Telugu govt jobs   »   అంతర్జాతీయ సంస్థలు మరియు సమావేశాలు

International Organizations and Conferences, For TSPSC Group 2 and 3 Paper 1 | అంతర్జాతీయ సంస్థలు మరియు సమావేశాలు, TSPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పేపర్ 1 కోసం

ప్రపంచంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు ప్రపంచం వ్యాప్తంగా విపత్తులూ పెరిగిపోతున్నాయి. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా విపత్తుల సృష్టించే విధ్వంసం కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. సుస్థిరాభివృద్ధికి ఆటంకంగా నిలిచే అన్ని విపత్తులను ముందుగా గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని దేశాల్లో విపత్తు నిర్వహణ వ్యవస్థలు ఏర్పాట చేసాయి. అంతర్జాతీయ సంస్థలు మరియు సమావేశాలపై పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పూర్తి అవగాహన ఉండాలి. అంతర్జాతీయ సంస్థలు మరియు సమావేశాలు TSPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పేపర్ 1 లో ముఖ్యమైన అంశం.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

అంతర్జాతీయ సంస్థల గురించి

అంతర్జాతీయ సంస్థల గురించి
అంతర్జాతీయ సంస్థలు సంస్థల వివరాలు
జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం
  • భారత్‌లో ప్రతి సంవత్సరం అక్టోబరు 29న ‘జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు.
ప్రపంచ వాతావరణ సంస్థ
  • ఇది ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ.
  • భూగోళ వాతావరణాన్ని పర్యవేక్షించే ఈ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
  • ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఇండియా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌

 

  • జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ 2006, నవంబరు 29, 30 తేదీల్లో న్యూదిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది.
  • నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దీనిని ప్రారంభించారు.
  • రెండో ఇండియా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కాంగ్రెస్‌ 2009, నవంబరు 4 నుంచి 6వ వరకు న్యూదిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లోనే జరిగింది.
పసిఫిక్‌ సునామీ వార్నింగ్‌ సెంటర్‌
  • దీన్నే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు. 1948లో ఏర్పాటు చేశారు.
  • ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి రాష్ట్రం ఇవా బీచ్‌లో ఉంది.
  • దీన్ని అమెరికాకు చెందిన ‘నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌’ నిర్వహిస్తోంది.
  • 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్‌ చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించారు.
అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం
  • ప్రతి సంవత్సరం అక్టోబరు 13న ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం’ నిర్వహిస్తారు.
  • ఈ దినోత్సవాన్ని విపత్తులు, అంగవైకల్యంతో పోరాడుతున్నవారికి 2013లో  అంకితం చేశారు.
  • 2009 వరకు ప్రతి సంవత్సరం అక్టోబరు రెండో బుధవారాన్ని ‘అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దినోత్సవం’గా పాటించేవారు.
  • 2009, డిసెంబరు 21న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2010 నుంచి ఏటా అక్టోబరు 13న అంతర్జాతీయ విపత్తు కుదింపు దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది.
SAARC డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌
  • SAARC డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ 2006, అక్టోబరులో ఏర్పాటు చేశారు.
  • ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది
రీజినల్‌ ఇంటిగ్రేటెడ్‌ మల్టీ హజార్డ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ ఆఫ్రికా అండ్‌ ఆసియా
  • 2004లో సునామీ తర్వాత, వైపరీత్యాలకు సంబంధించిన విపత్తుల ముందస్తు హెచ్చరికలు, విపత్తు నిర్వహణ వలయంలోని అన్ని చర్యలకు సంబంధించి ఒక ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీన్ని 2009, ఏప్రిల్‌ 30న ఏర్పాటు చేశారు.
  • 2009, జులై 1న ఐక్యరాజ్యసమితిలో నమోదైంది
  • దీని ప్రధాన కార్యాలయం థాయ్‌లాండ్‌లోని పాతుంథానిలో ఉన్న ‘ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ క్యాంపస్‌లో ఉంది.
ఆసియా డిజాస్టర్‌ ప్రిపేర్డ్‌నెస్‌ సెంటర్‌
  • 1998లో ఏర్పాటు చేశారు.
  • ప్రధాన కార్యాలయం జపాన్‌లోని కోబ్‌ నగరంలో ఉంది
పసిఫిక్‌ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూపు
  • 1968లో  ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఓషనోగ్రాఫిక్‌ కమిషన్‌’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
  • ప్రధాన కార్యాలయం: ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ఉన్న యునెస్కో
సౌత్‌ ఆసియన్‌ డిజాస్టర్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌
  • ఇది SAARC ర్క్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నడిచే ఒక వెబ్‌పోర్టల్‌.
ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌
  • ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1999, డిసెంబరులో ఏర్పాటు చేశారు.
  • ప్రధానకార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.
ఇంటర్నేషనల్‌ సునామీ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌
  • UNESCOకు చెందిన ఇంటర్‌ గవర్నమెంటల్‌ ఓషనోగ్రాఫిక్‌ కమిషన్‌ (IOC) ఆధ్వర్యంలో 1956లో దీన్ని ఏర్పాటు చేశారు.
  • దీని ప్రధాన కేంద్రం అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్న హోనోలులు.

Sendai Framework for Disaster Risk Reduction 2015-2030 | విపత్తు ముప్పు కుదింపునకు సెండాయ్‌ చట్రం (2015-2030)

డిజాస్టర్ రిస్క్ తగ్గింపు కోసం సెండాయ్ ఫ్రేమ్‌వర్క్ 2015-2030 ఏడు స్పష్టమైన లక్ష్యాలను మరియు కొత్త మరియు ఇప్పటికే ఉన్న విపత్తు ప్రమాదాలను తగ్గించడానికి చర్య కోసం నాలుగు ప్రాధాన్యతలను వివరిస్తుంది:

  • విపత్తు ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం
  • విపత్తు ప్రమాదాన్ని నిర్వహించడానికి విపత్తు ప్రమాద పాలనను బలోపేతం చేయడం
  • స్థితిస్థాపకత కోసం విపత్తు తగ్గింపులో పెట్టుబడి పెట్టడం మరియు;
  • సమర్థవంతమైన ప్రతిస్పందన కోసం విపత్తు సంసిద్ధతను పెంచడం మరియు రికవరీ, పునరావాసం మరియు పునర్నిర్మాణంలో “బిల్డ్ బ్యాక్ బెటర్”.

రాబోయే 15 సంవత్సరాలలో వ్యక్తులు, వ్యాపారాలు, కమ్యూనిటీలు మరియు దేశాల యొక్క జీవితాలు, జీవనోపాధి మరియు ఆరోగ్యం మరియు ఆర్థిక, భౌతిక, సామాజిక, సాంస్కృతిక మరియు పర్యావరణ ఆస్తులలో విపత్తు ప్రమాదం మరియు నష్టాలను గణనీయంగా తగ్గించడం దీని లక్ష్యం.

2015 మార్చి 18న జపాన్ లోని సెండాయ్ లో జరిగిన విపత్తు ప్రమాద తగ్గింపుపై ఐక్యరాజ్యసమితి మూడవ ప్రపంచ సదస్సులో ఈ ఫ్రేమ్ వర్క్ ఆమోదించబడింది.

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!