విపత్తుల నుండి పౌరులను రక్షించడానికి, ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి మరియు కఠినమైన నిబంధనలను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) మార్గదర్శకాలు మరియు విధానాలను జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన ఈ స్వతంత్ర సంస్థ ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతంతో సహా హైదరాబాద్ అంతటా విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తుల రక్షణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
అసలు హైడ్రా అంటేఏమిటీ
- హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డిహైడ్రాను ఏర్పా టు చేశారు.
- చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మా ణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధిఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుంది.
- హైడ్రా ఛైర్మన్ ముఖ్యమంత్రి వ్యవహరించనున్నా రు. ఉమ్మడిరంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, CS, DGP, ప్రిన్సి పల్ సెక్రెట్రెరీ GHMC సభ్యు లుగా ఉంటారు.
Adda247 APP
హైడ్రా ఏర్పాటు మరియు పాలన
హైడ్రా ఏర్పాటు, బాధ్యతలు, కార్యాచరణ విధానాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC ) పరిధిలో, చుట్టుపక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలో 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పనిచేస్తుంది. ఈ సంస్థకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లేదా కమిషనర్ గా ఉన్నత స్థాయి సీనియర్ అధికారి నాయకత్వం వహిస్తారు, ఉన్నత స్థాయి పర్యవేక్షణ మరియు సమన్వయాన్ని నిర్ధారిస్తారు.
హైడ్రా ఏం చేస్తుంది.
- హైడ్రా అంటే కేవలం అక్రమ కూల్చి వేతలు మాత్రమే కాదు. సిటీని ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడానికి కృషిచేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి పజ్రలను కాపాడేసంస్థ ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తుంది .
- ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, పార్కు లు, నాలాలు, స్మశాన వాటికలు వంటివాటిని కబ్జా కాకుండా చూస్తుంది. పభ్రుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లోనగరానికి అండగా ఉండటం దీని పధ్రాన లక్ష్యా లు.
- ఇప్పు డున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66 శాతం కబ్జాకు గురయ్యా యి. వీటి రక్షణ కోసమే హైడ్రా ను ఏర్పాటు చేయడం జరిగింది.
12 మందితో పాలకమండలి
- హైడ్రా పాలకమండలి చైర్మన్ గా హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, MAUD మినిస్టర్ హోదాలో సభ్యు డిగానూ రేవంత్రెడ్డి ఉంటారు.
- రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, GHMC, ముఖ్య కార్యదర్శి, DGP, రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సి పల్ సెక్రటరీ, MAUD ప్రిన్సి పల్ సెక్రటరీ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్ సభ్యులుగా ఉంటారు.
- హైడ్రా కమిషనర్ గా నియమించిన IPS ఆఫీసర్ ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు
15 మందితో సబ్ కమిటీ
- ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)గా ఏర్పా టు చేసున్నట్టు 99 జీవోలో పేరొన్నారు.
- నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్-2005 పక్రారం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ పేరుతో 15 మంది అధికారులతో కూడిన ఇంకో సబ్ కమిటీని ఏర్పా టు చేశారు. ఈ కమిటీకి MAUD ప్రిన్సి పల్ సెక్రటరీ చైర్మన్ గా ఉంటారు
- హైడ్రా కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, PCCF, డిజాస్టర్ రెస్పా న్స్ DG, ఫైర్ సర్వీసెస్ DG, మెట్రోవాటర్, సీవరేజీ బోర్డు ఎండీ, HMDA కమిషనర్, GHMC కమిషనర్, మెట్రోరైల్ ఎండీ, SPDCL ఎండీ, పబ్లిక్ హెల్త్ ENC, TCUR పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, మున్సి పల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఈ సబ్ కమిటీ చైర్మన్ సమాయానుకూలంగా ఇతర సభ్యులను నామినేట్ చేస్తారని జీవోలో పేరొన్నా రు. TQR సబ్ కమిటీ పాలకమండలికి సహాయ సహకారాలు అందిస్తుంద
- విపత్తు నిర్వహణ, పణ్రాళికలు, విధివిధానాలను అమలుచేయడంలో ఒక పాలకమండలి తరహాలో వ్యవహరించనున్నది. కాగా ఈ పాలకమండలిలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, చాయతీల మేయర్లు, చైర్మన్లు, సర్పంచులకు చోటు దక్కలేదు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |