జిల్లాలో ప్రభుత్వం ఆరు ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేస్తోంది. కర్నూలు, ఆదోని, డోన్‌తో పాటు నంద్యాలలో రెండు పార్కులు ఉన్నాయి. కర్నూలు పరిధిలో ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఓహెచ్‌ఎం) కోసం 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో 8,300 ఎకరాలు పట్టా, తక్కినవి డీకేటీ భూములు. హైదరాబాద్ – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా ‘ఓహెచ్‌ఎం’ను నోడ్ పాయింట్’గా కేంద్రం ప్రభుత్వం 2020 ఆగస్టులో నోటిఫై చేసింది. ఇందులో ఇప్పటికే జయరాజ్ ఇస్పాత్‌కు తొలివిడతలో 413.19 ఎకరాలు కేటాయించింది. ఈ స్టీల్ ప్లాంటు పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలో ఫేజ్–2లో మరో 600 ఎకరాలు వీరికి ఏపీఐఐసీ కేటాయించనుంది. ఇందులో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తంగడంచలో జైన్ ఇరిగేషన్‌కు 623.40 ఎకరాలు కేటాయించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ పార్క్ ఇక్కడ ఏర్పాటవుతోంది.
భూముల కోసం 21 కంపెనీలు దరఖాస్తు
ఓహెచ్‌ఎంలోని గుట్టపాడు క్లస్టర్‌లో 4,900 ఎకరాలు ఏపీఐఐసీ సేకరించింది. ఇందులో సిగాచీ ఇండస్ట్రీస్, ఆర్‌పీఎస్ ఇండస్ట్రీస్‌తో పాటు మారుతి – సుజుకి కూడా ఫార్మారంగంలో ప్రవేశించేందుకు భూముల కోసం ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకుంది. వీటితో పాటు మరో 5 ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటితో పాటు ప్రైమో పాలీప్యాక్ (ప్లాస్టిక్ ఇండస్ట్రీ), బాక్లహ్యాక్, ఎక్సైల్ ఇమ్యూన్ లాజిక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ (వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్ తయారీ ప్లాంట్‌తో పాటు మరో 13 బడా కంపెనీలు కూడా గుట్టపాడు క్లస్టర్‌లో నిర్మాణాలు మొదలుపెట్టబోతున్నాయి.
ఫార్మారంగం అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ
గుట్టపాడు క్లస్టర్‌లో దరఖాస్తు చేసుకున్న కంపెనీలలో ఫార్మాకంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్ ఫార్మారంగానికి అనువైన వాతావరణం ఉన్న ప్రదేశాలు. హైదరాబాద్ కంటే కర్నూలులో వాతావరణ పరిస్థితులు ఫార్మా అభివృద్ధికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో భూసమస్య ఎక్కువగా ఉండటం, అక్కడి కంటే ఇక్కడి పరిస్థితులు అనువుగా ఉండటంతో తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకున్న ఫార్మా కంపెనీలు కర్నూలుపై దృష్టి సారిస్తున్నాయి. ఓర్వకల్‌లో ఎయిర్‌పోర్టు ఉండటం, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు కర్నూలుకు వచ్చేందుకు ఎయిర్ కనెక్టివిటీ కూడా దోహదం చేస్తుంది.
డీఆర్‌డీవోతో పాటు మరిన్ని సంస్థలు..
ఓహెచ్‌ఎంలో 250 ఎకరాల్లో డీఆర్‌డీవో ప్లాంటు నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఇవి కాకుండా వంద ఎకరాల్లో ఎన్‌ఐసీ, మెడ్‌సిటీతో పాటు ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈలు నిర్మిస్తున్నారు. బ్రాహ్మణపల్లి, తంగడంచ, ఇటిక్యాలతో పాటు అన్ని ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈలకు భూములు కేటాయిస్తున్నారు. బ్రాహ్మణపల్లిలో 20 యూనిట్లు, ఇటిక్యాలలో 4 యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు.
*********************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |