TSPSC గ్రూప్ 2 2023-24 పరీక్ష కోసం నోట్స్ ఎలా సిద్ధం చేయాలి?
TSPSC గ్రూప్ 2 నియామకం కోసం ఆగస్టు 7 మరియు 8, 2024 న పరీక్షా నిర్వహించబోతుంది. తక్కువ గా ఉంది. అభ్యర్ధులు ఇప్పటికే తమ ప్రిపరేషన్ చాల వరకు పూర్తి చేసి ఉంటారు. అయితే, చదవడం ఒక్కటే సరిపోదు కదా.. చదివింది గుర్తు ఉండాలి అన్న, పరీక్షా చివరి నిమిషంలో రివైజ్ చేసుకోవాలి అన్ని నోట్స్ తప్పని సరిగ్గా రాసుకోవాలి. TSPSC గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్రాసెస్‌లో నోట్స్ తయారు చేయడం ఒక ముఖ్యమైన భాగం. నోట్స్ సిద్ధం చేసుకోవడం అనేది మీ ప్రిపరేషన్ లో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, సిలబస్ ను సమీక్షించడం ద్వారా మీకు నోట్స్ ఎలా తాయారు చేసుకోవాలి అనే అవగాహన వస్తుంది. TSPSC గ్రూప్ 2 సిలబస్ మరియు పరీక్షా విధానం గురించి ముందుగా సరైన అవగహన కు రావాలి, సిలబస్ ఏంటి, ఏ అంశాలు అడుగుతారు, ఎన్ని మార్కులకు ఇలా అన్ని ఒక నోట్స్ లో డిటైల్డ్ గ రాసుకోవాలి. ఏ పోటి పరీక్షా కు ఐన ముందు ఆ పరీక్షా యొక్క సిలబస్ సరిగా అర్ధం చేసుకుంటే, మీరు సగం ఉత్తీర్ణత సాధించినట్లే, కాబట్టి ముందుగా సిలబస్ బాగా అర్ధం చేసుకోవాలి, అప్పుడే మీరు TSPSC గ్రూప్ 2 కోసం సరైన ప్రణాళిక రుపొంచుకోవచ్చు.
Adda247 APP
TSPSC గ్రూప్ 2 2023-24 పరీక్ష కోసం నోట్స్
TSPSC గ్రూప్ II సిలబస్‌లో పేపర్ I, పేపర్ II, పేపర్ III మరియు పేపర్ IV అనే నాలుగు పేపర్లు ఉంటాయి. నాలుగు పేపర్లు OMR ఆధారంగా వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ద్వారా పరీక్ష నిర్వహించబడుతుంది. TSPSC గ్రూప్ II సిలబస్‌లోని సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్, హిస్టరీ & సొసైటీ, ఎకానమీ డెవలప్‌మెంట్ మరియు తెలంగాణా ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు అంశాలు లో ప్రతి పేపర్ కి 150 మార్కులు సమానంగా ఉంటాయి. అయితే, TSPSC గ్రూప్ I ప్రిలిమ్స్ పరీక్షను గమనిస్తే ప్రశ్నల చాలా కష్టంగా ఉన్నాయి. గ్రూప్ 2 లో ఇంచుమించు అదే స్థాయిలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ లో ప్రతి అంశం చాలా క్షుణ్ణంగా చదవాలి. ఈ ప్రిపరేషన్ నోట్స్ అనేది మీకు TSPSC గ్రూప్ 2 2023-24 పరీక్ష చివరి వారం రోజుల్లో పునర్విమర్శకు ఎంత గానో ఉపయోగపడుతుంది. చివరి నిమిషంలో మీరు ఆందోళన చెందకుండా ముఖ్యమైన అంశాలు చదవడానికి ఉపయోగపడుతుంది
TSPSC Group 2 Preparation strategy, Tips.
ఎక్కడ నుండి TSPSC గ్రూప్ 2 కోసం నోట్స్ ఎలా తయారు చేయాలి?
