TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం టాపిక్‌లను త్వరగా రివైజ్ చేయడం ఎలా?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC గ్రూప్ 4 పరీక్షను 01 జూన్ 2023 తేదీన నిర్వహించనుంది. TSPSC గ్రూప్ 4 పరీక్ష లో మంచి మార్కులు సాధించడానికి అభ్యర్ధులు తాము చదివిన అన్నీ అంశాలను మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి. TSPSC గ్రూప్ 4 పరీక్షకు తక్కువ సమయం ఉంది కాబట్టి, అభ్యర్థులు తమ రివిజన్ ను వీలైనంత త్వరగా చేయాలి. TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం టాపిక్‌లను త్వరగా రివైజ్ చేయడం ఎలా? అనే అభ్యర్ధుల సందేహానికి మేము ఈ కధనంలో కొన్ని సలహాలు మరియు సూచనలు అందించాము. మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని పూర్తిగా చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC గ్రూప్ 4 పరీక్ష అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC గ్రూప్ 4 పరీక్షను 01 జూన్ 2023 తేదీన నిర్వహించనుంది. TSPSC గ్రూప్ 4 పరీక్ష యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TSPSC గ్రూప్ 4 పరీక్ష అవలోకనం | |
సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (TSPSC) |
పోస్టు పేరు | TSPSC గ్రూప్ 4 |
పోస్టుల సంఖ్య | 9168 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
పరీక్షా తేదీ | 01 జులై 2023 |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష |
అధికారిక వెబ్సైట్ | http://tspsc.gov.in// |
TSPSC గ్రూప్ 4 పరీక్ష విధానం
TSPSC గ్రూప్ 4 పరీక్ష 1 జూలై 2023న నిర్వహించబడుతుంది. TSPSC గ్రూప్ 4 పరీక్ష కు సిద్ధం అయ్యే అభ్యర్ధులు TSPSC గ్రూప్ 4 పరీక్ష సరళి కోసం తెలుసుకోవాలి. తద్వారా, TSPSC గ్రూప్ 4 పరీక్ష లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. TSPSC గ్రూప్ 4 పరీక్ష విధానం ఇక్కడ అందించాము.
- TSPSC గ్రూప్ 4 పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి- పేపర్ I & పేపర్ II
- ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు ఉంటాయి
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. మొత్తం మార్కులు 300 ఉంటాయి.
- TSPSC గ్రూప్ 4 పరీక్ష OMR విధానంలో ఉంటుంది
- ప్రతి పేపర్‌కు వ్యవధి 150 నిమిషాలు మరియు మొత్తంగా TSPSC గ్రూప్ 4 పరీక్ష వ్యవధి 5 గంటలు.
- పరీక్షా ఇంగ్షీషు మరియు తెలుగు మాద్యమంలో ఉంటుంది.
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి |
పేపర్ 1 | జనరల్ నాలెడ్జ్ | 150 | 150 | 150 నిముషాలు |
పేపర్ 2 | సెక్రటేరియల్ అబిలిటీస్ | 150 | 150 | 150 నిముషాలు |
మొత్తం | 300 | 300 |
TSPSC గ్రూప్ 4 సిలబస్ రివిజన్ చేయడానికి సలహాలు
TSPSC గ్రూప్ 4 యొక్క పేపర్-1 అభ్యర్థుల సాధారణ పరిజ్ఞానాన్ని తనిఖీ చేయడం కోసం నిర్వహిస్తారు, అంటే అభ్యర్థి ప్రస్తుత వ్యవహారాల గురించి బాగా అప్‌డేట్ చేయాలి మరియు మంచి సాధారణ జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి, గ్రూప్ 4 పరీక్షకు కోసం అభ్యర్ధులు రోజు న్యూస్ పేపర్ చదవాలి. వార్తాపత్రికలో మీరు చదివిన ప్రతి ముఖ్యమైన సంఘటనను మీరు గమనించినట్లయితే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
TSPSC గ్రూప్ 4 పేపర్ I లో కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, పర్యావరణ సమస్యలు, భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం, తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర విధానాలు ఇలాంటి అంశాలు ఉన్నాయి. అభ్యర్థులు ఈ అంశాలను చదవడం కోసం స్టాండర్డ్ మెటీరియల్స్ ఉపయోగించి ఉంటారు మరియు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు. కాబట్టి, అభ్యర్ధులు మొత్తం మెటీరియల్ అంతా చదవాలి అంటే సమయం సరిపోదు కాబట్టి, ఈ షార్ట్ నోట్స్ చదవండి
