ICAR IARI పరీక్షా విధానం: ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI), న్యూఢిల్లీ ICAR హెడ్‌క్వార్టర్స్ మరియు ICAR ఇన్‌స్టిట్యూట్‌ల కోసం ICAR IARI అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 కింద 462 అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించాలి. మరియు ICAR IARI పరీక్ష కోసం ప్రేపరషన్ మొదలు పెట్టె ముందు IARI పరీక్షా సరళి తెలుసుకోవాలి. ఎగ్జామ్ అథారిటీ నిర్వహించే మూడు-దశల ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్-మెయిన్స్-స్కిల్ టెస్ట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. ప్రిలిమ్స్ & మెయిన్స్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్) కోసం పిలుస్తారు.ఈ కథనం లో IARI పరీక్షా సరళి సంబంధించిన పూర్తి వివరాలు తనిఖీ చేయండి.
ICAR IARI పరీక్షా విధానం పూర్తి వివరాలు
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IARI)లో 462 అసిస్టెంట్ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు IARI అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 ముఖ్యాంశాల కోసం దిగువ పట్టికను చూడవచ్చు.
ICAR IARI పరీక్షా సరళి- అవలోకనం | |
సంస్థ | ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI), న్యూఢిల్లీ |
పోస్ట్ పేరు | అసిస్టెంట్ పోస్టులు |
మొత్తం ఖాళీలు | 462 |
వర్గం | Government Jobs |
అర్హత | గ్రాడ్యుయేట్ డిగ్రీ |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 05 మే 2022 |
ఆన్‌లైన్ అప్లికేషన్ | 07 మే 2022 నుండి 01 జూన్ 2022 వరకు |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్ – మెయిన్స్ – స్కిల్ టెస్ట్ |
అధికారిక వెబ్‌సైట్ | iari.res.in |
ICAR IARI అసిస్టెంట్ ఎంపిక ప్రక్రియ
ICAR IARI ఎగ్జామ్ అథారిటీ నిర్వహించే మూడు-దశల ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్-మెయిన్స్-స్కిల్ టెస్ట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. ప్రిలిమ్స్ & మెయిన్స్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్) కోసం పిలుస్తారు.
ICAR IARI పరీక్షా విధానం
ICAR IARI అసిస్టెంట్ లో రెండు వ్రాత పరీక్షలు (ప్రిలిమ్స్ & మెయిన్స్) ఉంటాయి మరియు స్కిల్ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేయడానికి అభ్యర్థులు ప్రతి పరీక్షలో అర్హత సాధించాలి. దిగువ విభాగం నుండి ప్రతి దశకు IARI పరీక్షా సరళి, మార్కింగ్ స్కీమ్ మరియు సమయ వ్యవధిని తనిఖీ చేయండి.
IARI అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షా విధానం 2022
- IARI అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షలో 4 భాగాలు 25 ప్రశ్నలు ఉంటాయి.
- ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి
- ప్రతి సరైన సమాధానానికి, 2 మార్కులు ఇవ్వబడతాయి.
- ప్రతి తప్పు సమాధానానికి 1/3వ మార్కు కోత విధిస్తారు.
- ప్రిలిమ్స్ పరీక్షను పూర్తి చేసే వ్యవధి 1 గంట మరియు స్క్రైబ్ అభ్యర్థులకు, వ్యవధి 1 గంట 20 నిమిషాలు.
భాగం | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | వ్యవధి |
A | జనరల్ ఇంటెలిజెన్స్ | 25 | 50 | 1 గంట (60నిమిషాలు) |
B | జనరల్ అవేర్నెస్ | 25 | 50 | |
C | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 25 | 50 | |
C | ఇంగ్లీష్ | 25 | 50 | |
Total | 100 | 200 |
IARI అసిస్టెంట్ మెయిన్స్ పరీక్షా సరళి 2022
- IARI అసిస్టెంట్ మెయిన్స్ పరీక్షలో పేపర్-I ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది మరియు పేపర్-II డిస్క్రిప్టివ్ ఉంటుంది.
- పేపర్-1కి 2 గంటలు మరియు పేపర్-II వ్యవధి 1 గంట సమయం కేటాయిస్తారు
- డిస్క్రిప్టివ్ పేపర్‌లో ఎస్సే, ప్రిసిస్, లెటర్, అప్లికేషన్స్ మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | వ్యవధి |
I | క్వాంటిటేటివ్ అబిలిటిస్ | 50 | 100 | 2 గంటలు |
ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ | 50 | 100 | ||
II | డిస్క్రిప్టివ్ పేపర్ (ఇంగ్లీష్ & హిందీ) | 100 | 1 గంట |
ICAR IARI అసిస్టెంట్ స్కిల్ టెస్ట్
ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు IARI అసిస్టెంట్ స్కిల్ టెస్ట్ (కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్)లో హాజరు కావాలి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్ మరియు స్లయిడ్‌ల జనరేషన్ అనే మూడు మాడ్యూళ్లను కలిగి ఉన్న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు వారు హాజరు కావాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) వ్యవధి 15 నిమిషాలు మరియు మాడ్యూల్స్ ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించబడతాయి.
Also check: తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022
ICAR IARI పరీక్షా సరళి-తరచుగా అడిగే ప్రశ్నలు
Q1. IARI రిక్రూట్‌మెంట్ 2022 కింద ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి?
జవాబు మొత్తం 462 అసిస్టెంట్ ఖాళీలు విడుదల చేయబడ్డాయి.
Q2. IARI రిక్రూట్‌మెంట్ 2022 కింద అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీస అర్హత ఏమిటి?
జవాబు ICAR అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి
Also Attempt: To Attempt more free mock tests click here
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 App for All Competitive Examinations