చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రన లేని చేపలు పట్టడాన్ని వ్యతిరేకించే అంతర్జాతీయ దినోత్సవం
చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రణ లేని ఫిషింగ్ కు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహించబడుతుంది. ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ ఎఓ) ప్రకారం, చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు నియంత్రణ లేని ఫిషింగ్ కార్యకలాపాలు ప్రతి సంవత్సరం 11-26 మిలియన్ టన్నుల చేపల నష్టాన్ని కలిగిస్తున్నయి,దీని విలువ 10-23 బిలియన్ అమెరికన్ డాలర్ల ఉంటుందని అంచనా.
ఆనాటి చరిత్ర:
2015లో, జనరల్ ఫిషరీస్ కమిషన్ ఫర్ ది మెడిటరేనియన్ ఆఫ్ ది ఎఫ్.ఎ.ఓ. చట్టవిరుద్ధమైన, నివేదించబడని మరియు అనియంత్రిత ఫిషింగ్ కు వ్యతిరేకంగా పోరాటం కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించింది. విస్తృతమైన సంప్రదింపుల తరువాత, ఫిషరీస్ పై ఎఫ్ఎవో కమిటీ యొక్క ముప్పై రెండవ సమావేశం దృష్టికి ఒక ప్రతిపాదన సమర్పించబడింది. డిసెంబర్ 2017 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థిరమైన చేపల పెంపకంపై తన వార్షిక తీర్మానంలో జూన్ 5ను “చట్టవిరుద్ధమైన, నివేదించని మరియు నియంత్రణ లేని చేపల వేటకు వ్యతిరేకంగా పోరాటానికి అంతర్జాతీయ దినోత్సవం”గా ప్రకటించింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్: క్యు డోంగ్యు
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం: రోమ్, ఇటలీ.
- ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది: 16 అక్టోబర్ 1945.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 3 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి