Is AP Animal Husbandry Assistant Vacancies likely to increase further?
Andhra Pradesh Government Previously Announced 4567 Animal Husbandry assistant vacancies through AP Grama Sachivalayam Notification 2023. Recently on 20th November 2023 AP Animal Husbandry Department released a notification for 1896 vacancies.
The immediate filling of these vacancies in the department due to compelling reasons or whether the remaining vacancies will be swiftly filled through the comprehensive AP GRAMA/WARD Sachivalayam Notification 2023 has caused significant agitation among applicants, as authorities have not provided clear clarification on this matter. For more details about the AP Animal Husbandry Assistant notification read the below article
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఖాళీలు మరిన్ని పెరిగే అవకాశం ఉందా?
గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం AP గ్రామ సచివాలయం పశుసంవర్ధక శాఖ నుండి 4765 ఖాళీలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కానీ 20 నవంబర్ 2023 న AP పశుసంవర్ధక శాఖ నుండి 1896 అసిస్టెంట్ ఖాళీలను మాత్రమే విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ , వార్డు సచివాలయాలలో ఖాళీలు భర్తీ చెయ్యడానికి సిద్ధమైంది అన్న విషయం విధితమే. ఈ క్రమంలో ఆర్ధిక శాఖ నుండి వివరాలు కోరిన ప్రభుత్వానికి సుమారు 4765 ఖాళీలు కేవలం, పశు సంవర్ధక శాఖలో ఉన్నట్లు తెలియజేసింది. కానీ అధికారికంగా ఇప్పటి వరకు 1896 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినది. అయితే మునుపు పేర్కొన్న 4765 పశు సంవర్ధక శాఖ ఖాళీలు పూర్తిగా భర్తీ చేయకపోవడం వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం పేర్కొనలేదు. వీటిపై అభ్యర్థులతో పూర్తి సందిగ్ధత నెలకొని ఉంది.
వీటిని ప్రస్తుతం అనివార్య కారణాల వలన శాఖలో ఉన్న ఖాళీలను తక్షణ భర్తీ చేయడానికి పూనుకున్నదా? లేదా మిగిలిన ఖాళీలను త్వరలో సమగ్ర AP GRAMA/WARD Sachivalayam Notification 2023 ద్వారా భర్తీ చేస్తారా అనే విషయంపై అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం పట్ల అభర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మీదట కూడా AP GRAMA/WARD Sachivalayam Notification 2023 ద్వారా వివిధ ఖాళీల భర్తీని శాఖల ద్వారా చేస్తారా లేద ఒకే నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ శాఖల వారీగా విడుదల చేసిన ఖాళీలను నోటిఫికేషన్ లో పేర్కొంటున్న ఖాళీలకు ఉన్న బేధం అభ్యర్థులలో ఒక రకమైన అపనమ్మకం, ఆందోళనా కలిగిస్తున్నాయి అని చెప్పవచ్చు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |