Telugu govt jobs   »   Current Affairs   »   తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోశి...

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోశి ప్రమాణ స్వీకారం చేశారు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ కోశి ప్రమాణ స్వీకారం చేశారు

జూలై 27న ఉదయం 10.30 గంటలకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ పి.శ్యామ్ కోశీ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధే జస్టిస్‌ శ్యామ్‌ కోశీతో ప్రమాణ స్వీకారం చేయించారు.

అంతకుముందు రిజిస్ట్రార్ జనరల్ పి.సుజన ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జస్టిస్ శ్యామ్ కోశీని ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి బదిలీ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివారు. అనంతరం ప్రమాణం చేయించే బాధ్యతను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధేకు అప్పగిస్తూ గవర్నరు జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు.

హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ బి.ఎస్ప్ర.సాద్, అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాపరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర న్యాయసేవా సంస్థ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, జస్టిస్ శ్యామ్ కోశీ కుటుంబ సభ్యులు మరియు న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జస్టిస్ శ్యామ్ కోశీ, ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయమూర్తులందరితో కలిసి హైకోర్టు బార్ అసోసియేషన్‌ను సందర్శించారు. అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటైన కార్యక్రమంలో జస్టిస్ శ్యామ్ కోశీ న్యాయవాదులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్త , ఏజీతో పాటు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కల్యాణ్ రావు చెంగల్వ, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జస్టిస్ శ్యామ్ కోశీతో పాటు ప్రస్తుతం తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరుకుంది.

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?

హిమా కోహ్లి (జననం 2 సెప్టెంబర్ 1959) భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఆమె తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళా న్యాయమూర్తి.