రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ రాతపరీక్ష 2024 09 జూన్ 2024 (ఆదివారం) ఆఫ్లైన్ విధానంలో OMR పద్ధతిలో నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు OMR ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష హాల్‌లో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్‌ల ద్వారా అభ్యర్థుల బయోమెట్రిక్‌లను క్యాప్చర్ చేయడం ఉదయం 09.30 గంటలకు ప్రారంభమవుతుందని మరియు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా తన బయోమెట్రిక్‌లను క్యాప్చర్ చేసే వరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లకూడదని అభ్యర్థులకు తెలియజేయబడింది. మేము ఈ కథనంలో TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష 2024 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు అందించాము. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అన్ని సందేహాలను నివృతి చేసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.
ఉదయం 9 గంటల నుండే లోపలికి అనుమతి
09 జూన్ 2024 (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 01 .00 గంటల వరకు పరీక్ష జరగనుండగా, ఉదయం 9 గంటల నుండే అభ్యర్ధులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం పది గంటలకు అంటే పరీక్షా ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
Important Instructions For TSPSC GROUP 1 Prelims Exam
TSPSC గ్రూప్1 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి?
TSPSC గ్రూప్ 1 2024 పరీక్షా కేంద్రానికి తీసుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.
- ఫోటోగ్రాఫ్: అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలను తీసుకోవాలి. పరీక్షకు వచ్చే ముందు ముద్రించిన హాల్ టికెట్‌లో అందించిన స్థలంలో జిగురును ఉపయోగించి (3) మూడు నెలల ముందు కాప్చర్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తప్పనిసరిగా అతికించాలి
- అడ్మిట్ కార్డ్: TSPSC గ్రూప్ 1 అడ్మిట్ కార్డ్ 2024 అనేది పరీక్ష సమయంలో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్.
- ఇతర డాక్యుమెంట్ల: హాల్ టిక్కెట్‌తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కలిగి ఉండాలి, అంటే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
- హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే, అతను/ఆమె 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు తీసుకురావాలి మరియు పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి, లేని పక్షంలో అభ్యర్థిని పరీక్ష హాలులోకి అనుమతించరు.
- OMR షీట్ ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే పూరించాలి.
Adda247 APP
TSPSC గ్రూప్ 1 2024 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లకూడదు?
- అభ్యర్థులు కాలిక్యులేటర్లు, లాగ్ బుక్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్లు మరియు వాలెట్ మరియు సంచులు, పౌచ్లు, ప్యాడ్లు, హ్యాండ్‌బ్యాగ్‌లను కేంద్రాలలోకి తీసుకెళ్లకూడదు.
- పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు, మ్యాథమెటికల్ టేబుళ్లు, టేబుల్స్, నోట్స్, చార్ట్ లు, లూజ్ షీట్స్, జ్యుయెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వెంటతెచ్చుకోవద్దని కోరారు.
- OMR షీట్‌లో వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడ్ లేదా ఇంక్వెన్, జెల్పెన్, పెన్సిల్ ఉపయో ఉపయోగించడం వల్ల OMR జవాబు పత్రం చెల్లుబాటు కాకుండా పోతుందని అభ్యర్థులకు కమిషన్ స్పష్టం చేసింది.
- పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులను అభ్యర్థులు తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకుని రావొద్దంటూ TSPSC సూచించింది.
- అభ్యర్థులు గోరింటాకు, తాత్కాలిక టాటూలు చేతులపై వేసుకురావొద్దని కోరారు.
ముఖ్యమైన సూచనలు
- అభ్యర్థుల విలువైన వస్తువులు లేదా వస్తువులను భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్/స్టోరేజీ సౌకర్యాన్ని అందించదని అభ్యర్థి గమనించాలి.
- అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష హాల్‌లో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్‌ల ద్వారా అభ్యర్థుల బయోమెట్రిక్‌లను క్యాప్చర్ చేయడం ఉదయం 09.30 గంటలకు ప్రారంభమవుతుందని మరియు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా తన బయోమెట్రిక్‌లను క్యాప్చర్ చేసే వరకు అభ్యర్థులెవరూ పరీక్ష హాల్ నుండి బయటకు వెళ్లకూడదని అభ్యర్థులకు తెలియజేయబడింది.
- ఎవరైనా అభ్యర్థి తన బయోమెట్రిక్‌లను ఇవ్వకపోతే, అతని/ఆమె OMR జవాబు పత్రం మూల్యాంకనం చేయబడదు.
- అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ, తాత్కాలిక టాటూలు లేదా బయోమెట్రిక్స్ రికార్డింగ్‌కు ఆటంకం కలిగించే ఏదైనా అబ్స్ట్రక్టివ్ మెటీరియల్ కవర్లు కలిగి ఉండకూడదని సూచించారు.