- మధ్య యుగ చరిత్ర
- ఆధునిక చరిత్ర
APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ చరిత్రను మూడు భాగాలుగా (ప్రాచీన చరిత్ర, మధ్య యుగ చరిత్ర, ఆధునిక చరిత్ర) అని విభజించారు. దీని వలన అభ్యర్ధులకు అంశాలు చదవడానికి సులభంగా ఉంటుంది. అలాగే చరిత్రను చదవడానికి మంచి పుస్తకాలను ఎంచుకోవాలి. భారతదేశ చారిత్ర కు స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్, NCERT పుస్తకాలు వంటి స్టాండర్డ్ మేటెరియల్స్ ఉన్నాయి.
మీరు అధ్యయనం చేసిన అంశాలకు సంబంధించిన మీ స్వంత నోట్స్‌ని మీరు సిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే ఇది వారి పునర్విమర్శ వ్యవధిలో ఒక ప్రయాణానికి సహాయం చేస్తుంది. మీరు ముఖ్యమైన అంశాలు, సూత్రాలు, పాయింట్లను తప్పనిసరిగా హైలైట్ చేయాలి, తద్వారా పునర్విమర్శ వ్యవధిలో సవరించడం సులభం అవుతుంది. పుస్తకాల నుండి చదవడం కంటే చేతితో తయారు చేసిన నోట్స్ నుండి నేర్చుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలానే చదివేటప్పుడు చార్ట్స్ లాంటివి ఉపయోగించండి. అవి మీకు సులభంగా అర్దం చేసుకోవడానికి మరియు గుర్తు ఉండటానికి సహాయపడతాయి.
APPSC గ్రూప్ 2 మెయిన్స్ చరిత్ర ఎలా ప్రిపేర్ అవ్వాలి?
APPSC గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ లో ఆంధ్ర ప్రదేశ్ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర అంశం ఉంది. ఈ చరిత్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదే మొత్తం దృష్టి సారించింది. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో చరిత్ర భారతదేశానికి సంబంధించినది కాబట్టి చాలా రిఫరెన్స్ మేటెరియల్స్ ఉంటాయి. కానీ APPSC గ్రూప్ 2 మెయిన్స్ చరిత్ర కు మెటీరియల్స్ దొరకడం కష్టం. కాబట్టి అభ్యర్ధులు ముందుగా APPSC గ్రూప్ 2 మెయిన్స్ చరిత్ర కి పుస్తకాలను ఎంచుకోవాలి. అలానే పుస్తకంలో ఉన్నది అంతా చదవడం కాకుండా, APPSC గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ లో ఉన్న అంశాలు పరిశీలించి చదవాలి. APPSC గ్రూప్ 2 మెయిన్స్ చరిత్రలో ఉన్న అంశాలు ఇక్కడ ఉన్నాయి.
- పూర్వ-చారిత్రక సంస్కృతులు
- 11వ మరియు 16వ శతాబ్దాలు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు
- యూరోపియన్ల ఆగమనం మరియు బ్రిటిష్ పాలన
- ఆంధ్ర ఉద్యమం పుట్టుక మరియు పెరుగుదల
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు
APPSC గ్రూప్ 2 పుస్తకాల జాబితా 2023
ఇలా అంశాల వారీగా, ఒక్కో అంశాన్ని చదవాలి. ముందు చెపిన్నట్టు మెయిన్స్ కి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అభ్యర్థులు వీలైనంత వరకు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. APPSC గ్రూప్ 2 మెయిన్స్ చరిత్ర సబ్జెక్టు లో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. చరిత్రలో టైమ్ లైన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎవరి తరువాత ఎవరు పాలించారు అని గుర్తు పెట్టుకోవడానికి ఏమయినా ట్రిక్స్ ఉపయోగించండి.
చరిత్ర చదివేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు
- చరిత్రలో టైమ్ లైన్ ఒక చార్ట్ రూపం లో తయారు చేసుకోండి. అది రోజు చదవండి, అలా రోజు చేయడం వల్ల ఏ కాలం లో ఎవరు పరిపాలించారు అని విషయం పై కన్ఫ్యూషన్ కాకుండా ఉంటారు. అలాగే, మీరు చరిత్రకు సంబంధించిన అనేక చిన్న అధ్యాయాలకు చార్ట్‌లను ఉపయోగించవచ్చు. ఇవి చివరి నిమిషంలో రివిజన్ అలాగే సమాధానం రాయడంలో మీకు సహాయపడతాయి.
- ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడానికి ట్రిక్స్ ఉపయోగించడం సమర్థవంతమైన మార్గం. కొన్ని కీలక పదాలను ఉపయోగించడం వల్ల అధ్యయనాలు కూడా సులభతరం అవుతాయి.
- చదివేటప్పుడు ముఖ్యమైన పదాలు/సంవత్సరాలు అండర్‌లైన్ చేయడం లేదా హైలైట్ చేయడం వాటిని సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.
- చదివేటప్పుడు మీ స్వంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఈ నోట్స్ రివిజన్ అప్పుడు మేకు ఉపయోగపడుతుంది.
- ప్రతి రోజు మీరు చదవడం ప్రారంభించేప్పుడు ముందు రోజు చదివిన అంశాలను రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అనేది పరీక్షకు మీ సన్నద్ధతకు వెన్నెముక, దీనిని చాలా మంది విద్యార్థులు విస్మరిస్తారు.
- ప్రతి భాగాన్ని పూర్తి చేసిన తర్వాత అభ్యర్థులు మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
- మాక్ టెస్ట్‌లు & మోడల్ పేపర్‌లను పరిష్కరించండి – ఇది పరీక్షా వాతావరణాన్ని ఇస్తుంది మరియు అడిగే ప్రశ్నల రకాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది
- మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా పరీక్షలో అడిగే ప్రశ్నలు తొందరగా అర్ధం చేసుకోగలుగుతారు. అలాగే, పరీక్ష యొక్క ట్రెండ్ పై అవగాహన వస్తుంది
- ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అన్నిటికంటే ముందుగా, సబ్జెక్ట్‌లు, టాపిక్‌లు, పరీక్షా సరళి మరియు సంబంధిత పరీక్షల ఎంపిక ప్రక్రియ గురించి బాగా తెలుసుకోవాలి. సిలబస్ పై మంచి అవగాహన కలిగి ఉండాలి
- సిలబస్ లో అన్ని అంశాలు కవర్ అయ్యేలా మంచి ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి.
APPSC గ్రూప్ 2 కి సంబంధించిన లింక్స్ :
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |