Telugu govt jobs   »   Current Affairs   »   ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్సింగ్...

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ ప్రమాణస్వీకారం చేశారు

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ ప్రమాణస్వీకారం చేశారు

ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, గౌరవనీయులైన హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ గతంలో బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా పదోన్నతి పొందారు. ఆయన 1964 ఏప్రిల్ 25న జన్మించారు. అతని తమ్ముడు, జస్టిస్ TS ఠాకూర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. జస్టిస్ ధీరజ్ ఠాకూర్ అక్టోబర్ 18, 1989న ఢిల్లీ మరియు జమ్మూ మరియు కాశ్మీర్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాదిగా హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి సేవలు అందించారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జిల వరకు ఉండొచ్చు. సీజేగా జస్టిస్ దీరజ్సింగ్ ఠాకుర్ రాకతో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.

APPSC Group-1 & 2 Complete Foundation Batch | 360 Degrees Preparation Kit | Online Live Classes by Adda 247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?

గౌరవనీయులైన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆంధ్ర ప్రదేశ్ పూర్వ హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తి.