Telugu govt jobs   »   Current Affairs   »   తెలంగాణలో బండలింగాపూర్ గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించారు

తెలంగాణలో బండలింగాపూర్ గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించారు

తెలంగాణలో బండలింగాపూర్ గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించారు

తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. జగిత్యాల జిల్లాలోని బండలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం నుంచి పది గ్రామాలను విడదీసి బండలింగాపూర్ కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ జూన్ 26న రెవెన్యూశాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గెజిట్‌ విడుదల చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశించారు. మెట్పల్లి మండలం నుంచి రాజేశ్వరావుపేట, మేడిపల్లి (డబ్ల్యూ), రామచంద్రంపేట, విట్టంపేట, మెట్ల చిట్టాపూర్, జగ్గాసాగర్, రామలచ్చక్కపేట, రంగారావుపేట, బండలింగాపూర్, ఆత్మకూరు గ్రామాలను వేరుచేసి కొత్త మండలం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అభ్యంతరాలు, సూచనలుంటే 15 రోజుల్లోగా కలెక్టర్ కు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ మండలం క్రొత్త ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 613కు చేరుకోనుంది.

గ్రామం వేరే జిల్లాకు బదిలీ చేయబడింది:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ కంగ్జి మండలంలో ఉన్న బాబుల్గామ్ రెవెన్యూ గ్రామాన్ని. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పెద్దకొడప్ గల్ మండలానికి బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ సోమవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

తెలంగాణలో అతిపెద్ద మండలం ఏది?

వైశాల్యం పరంగా, భద్రాద్రి కొత్తగూడెం 7,483 km2 (2,889 sq mi) వైశాల్యంతో అతిపెద్ద జిల్లా మరియు హైదరాబాద్ 217 km2 (84 sq mi) తో చిన్నది.