- వార్తాపత్రికలు చదవడం: TSPSC గ్రూప్ 2 పరీక్షకు పేపర్-1 : జనరల్ స్టడీస్, పేపర్-2 : చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం, పేపర్-3 : ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అంశాలు ఉన్నాయి కాబటి. రోజువారీ న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోవాలి. ఏ పోటి పరీక్షలో ఐన ప్రశ్నలు మన చుట్టూ జరిగే విషయాల మీద నే అడుగుతారు, కరెంటు అఫైర్స్, పాలిటి, కేంద్ర, రాష్ట్రలలో ముఖ్యమైన అంశాలకు TSPSC గ్రూప్ 2 పరిక్షలలో గణనీయమైన వెయిటేజీ ఉంటుంది.
- కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్రారంభించే ముందు, TSPSC గ్రూప్ 2 పరీక్షా లో కరెంట్ అఫైర్స్ ఎంత వెయిటేజీ ఉంటుంది అనేడి ఒకసారి తెలుస్కోవాలి. TSPSC గ్రూప్ 2 సిలబస్ మరియు నమూనాపై పరిమిత పరిజ్ఞానం ఉన్న అనుభవం లేని వ్యక్తి వార్తాపత్రికలను చదవడానికి మరియు సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుంది. సంపాదకీయాలు, రక్షణ వార్తలు, ఆర్థిక వ్యవస్థ, రాజ్యాంగ సవరణలు, పర్యావరణం, ప్రభుత్వ చట్టాలు మరియు ప్రణాళికలు, అంతర్జాతీయ వ్యవహారాలు, సామాజిక సమస్యలు, న్యాయపరమైన నిర్ణయాలు మొదలైనవన్నీ అత్యంత శ్రద్ధ వహించాలి.
- స్టాండర్డ్ బుక్స్ చదవడం: చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం, భారతదేశం మరియు తెలంగాణ యొక్క సామాజిక-సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం యొక్క అవలోకనం మరియు రాజకీయాలు, సామాజిక నిర్మాణం, సమస్యలు మరియు పబ్లిక్ పాలసీలు వంటి అంశాలు కోసం స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. పాలిటి కోసం లక్ష్మి కాంత్ పుస్తకం ఉత్తమమైనది. మీకు సొంతంగా చదివింది అర్ధం కావడం లేదు మరియు చదివిన అంశం నుండి సందేహాలను ఎలా తెలుసుకోవాలో అర్ధం కావడం లేదు అనుకుంటే.. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ తరగతులకు వెళ్ళండి, అక్కడ ఉండే అనుభవజ్ఞులైన ఫాకల్టీ మీ సందేహాలను నివృతి చేస్తారు. మీ సందేహాలను నివృత్తి చేసే ప్రతి అంశాన్ని మీరు నోట్స్ రాసుకోవాలి.
- రేఖాచిత్రాలు & మాప్స్ లా గుర్తు పెట్టుకోవడం: మీరు నోట్స్ రాసుకునేప్పుడు, అదే పనిగా పేరాలు పేరాలు రాసుకోవద్దు, అల రాయడం వలన మీకు పునర్విమర్శ చేసుకునే సమయంలో గందరగోళంగా ఉంటుంది, కాబట్టి, కొన్ని అంశాలను మీకు అర్ధం అయ్యేలా ఎదైన షార్ట్ మెథడ్ లో రాసుకోవడం, రేఖాచిత్రాలు & మాప్స్ లా గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన మీ సమయం అదా అవుతుంది, చదివింది బాగా గుర్తు ఉంటుంది.
- ముఖ్యమైన తేదీలు, రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ అంశాలు, జనాభా గణాంకాలు, కరెంటు అఫైర్స్ మరియు స్టాటిక్ GK వంటి అంశాలను గుర్తు ఉంచుకోవటానికి ఎదైన షార్ట్ మెథడ్ లేదా కోడ్ భాష (మీకు అర్ధం అయ్యేలా) రాసుకోవాలి.
