IBPS RRB క్లర్క్ లో ప్రిలిమినరీ మరియు మెయిన్స్ రెండు దశలను కలిగి ఉంటుంది. మెయిన్స్ మరియు ప్రిలిమ్స్ పరీక్షలకు భిన్నమైన పరీక్షా విధానం ఉంది. ప్రిలిమ్స్ పేపర్‌కు మొత్తం 45 నిమిషాలు ఉంటుంది, మెయిన్స్‌కు 2 గంటలు కేటాయించారు. ఈ కథనం లో మేము IBPS RRB క్లర్క్ 2024 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి ని అందించాము.
IBPS RRB క్లర్క్ పరీక్షా విధానం
IBPS RRB క్లర్క్ పోస్టుకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది, అయితే రెండు దశల పరీక్షకు పరీక్ష సరళి భిన్నంగా ఉంటుంది. IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు మరియు మెయిన్స్ పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది.
Adda247 APP
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా విధానం
- IBPS RRB క్లర్క్ పరీక్ష MCQ నమూనాలో ఆన్‌లైన్‌లో జరుగుతుంది.
- ఈ పరీక్షలోని అన్ని విభాగాలు (ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం & హిందీ భాషా విభాగం మినహా) ఇంగ్లీష్ & హిందీలో అందుబాటులో ఉంటాయి.
- రీజనింగ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ అనే రెండు విభాగాలను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 45 నిమిషాల సమయం అందించబడుతుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 1/4వ మార్కుల కోతతో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది
- అభ్యర్థులు ప్రతి విభాగం యొక్క కట్-ఆఫ్‌ను తప్పనిసరిగా క్లియర్ చేయాలి.
IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా విధానం | ||||
క్ర.సం. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | రీజనింగ్ | 40 | 40 | మిశ్రమ సమయం 45 నిమిషాలు |
2 | న్యూమరికల్ ఎబిలిటీ | 40 | 40 | |
మొత్తం | 80 | 80 |
IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్షా విధానం
- IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్ష లో 5 అంశాలు (రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్/ ఫైనాన్సియల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్/హిందీ, కంప్యూటర్ నాలెడ్జ్) అంశాలు ఉంటాయి.
- అన్నీ అంశాలకు కలిపి 2 గంటల మిశ్రమ సమయం ఉంటుంది.
- అడిగే మొత్తం ప్రశ్నల సంఖ్య గరిష్టంగా 200 మార్కులకు 200 ఉంటుంది.
- IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్షవిధానం దిగువ పట్టికలో అందించాము.
IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్షా విధానం | ||||
క్ర.సం. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | రీజనింగ్ | 40 | 50 | మిశ్రమ సమయం 2 గంటలు |
2 | జనరల్ అవేర్‌నెస్/ ఫైనాన్సియల్ అవేర్‌నెస్ | 40 | 40 | |
3 | న్యూమరికల్ ఎబిలిటీ | 40 | 50 | |
4 | ఇంగ్లీష్/హిందీ | 40 | 40 | |
5 | కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 20 | |
మొత్తం | 200 | 200 |
Read More: | |
IBPS RRB 2024 కి ఎలా దరఖాస్తు చేయాలి? | IBPS RRB PO మరియు క్లర్క్ రాష్ట్రాల వారీగా ఖాళీలు |
IBPS RRB క్లర్క్ సిలబస్ | IBPS RRB క్లర్క్ నోటిఫికేషన్ 2024 |