Hyderabad metro rail first in India to start ozone-based sanitisation of coaches, ఓజోన్ ఆధారిత కోచ్‌ల శానిటైజేషన్‌ను ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రైలు :
మెట్రో రైలు ప్రయాణీకులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్.. దేశంలోనే మొదటి సారిగా మెట్రో రైల్‌లో ఓజోన్ ఆధారిత శానిటైజేషన్‌ను ట్రైన్ కోచ్‌లలో ఏర్పాటు చేసింది. ఈ ప్రక్రియ ప్రారంభ సూచికగా, కరోనా నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణాన్ని అందించగలమనే నమ్మకాన్ని ప్రయాణికులకు అందిస్తూ.. మూడు పోర్టబల్ ఓజోకేర్ మొబిజోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్రైన్ కోచ్ లను పరిశుభ్రం చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. గాలితో పాటు ఉపరితలాలను శానిటైజ్ చేయడానికి హాస్పిటల్స్, హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలలో విరివిగా ఓజోన్ వినియోగించడంతో పాటుగా నీటి శుద్ధి కోసం కూడా వినియోగించనున్నారు.
గత కొద్ది నెలలుగా మెట్రో కోచ్‌లలో ఓజోకేర్ మొబిజోన్ యంత్రసామాగ్రి పనితీరు పరీక్షలను హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహించింది. దీనిని అనుసరించి ఎన్‌ఏబీఎల్ ధృవీకృత ల్యాబ్.. ఈ శానిటైజేషన్ సామర్థ్యం పరిశీలించింది. సమర్థవంతంగా ఇది పనిచేస్తుందని నిర్థారించుకున్న తరువాత హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు ఓజోకేర్ మొబిజోన్ యంత్రసామాగ్రిని మెట్రో కోచ్‌ల శానిటైజేషన్ కోసం వినియోగిస్తుంది. మూడు అత్యున్నత ఓజోకేర్ మొబిజోన్ యంత్ర పరికరాలను పరిచయం చేయడంపై తామెంతో సంతోషంగా ఉన్నామని ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి అన్నారు. ఇవి 99% సూక్ష్మజీవులను అంతం చేస్తాయని, మెట్రో ప్రయాణీకులకు సురక్షిత ప్రయాణ అనుభవాలను అందించగలమనే భరోసా ఇస్తామని వెల్లడించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- తెలంగాణ రాజధాని: హైదరాబాద్;
- తెలంగాణ గవర్నర్: తమిళిసై సౌందరరాజన్;
- తెలంగాణ ముఖ్యమంత్రి: కె. చంద్రశేఖర రావు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************