- నోట్ మేకింగ్ సమయంలో, సంక్షిప్తత మరియు స్పష్టతపై దృష్టి పెట్టండి. అవసరమైన సమాచారాన్ని సంగ్రహించడానికి బుల్లెట్ పాయింట్లు, కీలకపదాలు మరియు చిన్న పదబంధాలను ఉపయోగించండి. పొడవైన వాక్యాలను రాయడం మానుకోండి ఎందుకంటే అవి తర్వాత శీఘ్ర పునర్విమర్శకు ఆటంకం కలిగించవచ్చు. గణనీయమైన సమయం గ్యాప్ తర్వాత కూడా మీ నోట్స్ సులభంగా అర్థమయ్యేలా చూసుకోండి.
- మీ నోట్స్‌లో, ముఖ్యంగా పాలిటీ, ఎకానమీ మరియు సొసైటీ వంటి విషయాల కోసం సంబంధిత ఉదాహరణలు మరియు కేస్ స్టడీస్‌ను పొందుపరచండి.
- మైండ్ మ్యాప్‌లు మరియు ఫ్లోచార్ట్‌ల వంటివి సంక్లిష్టమైన అంశాలను సరళీకృతం చేయడానికి మరియు విభిన్న విషయాల మధ్య కనెక్షన్‌లను ఏర్పరచడానికి శక్తివంతమైన సాధనాలు. ఆకర్షణీయమైన మరియు సులభంగా గుర్తుకు తెచ్చుకునే గమనికలను రూపొందించడానికి రంగులు మరియు రేఖాచిత్రాలను ఉపయోగించండి.
- ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి: తెలంగాణ యొక్క ఆర్థిక అభివృద్ధి, మార్పు సమస్యలు వంటి అంశాల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ను చదవాలి.
- తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు: తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు జరిగాయి. వాటిని తెలంగాణ ఆలోచన , తెలంగాణ తొలి దశ ఉద్యమం (1948-1970), సమీకరణ దశ (1971-1990), తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (1991-2014) అని విభజించారు. పేపర్ 4 మొత్తం తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు పైన 150 మార్కులకు అడుగుతారు, పేపర్ 4 స్కోరింగ్ పేపర్ కాబట్టి మీరు ఈ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పుస్తకాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఉత్తమమైన పుస్తకాలను ఎంచుకోండి, లేదా ఉత్తమమైన కోచింగ్ క్లాస్సేస్ వింటూ నోట్స్ రాసుకోండి.
నోట్స్ ఎలా సిద్ధం చేసుకోవడం తో పాటు, ఉత్తమమైన TSPSC గ్రూప్ 2 మోక్ టెస్ట్ లు ఎక్కువగా ప్రయతించండి, మీరు ఇప్పటివరకు చదువిన అన్ని అంశాల మీద మోక్ టెస్ట్ లు, క్విజ్ లు రాయండి. ఇలా మోక్ టెస్ట్ లు ప్రత్నించడం వలన మీ ప్రిపరేషన్ లో ఎంత వరకు మీరు మెరుగ్గా ఉన్నారో తెలుసుకోవచ్చు. Adda 247 Telugu మీకోసం తెలంగాణ ప్రైమ్ టెస్ట్ ప్యాక్ ను అతి తక్కువ ధరకే అందిస్తుంది.
TSPSC GROUP-2, GROUP-3 General Studies
ప్రత్యేకతలు:
- వివరణాత్మక పరిష్కారాలతో తాజా నమూనా ఆధారంగా మాక్ & టాపిక్ పరీక్షలు
- మొత్తం & సెక్షనల్ విశ్లేషణ, ర్యాంక్‌లు మరియు టాపర్‌తో పోలిక
- యాప్, టెలిగ్రామ్ సమూహాలు & ఆఫ్‌లైన్ కేంద్రాలలో వ్యక్తిగతంగా సందేహ నివృత్తి పొందండి
- ఆఫ్‌లైన్ సెంటర్‌లలో సెమినార్ & టాపర్ టాక్స్ పొందవచ్చు
- ఆఫ్‌లైన్ కేంద్రాలలో వ్యక్తిగతంగా కౌన్సెలింగ్, ఫిజికల్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్ పొందవచ్చు
- క్రమం తప్పకుండా ఇమెయిల్‌లో ప్లానర్, మునుపటి సంవత్సరం పేపర్‌లు & ప్రిపరేషన్ చిట్కాలు పొందవచ్చు.
Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి