Kashmiri Youth Festival in Visakhapatnam | విశాఖపట్నంలో కాశ్మీరీ యూత్ ఫెస్టివల్
విశాఖపట్నం లోనే మొట్టమొదటి సారిగా నిర్వహించబడుతున్న కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ కి సంభందించిన ఏర్పాట్ల గురించి నెహ్రూ యువకేంద్రం అధికారులు జి. మహేశ్వర మరియు అల్లం రాంప్రసాద్, తెలిపారు. ఈ ఉత్సవానికి విచ్చేసే 120 సందర్శకులకు మన సంప్రదాయం, ఆహారపు అలవాట్లు, పద్దతులు మరియు సంస్కృతి తో పాటు కేంద్ర పథకాల గురించి పూర్తిగా తెలియజేస్తారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ అక్టోబర్ 2 నుంచి 7 వరకూ నిర్వహిస్తారు. దీనికి శ్రీనగర్ కి చెందిన 6 జిల్లాల నుంచి మొత్తం 120 మంది విశాఖపట్నం జిల్లా మరియు పరిసర ప్రముఖ ప్రాంతాలు సందర్శించి, నైపుణ్యం గురించి శిక్షణా తరగతులకు హాజరవుతారు. ఈ కాశ్మీరీ యూత్ ఫెస్టివల్ ద్వారా, జాతీయ సమైక్యత, ఐక్యత మరియు శాంతిపై యువతకు అవగాహన కల్పించడంతోపాటు పర్యావరణం, వైవిధ్యం మరియు విభిన్న పరిస్థితులపై ఆలోచనలు మరియు అభిప్రాయాలను తెలియజేస్తారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |