రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 1 జూలై 2023 (శనివారం) నిర్వహించేందుకు TSPSC అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2ను OMR ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎన్నడు లేని విధంగా గ్రూప్-4 పరీక్ష కోసం ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు జరిగిన TSPSC పరీక్షలలో బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించారు… కానీ మొదటి సారిగా థంబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది TSPSC. మేము ఈ కథనంలో TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 కోసం సూచనలు మరియు కఠిన నిబంధనలు అందించాము. TSPSC గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన అన్ని సందేహాలను నివృతి చేసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి.
TSPSC గ్రూప్ 4 హాల్ టికెట్ 2023
2,878 పరీక్ష కేంద్రాలు
TSPSC గత సంవత్సరం డిసెంబర్ లో మొత్తం 8,039 గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది, 9,51,205 దరఖాస్తులు వచ్చాయి అని TSPSC వెల్లడించింది. గ్రూప్-4కు దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో TSPSC గ్రూప్ 4 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాల్లో నిర్వహించనుంది.. ఇప్పటివరకు TSPSC GHMCs పరిధిలో లేదంటే జిల్లా కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించింది ఇప్పుడు తాలుకాలతోపాటు కొన్ని మండల కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రా లను ఏర్పాటు చేసింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది.
ఉదయం 8 గంటల నుండే లోపలికి అనుమతి
1 జూలై 2023 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 జరగనుండగా, ఉదయం 8 గంటల నుండే అభ్యర్ధులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల హాజరై గేట్లను మూసివేస్తారు. పేపర్-1కు ఉదయం ఎనిమిది గంటల నుంచి పేపర్-2కు మధ్యాహ్నం 1 గంట నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. కాబట్టి, అభ్యర్థులు ఉదయం 9.45 చేయ గంటల్లోపు, మధ్యాహ్నం 2.15లోపు పరీక్షా ప్రకటి కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కానుం అభ్యర్థులను అనుమతించరు.
TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం టాపిక్‌లను త్వరగా రివైజ్ చేయడం ఎలా?
TSPSC గ్రూప్-4 2023 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి?
TSPSC గ్రూప్-4 2023 పరీక్షా కేంద్రానికి తీసుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.
- ఫోటోగ్రాఫ్: అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలను తీసుకోవాలి.
- అడ్మిట్ కార్డ్: TSPSC గ్రూప్ 4 అడ్మిట్ కార్డ్ 2023 అనేది పరీక్ష సమయంలో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్.
- ఇతర డాక్యుమెంట్ల: హాల్ టిక్కెట్‌తో పాటు, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కలిగి ఉండాలి, అంటే పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి.
- హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే, అతను/ఆమె 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన ఒక హామీతో పాటు తీసుకురావాలి మరియు పరీక్ష హాల్‌లోని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి, లేని పక్షంలో అభ్యర్థిని పరీక్ష హాలులోకి అనుమతించరు.
- OMR షీట్ ను బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే పూరించాలి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC గ్రూప్-4 2023 పరీక్షా కేంద్రానికి ఏం తీసుకెళ్లకూడదు?
- అభ్యర్థులు గణిత పట్టికలు, లాగ్ బుక్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్లు మరియు వాలెట్ మరియు హ్యాండ్‌బ్యాగ్‌లను కేంద్రాలలోకి తీసుకెళ్లకూడదు.
- OMR షీట్‌లో వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడ్ లేదా ఇంక్వెన్, జెల్పెన్, పెన్సిల్ ఉపయో ఉపయోగించడం వల్ల OMR జవాబు పత్రం చెల్లుబాటు కాకుండా పోతుందని అభ్యర్థులకు కమిషన్ స్పష్టం చేసింది.
- పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులను అభ్యర్థులు తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకుని రావొద్దంటూ TSPSC సూచించింది.
TSPSC గ్రూప్ 4 ప్రిపరేషన్ వ్యూహం
పెళ్ళైన మహిళలు తాళి బొట్టు, మెట్టెలు తీసెయ్యాలా?
ప్రతి పరీక్ష కేంద్రంలో యువతి, యువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఏర్పాటు చేశాం. అందుకు సరిపడా మహిళా సిబ్బందిని నియమించాం. అభ్యర్థులు రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తాళిబొట్టు, మెట్టెలు తీసెయ్యాలనే నిబంధనేమీ లేదు అని TSPSC వెల్లడించింది,.
థంబ్ విధానం
గ్రూప్-4కు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వేలిముద్రను తప్పనిసరి చేశారు. అయితే ఎప్పటిలా బయోమెట్రిక్ ద్వారా హాజరును తీసుకోవడం లేదు, ఈసారి థంబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అభ్యర్థులంతా పరీక్షాకేం ద్రానికి రెండు గంటల ముందే చేరుకొని, వేలి ముద్రలు ఇవ్వాలని TSPSC సూచించింది, చివరి నిమిషంలో వచ్చిన అభ్యర్థులకు పరీక్ష ముగిసిన తర్వాత వేలిముద్రలు స్వీకరిస్తారు. ప్రతీ పరీక్షాకేంద్రంలో వేలి ముద్ర యంత్రాలను సిద్ధం చేశారు.
గ్రూప్-4 పరీక్ష కోసం ఆరు రకాల పద్ధతుల్లో తనిఖీ
గ్రూప్-4 పరీక్ష కోసం కమిషన్ ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను తనిఖీ చేయనుంది.
- ముందుగా, గేటు దగ్గర, పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ ను పరిశీలిస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు(ఫొటో తప్పనిసరి)
- పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్ లోని పేరును పరిశీలిస్తారు.
- నామినల్ రోల్. ప్రభుత్వ ఐడీలోని ఫొటోను వెరిఫై చేస్తారు.
- అభ్యర్థి సంతకాన్ని సరిపోలుస్తారు.
- చివరిగా.. అభ్యర్థి వేలిముద్రలను స్వీకరిస్తారు.
TSPSC గ్రూప్ 4 పరీక్షా సరళి మరియు సిలబస్ 2023
మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా… ప్రశ్నల జంబ్లింగ్
TSPSC పోటీ పరీక్షల నిర్వహణలో ఈసారి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. అందులో కీలకమైన వాటిలో ప్రశ్నల జంబ్లింగ్ విధానం ఒకటి. గతంలో జరిగిన పరిక్షలలో A,B,C, D సిరీస్లు పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ సిరీస్లలో వచ్చేలా ప్రశ్నపత్రాలను ముద్రించారు. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ తో సాధ్యమైనన్ని దఫాలుగా జంబ్లింగ్ చేసి, ఎక్కువ సంఖ్యలో సిరీస్ ల ప్రశ్నపత్రాలను ముద్రించింది. ఈ మేరకు A, B, C, D సిరీస్ ల స్థానంలో ఆరంకెల ప్రశ్న పత్రం నంబరుతో ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనుంది. అభ్యర్థులు ఆరంకెల సిరీస్ తో కూడిన ప్రశ్నపత్రం కోడ్ ను OMR షీట్ లో నమోదు చేసి, ఆ మేరకు వృత్తాల్ని బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో బబ్లింగ్ చేయాలని కమిషన్ తెలిపింది. బబ్లింగ్ చేసేటప్పుడు ప్రతిఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీకు కేటాయించిన నంబర్ ను OMR షీటులో సరిగా బబ్లింగ్ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్ సంతకాలు లేకపోయినా అతని పేపర్ ను మూల్యాంకనం చేయరు.
పరీక్ష హాలులో పాటించవలసిన సూచనలు
- పరీక్ష పర్యవేక్షణాధికారి ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్, పరీక్షా పత్రం కోడ్ లాంటివి OMR షీట్ మీద రాసే ముందు చాలా జాగ్రతగా, ఏకాగ్రత ఉండాలి. ఒకసారి తప్పుగా రాస్తే, మీ OMR షీట్ లెక్కించబడదు.
- సమాదానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించడం మంచిది.
- తెలిసిన సబ్జెక్టు ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయి అనే వెతుకులాట వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వరుస క్రమంలో సమాధానాలు గుర్తించుకుంటూ వెళ్లటమే మంచిది.
ప్రతి అరగంటకు బెల్ మోగించబడుతుంది.
పరీక్షా రాసే అభ్యర్ధులకు సమయం తెలియజేయడానికి ప్రతి అరగంటకు, క్రింద చూపిన విధంగా బెల్ మోగించబడుతుంది.
PAPER -I : 10:00 AM | PAPER – II 2:00 PM | పరీక్ష ప్రారంభంలో లాంగ్ బెల్ మోగించబడుతుంది |
10.30 AM | 3.00 PM | గంట ఒకసారి మోగించబడుతుంది |
11.30AM | 3.30 PM | గంట రెండు సార్లు మోగించబడుతుంది |
12.00 AM | 4.00 PM | గంట మూడు సార్లు మోగించబడుతుంది |
12.30 AM | 4.30 PM | గంట నాలుగు సార్లు మోగించబడుతుంది |
12.25 PM | 4.55 PM | హెచ్చరిక గంట |
12.30 PM | 5.00 PM | పరీక్ష ముగింపులో లాంగ్ బెల్ |
? ALL THE BEST ?
Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |