Hyderabad Welcomes New Police Chief | హైదరాబాద్ కు కొత్త పోలీస్ కమిషనర్
హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (CP)గా సందీప్ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఎన్నికల సంఘం హైదరాబాద్ కమిషనర్ సహ తెలంగాణ లో ఉన్న వివిధ పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ లు మొత్తం 20 మందిని బదిలీ చేసింది. అందులో భాగం గా గత కమిషనర్ CPఆనంద్ గారు కూడా ఉన్నారు ఆయన స్థానం లోకి సందీప్ శాండిల్యగారు నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (TSPICC)లో ఉన్న కమిషనర్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీనియర్ IPS అధికారి సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించారు.
సందీప్ శాండిల్య గురించి
సందీప్ శాండిల్య, 1993 బ్యాచ్ IPS అధికారి, ఈయనకు వివిధ విభాగాలలో అనుభవం తో పాటు పలు అవార్డు లు అందుకున్నారు. గోదావరిఖని ASPగా భాద్యతలు ప్రారంభించిన ఈయన వివిధ పడవులతో పాటు DIG CID, IG పర్సనల్, Addl.DG రైల్వేస్ మరియు డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ లలో పనిచేశారు. 2002లో మెరిటోరియస్ సర్వీస్ కోసం ఇండియన్ పోలీస్ మెడల్, 2004లో అంతరిక్ సురక్షా సేవా పాఠక్, 2018లో విశిష్ట సేవకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ మరియు, గ్యాలంట్రీ అవార్డు లు అందుకున్నారు.
ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రతిపాదిత భర్తీ జాబితాను ECకి పంపగా, పలువురి పేర్లను ఖరారు చేసింది. తెలంగాణలో కొత్త IAS, IPS అధికారుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. పది జిల్లాలకు కొత్త పోలీసు సూపరింటెండెంట్‌లు (SP), వరంగల్ మరియు నిజామాబాద్‌లకు కొత్త కమిషనర్లు నియమితులయ్యారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |