ప్రపంచవ్యాప్తంగా రైతుల కోసం IFFCO ‘నానో యూరియా’ ను ప్రవేశపెట్టింది.
- ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ను ప్రవేశపెట్టింది. IFFCO విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, భారతదేశంలో ఆన్‌లైన్-ఆఫ్‌లైన్ విధానంలో జరిగిన 50వ వార్షిక సమావేశంలో ప్రపంచంలోని మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్‌ను ప్రవేశపెట్టారు.
నానో యూరియా లిక్విడ్ గురించి:
- నానో యూరియా లిక్విడ్ ను దాని శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ‘ఆత్మనీర్భర్ భారత్‘, ‘ఆత్మనీర్భర్ కృషి‘కి అనుగుణంగా కలోల్ లోని నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ లో అభివృద్ధి చేసిన యాజమాన్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక సంవత్సరాల పరిశోధన తరువాత దేశీయంగా అభివృద్ధి చేశారు.
- నానో యూరియా లిక్విడ్ మొక్కల పోషణకు సమర్థవంతమైనదిగా కనుగొనబడింది, ఇది మెరుగైన పోషకాహార నాణ్యతతో ఉత్పత్తిని పెంచుతుంది.
- ఇది భూగర్భ నీటి నాణ్యతపై భారీ సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, గ్లోబల్ వార్మింగ్ లో ఘననీయమైన తగ్గుదల వాతావరణ మార్పులు మరియు సుస్థిరాభివృద్ది పై ప్రభావం చూపుతుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- IFFCO ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ;
- IFFCO స్థాపించబడింది: 3 నవంబర్ 1967, న్యూఢిల్లీ;
- IFFCO ఛైర్మన్: బి.ఎస్. నకై;
- IFFCO ఎం.డి & సి.ఇ.ఒ: డాక్టర్ యు.ఎస్ అవస్తి.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి