తెలంగాణ : యూకే కేంద్రంగా పనిచేస్తున్న డేటా అనలిటిక్స్, ఈఆర్‌పీ సేవల సంస్థ కగూల్ డేటా హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ప్రారôభించింది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంపై రానున్న మూడేళ్లలో దాదాపు రూ.37 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. భారత్‌లో విస్తరించేందుకు ఈ కొత్త కార్యాలయం ఉపయోగపడుతుందని కగూల్ డేటా ఇండియా హెడ్ కల్యాణ్ గుప్తా బ్రహ్మండ్లపల్లి తెలిపారు. 2025 నాటికి దేశంలో తమ ఉద్యోగుల సంఖ్య 2,000 కు చేరుకుంటుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఉత్పత్తి, రిటైల్, ప్రభుత్వ రంగ కంపెనీలకు సేవలను విస్తరిస్తామని చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************