Telugu govt jobs   »   TSPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కోసం...

Instructions and Strict Rules for TGPSC Group 2 Exam 2024 | TGPSC గ్రూప్ 2 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు?

రాష్ట్రవ్యాప్తంగా 1401 కేంద్రాల్లో TGPSC గ్రూప్ 2 పరీక్ష 2024 డిసెంబర్ 15 మరియు 16 2024 నిర్వహించేందుకు TGPSC అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

  • డిసెంబర్ 15 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2
  • డిసెంబర్ 16న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌-4 పరీక్షను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 OMR ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.

మేము ఈ కథనంలో TGPSC గ్రూప్ 2 పరీక్ష 2024 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు అందించాము. TGPSC గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన అన్ని సందేహాలను నివృతి చేసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024

1368 పరీక్ష కేంద్రాలు

TSPSC గత సంవత్సరం డిసెంబర్ లో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 2కు దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో TGPSC గ్రూప్ 2 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను విడుదల చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది.

  • సాంకేతిక సందేహాల నివృత్తికి 040-(22445566/ 23542185/ 23542187) నంబర్లలో సంప్రదింవచ్చు.
  • helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

ఉదయం 8.30 గంటల నుండే లోపలికి అనుమతి

డిసెంబర్ 15 మరియు 16, 2024  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 మరియు డిసెంబర్ 16న పేపర్‌-3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్‌-4 పరీక్షను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుండగా, ఉదయం 8.30 గంటల నుండే అభ్యర్ధులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల హాజరై గేట్లను మూసివేస్తారు.  పేపర్-1కు ఉదయం ఎనిమిది గంటల నుంచి పేపర్-2కు మధ్యాహ్నం  1.30 గంట నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది.  కాబట్టి, అభ్యర్థులు ఉదయం 9.30 గంటల్లోపు, మధ్యాహ్నం 2.30లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించరు.

TGPSC గ్రూప్ 2 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి?

TGPSC గ్రూప్ 2 2024 పరీక్షా కేంద్రానికి తీసుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.

  • OMR షీట్‌ ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే పూరించాలి.
  • అడ్మిట్ కార్డ్: TGPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ 2024 అనేది పరీక్ష సమయంలో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్.
  • ఫోటోగ్రాఫ్: అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలను తీసుకోవాలి.
  • ఇతర డాక్యుమెంట్ల: హాల్ టిక్కెట్‌తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కలిగి ఉండాలి, అంటే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
  • హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే, అతను/ఆమె 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు తీసుకురావాలి మరియు పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి, లేని పక్షంలో అభ్యర్థిని పరీక్ష హాలులోకి అనుమతించరు.

TGPSC గ్రూప్ 2 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లకూడదు?

  • అభ్యర్థులు గణిత పట్టికలు, లాగ్ బుక్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్లు మరియు వాలెట్ మరియు హ్యాండ్‌బ్యాగ్‌లను కేంద్రాలలోకి తీసుకెళ్లకూడదు.
  • OMR షీట్‌లో వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడ్ లేదా ఇంక్వెన్, జెల్పెన్, పెన్సిల్ ఉపయో ఉపయోగించడం వల్ల OMR జవాబు పత్రం చెల్లుబాటు కాకుండా పోతుందని అభ్యర్థులకు కమిషన్ స్పష్టం చేసింది.
  • పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులను అభ్యర్థులు తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకుని రావొద్దంటూ TSPSC సూచించింది.

పరీక్ష హాలులో పాటించవలసిన సూచనలు

  • పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
  • అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి OMR షీట్ మీద రాసే ముందు చాలా జాగ్రతగా, ఏకాగ్రత ఉండాలి. ఒకసారి తప్పుగా రాస్తే, మీ OMR షీట్ లెక్కించబడదు.
  • సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
  • తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.

ALL THE BEST

TEST PRIME - Including All Andhra pradesh Exams

pdpCourseImg

 Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Instructions and Strict Rules for TGPSC Group 2 Exam 2024_6.1