Telugu govt jobs   »   TSPSC Group-1   »   TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి అభ్యర్థులకు...
Top Performing

Important Instructions for TSPSC Group 1 Prelims Candidates | TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సర్వం సిద్ధం, అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టుల కోసం TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు TSPSC పకడ్బందీ ఏర్పాట్లు చేసింది, 31 జిల్లాల్లోని 897 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. 09 జూన్‌ 2024న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1. 00గంట వరకు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 2024 లో విడుదల చేసిన TSPSC గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ కు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అని TSPSC తెలిపింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా తగ్గిన జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది TSPSC , నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని ప్రకటించింది.

TSPSC Group 1 Prelims Hall Ticket 2024

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

563 TSPSC గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం, బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, SP మరియు ఇతర ఉన్నత అధికారులతో TSPSC సమావేశమైంది. గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి విషయాల వలన TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ 2 సార్లు రద్దయింది, ఈసారి ఎటు వంటి తప్పులకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతుంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు విడుదల

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ రాసే అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలను వెబ్‌నోట్‌ ద్వారా TSPSC జారీ చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇవ్వబడిన అన్ని సూచనలను చదవాలి మరియు అనుసరించాలి అవి:

  • అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన OMR పత్రాలు అందజేస్తామని వెల్లడించింది.
  • అభ్యర్థులు (i) బ్లాక్ / బ్లూ బాల్ పాయింట్ పెన్నులు మరియు (ii) తాజా ఒరిజినల్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో కూడిన హాల్ టిక్కెట్‌ను మాత్రమే తీసుకువెళ్లాలి (iii) ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ID కార్డ్‌ని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి.
  • పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫొటో బయోమెట్రిక్‌ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వనివారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టంగా పేర్కొంది. ఈ బయోమెట్రిక్‌ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ద్రువీకరించుకుంటామని పేర్కొన్నారు.
  • అభ్యర్థుల బయోమెట్రిక్‌ను ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలో 09 జూన్‌ 2024న ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్‌ పూర్తయ్యేవరకు అభ్యర్థులెవరూ పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేదు.
  • బయోమెట్రిక్‌లో వేలిముద్రలు తీసుకునేందుకు వీలుకాకుంటే. అభ్యర్థి ఫొటోను తీసుకుని, ఇంక్‌ప్యాడ్‌ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్‌గా తీసుకుంటారు.
  • అభ్యర్థుల చేతులకు గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు. ఇవి ఉండటం వలన వేలిముద్రలు తీసుకునే సమయం లో ఇబ్బందులు తలెత్తవచ్చు.
  • ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్‌ పదాలు, వ్యాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లిష్‌ వర్షన్‌ కాపీని పరిగణనలోకి తీసుకుంటారు.
  • అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్‌టికెట్‌ నంబరు, ఫొటో, పేరు, తండ్రి, తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్‌ వివరాలను ముద్రించిన OMRను అందిస్తారు. ఇందులో తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలి, వెంటనే సాదా OMR పత్రాన్ని పొందాలి.
  • OMR లో సమాధానాలు గుర్తించేందుకు, పొరపాట్లు జరగకుండా ప్రాక్టీస్‌ చేసేందుకు నమూనా OMR పత్రాన్ని కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచింది. Click here to Download Sample OMR Sheet
  • TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తయిన తరువాత OMR పత్రాలను స్కానింగ్‌ చేసి, అభ్యర్థుల డిజిటల్‌ కాపీలు వెబ్‌సైట్లో పొందుపరుస్తారు.
  • పరీక్షకేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రం గేట్లు 10 గంటలకు మూసివేస్తారు. ఆ తరువాత కేంద్రంలోకి ఎవరినీ అనుమతించరు.
  • డౌన్ లోడ్ చేసిన హాల్ టికెట్ లో అస్పష్టమైన/అనుచితమైన ఫోటో ఉంటే, అభ్యర్థి చివరిగా చదువుకున్న సంస్థ యొక్క గెజిటెడ్ అధికారి/ ప్రిన్సిపాల్ చేత ధృవీకరించబడిన మూడు (3) పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను అండర్ టేకింగ్ (ఫార్మాట్ https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది) తో పాటు తీసుకురావాలి మరియు పరీక్ష హాల్ లోని ఇన్విజిలేటర్ కు అందజేయాలి, లేనిపక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు.
  • పరీక్షకు వచ్చే ముందు ముద్రించిన హాల్ టికెట్‌లో అందించిన స్థలంలో జిగురును ఉపయోగించి (3) మూడు నెలల ముందు కాప్చర్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తప్పనిసరిగా అతికించాలి.
  • కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ పరికరాలు, గడియారం, మ్యాథమెటికల్ టేబుల్స్, లాగ్ బుక్స్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్ లు, జోలాస్, పౌచ్ లు, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్ లు, లూజ్ షీట్స్, జువెలరీ లేదా ఏదైనా ఇతర గాడ్జెట్స్/ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేదా రికార్డింగ్ పరికరాలను తమ శరీరం లేదా జేబులకు కట్టుకుని తీసుకురావడానికి అభ్యర్థులకు అనుమతి లేదు.
  •  దానిని కలిగి ఉండటం వల్ల పరీక్ష/ పరీక్షలకు అభ్యర్థిత్వం చెల్లదు. అభ్యర్థి బూట్లు కాకుండా కేవలం చెప్పులు మాత్రమే ధరించాలని సూచించారు. అభ్యర్థుల యొక్క ఏదైనా విలువైన వస్తువులు లేదా వస్తువులను సురక్షితంగా భద్రపరచడం కొరకు కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్/స్టోరేజీ ఫెసిలిటీని అందించదని అభ్యర్థి గమనించాలి.

What to carry and what not to carry to TSPSC Group 1 2024 Exam Centre? TSPSC Strict Rules

Important Instructions on Hall Ticket

TSPSC Group 1 Prelims 2024 | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

Sharing is caring!

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సర్వం సిద్ధం, అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు_5.1