TSPSC గ్రూప్ 4 పేపర్ II లో మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ మరియు నాన్ వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు మొదలైన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలు కేవలం ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మీరు పరిష్కరించగలరు. ఇప్పుడు ఉన్న సమయం లో ప్రతి అంశం ప్రాక్టీస్ చేయాలంటే కుదరదు కాబట్టి, వీలైనంత వరకు ఫార్ములా మరియు ట్రిక్స్ రివైజ్ చేయండి
TSPSC గ్రూప్ 4 టాపిక్‌లను త్వరగా రివైజ్ చేయడానికి సలహాలు
రివిజన్ (పునర్విమర్శ) అనేది కీలకమైనది
పరీక్షకు సంబంధించిన కీలక అంశాలను రివైజ్ చేయండి. ఇది వారి జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి మరియు వారి నిలుపుదల శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మీరు ఇంతకు ముందు నుండే పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, పరీక్షలో ఏ అంశాలు ముఖ్యమైనవో మీకు అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యమైన సబ్జెక్ట్స్ మీద దృష్టి సారించాలి
పాత టాపిక్స్‌ని మాత్రమే రివైజ్ చేయండి
పరీక్ష దాదాపు డోర్‌స్టెప్‌లో ఉన్నందున, అభ్యర్థులు కొత్త అంశాలతో ప్రారంభించకుండా ఉండటం చాలా అవసరం. కొత్త విషయాలను చదవడం వలన మీరు గందరగోళానికి గురవుతారు మరియు చివరి క్షణాలలో మీ దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. మీరు ఇప్పటికే చదివిన మరియు గత కొన్ని నెలలుగా సిద్ధం చేసిన వాటిని రివైజ్ చేయడం వలన మీరు అంతకు ముందు నుండే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ విశ్వాస స్తాయి ని పెంచడానికి సహాయపడుతుంది.
షార్ట్ నోట్స్
మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడు ప్రతి అంశంతో పాటు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు. ఈ స్టడీ నోట్స్ యొక్క జ్ఞాపకశక్తిని పునరుద్ధరించడంలో మీకు సహాయపడుతుంది. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే, మొత్తం టాపిక్ అంతా చదవకుండా, సంక్షిప్తంగా, సారాంశాలను చదవడం మీకు సమయం మరియు శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుంది.
మునుపటి సంవత్సరం ప్రశ్నల పత్రాల సాధన
మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే, మునుపటి సంవత్సరం ప్రశ్నల పత్రాల సాధన అనేది త్వరగా అన్నీ టాపిక్స్ ను రివైజ్ చేయడానికి సహాయపడుతుంది. మునుపటి సంవత్సరం ప్రశ్నల పత్రాల సాధన చేయడం వల్ల అభ్యర్థులు మునుపటి సంవత్సరాల్లో కనిపించే ప్రశ్నల రకాలను బాగా అర్థం చేసుకుంటారు. వారు ప్రశ్నల స్వభావాన్ని మరియు పరీక్ష సమయంలో ఈ ప్రశ్నలను ఎలా ప్రయత్నించాలి అనేదానిని అంచనా వేయగలరు. ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థులు మీరు చదివిన అంశాలలో ప్రశ్నలు ఉంటాయి కాబట్టి అవి మీ రివిజన్ కి ఉపయోగపడతాయి.
మీ మైండ్‌ని కూల్‌గా మరియు ఒత్తిడి లేకుండా ఉంచుకోండి
TSPSC గ్రూప్ 4 పరీక్షకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి అభ్యర్ధులలో ఆందోళన అనేది సహజం. మీరు అన్నీ టాపిక్స్ రివైజ్ చేయలేదని కంగారూ పడాల్సిన అవసరం లేదు. మీరు అంతకు ముందు చదివ్యయఫరు కాబట్టి మీరు హయ అంశానికి సంబంధించిన ప్రశ్నలను చూడగానే అవి మీకు గుర్తు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున, మీరు మీ మెదడు పై ఒత్తిడి పెంచకండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మీరు రాణించే అవకాశం ఉంది
Also Check TSPSC Group 4 Related Posts:
TSPSC Group 4 Notification | |
TSPSC Group 4 Exam Date | |
TSPSC Group 4 Syllabus | |
TSPSC Group 4 Previous year Cut off | |
TSPSC Group 4 Previous year Question Paper |
|
TSPSC Group 4 Age Limit | |
TSPSC Group 4 Salary |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |