కేంద్ర బడ్జెట్ 2024
భారతదేశం 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆవిష్కరిస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దేశం సమర్థవంతంగా పరివర్తన చెందగల ఆర్థిక విధానాలపై సిద్ధంగా ఉంది. రాబోయే సంవత్సరానికి ప్రభుత్వం యొక్క రాబడి మరియు వ్యయాల యొక్క ఆర్థిక నివేదికగా ఉపయోగపడే బడ్జెట్, దేశ ఆర్థిక పరిస్థితి మరియు విధాన ప్రాధాన్యతలకు కీలక సూచికగా నిలుస్తుంది.
నిర్మలా సీతారామన్‌కి ఇది ఆరో కేంద్ర బడ్జెట్. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. మధ్యంతర బడ్జెట్ – స్వల్పకాలిక ఆర్థిక ప్రణాళిక – కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల ప్రభుత్వ అవసరమైన వ్యయాన్ని తీర్చడానికి ముందస్తుగా మంజూరు కోసం పార్లమెంటు ఆమోదం పొందుతుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
కేంద్ర బడ్జెట్ 2024 కీలక అంశాలు:
- 2024 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.8 శాతంగా నమోదైంది మరియు ఫిస్కల్ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గనుంది.
- 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం రూ.44.90 లక్షల కోట్లకు పెంపు
- 2024 ఆర్థిక సంవత్సరంలో రుణాలు కాకుండా మొత్తం రాబడులు రూ.27.56 లక్షల కోట్లు
- 2024 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లు రూ.23.24 లక్షల కోట్లు
- 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.1 శాతంగా నమోదైంది.
- 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించడమే లక్ష్యం
- 2025 ఆర్థిక సంవత్సరంలో స్థూల మార్కెట్ రుణాలు రూ.14.13 లక్షల కోట్లు
- ఎగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు ఒకే పన్ను రేట్లను కొనసాగించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
- కేంద్ర బడ్జెట్ 2024 ఆదాయపు పన్ను: పన్నులో ఎలాంటి మార్పులు ప్రతిపాదించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి అని తెలిపారు మరియు ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుంది అని అంచనా వేశారు.
- 2026 మార్చి 31 వరకు దుస్తులు/ వస్త్రాల ఎగుమతి కోసం రాష్ట్ర, కేంద్ర పన్నులు, లెవీల రిబేట్ పథకాన్ని (ఆర్ఓఎస్సీటీఎల్) కొనసాగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) లబ్ధిదారులకు 2026 మార్చి 31 వరకు కిలో చక్కెరపై రూ.18.50 సబ్సిడీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మరియు ఉచిత రేషన్ పధకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ది చేకూరింది.
- 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉంది.
- కేంద్ర బడ్జెట్ 2024 ఆదాయపు పన్ను: 2025 ఆర్థిక సంవత్సరం పన్ను రాబడులు రూ.26.02 లక్షల కోట్లు.
- 40,000 సాధారణ రైల్ కోచ్ లను వందే భారత్ తరహాలో మారుస్తామని తెలిపారు
- 2047 నాటికి భారతదేశం ని అభివృద్ది చెందిన దేశం గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
- 517 ప్రాంతాలకు విమాన సేవలు అందించారు
- మూడు ఎకనామిక్, లాజిస్టిక్ పార్కు లను, 5 సమీకృత ఆక్టివ్ పార్క్ లను కూడా ఏర్పాటు చేయనున్నారు
- మత్స్య రంగం లో దాదాపు 55 లక్షల మందికి ఉపాధి కలిపించారు
- జిడిపి అంటే గవర్నన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మన్స్ అనే కొత్త అర్ధం తో ప్రగతి సాధించాము అని తెలిపారు
రుణసాయం
పీఎం స్వనిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు అయ్యాయి. మరో 2.3 లక్షల మందికి త్వరలో రుణాలు అందిస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) ద్వారా జన్ ధన్ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశాం. 11.8 కోట్ల రైతులకి ఆర్ధిక సహాయం అందించారు మరియు పిఎం ఫసల్ భీమా ద్వారా రైతులకి పంట బీమా అందించారు.
స్కిల్ ఇండియా
స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించామని తెలిపారు.
విద్యా
3000 ITI లు, 7 IITలు, 16 IIIT లు, 15 AIIMS లు, 390 విశ్వ విధ్యాలయాలను ఏర్పాటు చేసి విద్యారంగంలో ఎంతో మందికి విద్యని అందించారు మరియు ఉన్నత విద్యలో మహిళలు ఎక్కువ మంది చేరుతున్నారు అని తెలిపారు.
పన్ను
తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం లో పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేపట్టలేదు. కొనసాగుతున్నపాత కొత్త పన్ను విధానంని అలానే ఉంచుతూ కార్పొరేట్ పన్ను ని దేశీయ కంపెనీలకు 30 నుంచి 22 శాతానికి తగ్గించారు, మరియు తయారీ రంగంలో ఉండే కొన్ని సంస్థలకి 15 శాతానికి తగ్గించారు.
ఆదాయ పన్ను శ్లాబ్ లను 5 కి కుదించారు
- 3 లక్షల వరకు పన్ను లేదు
- 3-6 లక్షల వరకు 5 % పన్ను
- 6-9 లక్షల వరకు 10%
- 9-12 లక్షల వరకు 15 %
- 12-15 లక్షల వరకు 20 %
- 15 లక్షల పైన 30 %
సెక్షన్ 87A ప్రకారం 7 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. HUF హిందూ అవిభాజ్య కుటుంభలకు 5 కోట్ల పైబడిన ఆదాయం ఉన్నవారికి 37% ఉన్న సర్ చార్జి ని 25 % తగ్గించారు. స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50వేల నుంచి 75వేలకు పెంచారు.
హౌసింగ్ స్కీమ్
PM ఆవాస్ యోజన ద్వారా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం శర వేగంగా జరుగుతోంది అని తెలిపారు మరియు ఈ పధకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిస్తున్నట్టు తెలిపారు.
PM సూర్యోదయ్ యోజన
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట రోజున ప్రవేశ పెట్టిన ఈ పధకం లో దాదాపు ఒక కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సొలరైజేషన్ స్కీమ్ ని తీసుకుని రానున్నారు. తద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది మరియు వార్షికంగా దాదాపు రూ.15000,-20,000 ఆదా అవుతుంది అని తెలిపారు.
మహిళలకు
- 30 కోట్ల మహిళలకు ముద్రా రుణాలు అందించారు
- PM ఆవాస్ యోజన లో భాగం గా 70,000 మహిళల కి గృహాలు అందించారు
- అంగన్వాడీ కేంద్రాలను మెరుగుపరిచారు
- ఆశా వర్కర్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆయుష్మాన్ పధకాన్ని విస్తరించారు.
కేంద్ర బడ్జెట్ లోని కీలక అంశాలు PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |