KTR receives invite to speak at Milken Institute Global Conference in USA:
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్ వేదికగా ‘‘మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ 25వ ప్రపంచ వార్షిక సదస్సు’’ను నిర్వహించనున్నారు. వివిధ రంగాలు, సరిహద్దులు, రాజకీయ గ్రూపులను అనుసంధానించాల్సిన ఆవసరాన్ని గుర్తుచేస్తూ ‘సెలబ్రేటింగ్ పవర్ ఆఫ్ కనెక్షన్’అనే అంశంపై సదస్సు జరగనుంది. ఆర్థిక, ప్రభుత్వ, ఆరోగ్యరం గాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రసంగించే ఈ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి 3 వేల మందికిపైగా ప్రతి నిధులు వర్చువల్ విధానంలో హాజరవుతారు. 2022, మే 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సులో ప్రసంగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావుకు ఆహ్వానం అందింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న ప్రస్తుత సమయంలో ప్రపంచం పరివర్తన చెందాల్సిన తీరుపై వక్తలు ప్రసంగిస్తారని మిల్కెన్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ మైఖేల్ ఎల్ క్లౌడెన్ కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.