Telugu govt jobs   »   ISRO-NASA joint mission NISAR Satellite to...

ISRO-NASA joint mission NISAR Satellite to be launched in 2023 | 2023లో NISAR ఉపగ్రహ ప్రయోగం

ఇస్రో-నాసా ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగం  NISER (NASA-ISRO సింథటిక్ ఎపర్చర్ రాడార్) , అధునాతన రాడార్ ఇమేజింగ్ ఉపయోగించి భూ ఉపరితల మార్పులను ప్రపంచవ్యాప్తంగా కొలవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, 2023 ప్రారంభంలో ప్రయోగించాలని ప్రతిపాదించడం జరిగింది. ఇది డ్యూయల్ బ్యాండ్ (L- బ్యాండ్ మరియు S- బ్యాండ్) భూమి, వృక్షసంపద మరియు క్రియోస్పియర్‌లో చిన్న మార్పులను గమనించడానికి పూర్తి ధ్రువణ మరియు ఇంటర్‌ఫెరోమెట్రిక్ మోడ్‌ల సామర్థ్యంతో ప్రయోగించబడుతున్న రాడార్ ఇమేజింగ్ మిషన్.

NASA L- బ్యాండ్ SAR మరియు అనుబంధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది, ఇస్రో S- బ్యాండ్ SAR, అంతరిక్ష నౌక యాన పరికారాన్ని, ప్రయోగ వాహనం మరియు అనుబంధ ప్రయోగ సేవలను అభివృద్ధి చేస్తోంది. మిషన్ యొక్క ప్రధాన శాస్త్రీయ లక్ష్యాలు, భూమి యొక్క మారుతున్న పర్యావరణ వ్యవస్థలు, భూమి మరియు తీర ప్రాంత కదలికలు, భూ వైకల్యాలు మరియు క్రియోస్పియర్‌పై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం. NISER ఇస్రో మరియు నాసా యొక్క కీలక సహకారాలలో ఒకటి. 2015 లో అప్పటి ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భారతదేశ పర్యటన సందర్భంగా ఈ మిషన్‌పై భారత్ మరియు యుఎస్ అంగీకారం తెలిపాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఇస్రో ఛైర్మన్: కె.శివన్.
  • ఇస్రో ప్రధాన కార్యాలయం: బెంగళూరు, కర్ణాటక.
  • ఇస్రో స్థాపించబడింది: 15 ఆగస్టు 1969.
  • NASA నిర్వాహకుడు: బిల్ నెల్సన్.
  • నాసా ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ డిసి, యునైటెడ్ స్టేట్స్.
  • నాసా స్థాపించబడింది: 1 అక్టోబర్ 1958.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

RRB Group-d

APCOB notification 2021

Sharing is caring!

ISRO-NASA joint mission NISAR Satellite to be launched in 2023 | 2023లో NISAR ఉపగ్రహ ప్రయోగం_5.1