భారత్ లో భూ సంస్కరణలు స్వతంత్రయం అనంతరం చోటుచేసుకున్నాయి. భూ కమతాల పంపకంలోని అసమానతలను తొలగించి భూ యాజమానికి హక్కులను అందించడం ద్వారా దున్నేవాడికే భూమి అనే నానుడుని ప్రజాలలోకి తీసుకుని వెళ్లారు. భూ సంస్కరణల వలన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని సాధించుటకు మొదటి అడుగు పడింది. భూ సంస్కరణలు భారత దేశ అభివృద్ధికి అన్నీ విధాలా ఉపయోగ పడ్డాయి. భూ సంస్కరణలు చేపట్టిన తర్వాత పారిశ్రామికంగా, ఆర్ధికంగా, సామాజిక, న్యాయ అభివృద్ధి జరిగింది అని చెప్పొచ్చు.
స్వాతంత్ర్యం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భూ సంస్కరణలు 2 విధాలుగా జరిగాయి అవి:
- స్వాతంత్ర్యం నుండి 1970 వరకూ
- 1970 తర్వాత
ఈ భూ సంస్కారణలలో ముఖ్యమైన 3 చర్యలు చేపట్టారు అవి:
- కౌలు సంస్కరణలు
- మధ్యవర్తులను తొలగించడం
- భూ గరిష్ట పరిమితి విధించడం
భారతదేశం లో భూ సంస్కరణల్లో మధ్యవర్తిత్వ వ్యవస్థ బాగా ఉపయోగపడింది. స్వతంత్రయం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సీమాంధ్రులు, తెలంగాణా మధ్య చారిత్రక నేపద్యం భిన్నంగా ఉండటం వలన భూ పరిమితి చట్టం ఒకేలా ఉన్నా మధ్యవర్తుల తొలగింపు చట్టాల అమలులో కొంత తేడా ఉంది.
Adda247 APP
కౌలు సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కౌలుదారులు ముఖ్యంగా 2 రకాలుగా ఉండేవారు, జిరాయితీ పట్టా ఉన్న వారు మరియు పట్టా లేని వారు. 1949 లో ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కౌలుదార్లు మరియు రైతులకోసం చట్టాలు చేసింది. అయితే ఆంధ్రరాష్ట్రం అవతరించిన తర్వాత భూ సంస్కరణల కోసం 1955లో సుబ్బారావు కమిటీ సూచనల మేరకు ఒక ఆర్డినెన్సు జారీ చేశారు. ఆంధ్రరాష్ట్రం అవతరించిన తర్వాత 1956 లో కౌలు చట్టాలు అమలుచేశారు
కౌలు తైతులకు చేసిన చట్టాలలో పంటలో గరిష్టంగా 28% నుంది 50 % వరకూ మాత్రమే తీసుకోవాలి. ఒక సారి కౌలు దారుణుని నియామిస్తే 6 సంవత్సరాలు వరకూ వినియోగించుకోవచ్చు. కౌలు రైతు ఎప్పటికీ సాగుచేసే పొలనికి యజమాని కాలేడు.
మధ్యవర్తుల తొలగింపు
ఆంధ్రప్రదేశ్ లో మూడు రకాల భూస్వామ్య పద్దతులు ఉండే అవి జమిందారి, ఇనాందారి మరియు రైత్వారీ పద్దతులు
జమిందారి పద్దతి
ఆంధ్ర ప్రాంతంలో జమిందారి వ్యవస్థ బెంగాల్ లో 1793 లో ప్రవేశపెట్టిన తర్వాత అమలులోకి వచ్చింది. అప్పటి మద్రాసు ప్రాంతం లో ఉండగా 1802 జులై లో శాశ్వత శిస్తు విధాన చట్టం ద్వారా జమిందారి వ్యవస్థ ప్రారభమైంది.
ఇనాందారి పద్దతి
ఇనాం అంటే రాజు ఉచితం గా అందించిన భూమి అని అర్ధం. ఇనాంలు రాజులు సమాజానికి సేవ చేసిన , ప్రత్యేక పదవులు, ప్రముఖ వ్యక్తులకి ఇచ్చేవారు. ఇనాంని మొగస్సా అని అనేవారు. ఇనాం పరిణామాన్ని బట్టి మైనర్ ఇనాం లేదా ఖండక అని, కొన్ని గ్రామాలు కలిసి ఉంటే దానిని మేజర్ ఇనాం లేద సోప్రాయం అని అంటారు.
రైత్వారీ విధానం
రైత్వారీ విధానం 1972 లో మద్రాసు ప్రాంతం లో కొన్ని చోట్ల ప్రవేశపెట్టారు. దీనిని ప్రవేశ పెట్టింది సర్ థామస్ మన్రో. ఆంధ్ర ప్రాంతం లో దాదాపు 112 లక్షల ఎకరాలు భూమి రైత్వారీ విధానం లో ఉంది.
ఆంధ్రాలో ఏప్రిల్ 19, 1949 లో మద్రాసు ఎస్టేట్ బిల్లు లేద జమిందారి రద్దు, రైత్వారీ మార్పు బిల్లు ని శాసనసభ ఆమోదం ద్వారా 1950లలో అమలు లోకి వచ్చింది.
భూ పరిమితి చట్టాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1961 లో భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి రూ.3600 ఆదాయం వచ్చే భూమి మాత్రమే ఉండాలి అని తీర్మానించారు. భూమి రకాన్ని బట్టి 27ఎకరాల నుంచి 324 ఎకరాల వరకూ పరిమితిని విధించారు. ఈ చట్టం లో లోపాలను పసిగట్టి కొంతమంది భూమిని కాజేశారు. ఈ చట్టం పూర్తిగా అందరికీ న్యాయం చేయలేదు అని గ్రహించి రెండవ సారి 1973 లో మరొక గరిష్ట పరిమితి చట్టాన్ని చేశారు, అది 1975 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ భూసంస్కరనల చట్టం 1973
ఆంధ్రప్రాంతానికి మరియు తెలంగాణా కి ఒకేలా వర్తించేలా 1975 భూ గరిష్ట పరిమితి చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం అమలు లోకి వచ్చే ముందు 1972 లో ప్రభత్వం ఆర్డినెన్సు ద్వారా దొంగ డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు, దత్తత వంటివి నిరోధించేందుకు చర్యలు చేపట్టింది.1974 లో 34వ రాజ్యాంగ సవరణ ద్వారా భూ గరిష్ట పరిమితి చట్టం కోర్టు ల నుంది న్యాయ పరిధి నుండి మినహాయించారు.
భూ గరిష్ట పరిమితిని నిర్ణయించేందుకు 5గురు సభ్యులున్న కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణలోకి తీసుకున్నారు. ఈ కుటుంబం లో మైనర్, అవివాహిత కుమార్తెలను కూడా చేర్చారు. యూనిట్ కు గరిష్ట భూమిని మాగాణి అయితే 10 ఎకరాల నుంచి 27 ఎకరాలు, అదే మెట్ట భూమి అయితే 35 నుంచి 54 ఎకరాల వరకూ నిర్ణయించారు. రైతుల వద్దనుంచి మిగులు భూమిని ప్రభుత్వం స్వాదినం చేసుకుని SC, ST, మరియు BC లకు కేటాయించారు.
భూ గరిష్ట పరిమితి చట్టం పరిమితులు
- ఈ చట్టం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భూములకు వర్తించదు
- మత సంబంధమైన ట్రస్ట్ లు, విశ్వవిధ్యాలయాలు, దేవాలయాలు, ముస్లిం వక్స బోర్డు ఆధీనంలో ఉన్న భూములకు వరించదు.
- సహకార బ్యాంకు తకట్టులో ఉన్న భూములకు వర్తించదు
- భూదాన యజ్ఞ మండలి ఆదినం లో ఉన్న భూములు
- ప్రభుత్వ అవసరాలకొరకు సేకరించిన భూమికి ఈ చట్టం వర్తించదు
1994-95 మధ్యన ఉమ్మడి ఆంధ్ర ప్రాంతం లో ఉన్న మిగులు భూమి 16.23 లక్షల ఎకరాలు. వీటిని 7 విడతలుగా భూమి లేని ప్రజలకు పంపిణీ చేసింది
కోనేరు రంగారావు కమిటీ
2004 డిసెంబర్ 7 న భూ సంస్కరణల కోసం ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ వేసింది. ఈ కమిటీ 104 సిఫార్సులలో 74 సిఫార్సులను 2007 లో ప్రభుత్వం ఆంగీకరించింది.
కమిటీ లోని ముఖ్య సిఫార్సులు:
- భూ పంపకాలను గ్రామాలలో సర్పంచ్ అధ్యక్షతన కమిటీని వేసి అందులో ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని కూడా పరిగణలోకి తీసుకుని ఆఅ కమిటీ సిఫార్సుల మీది భూ పంపిణీ జరపాలి అని సూచించింది
- గిరిజన ప్రాంతంలో గిరిజనేతర భూములు తిరిగి గిరిజనులకి అందజేయలి అని తెలిపింది
- కౌలు రైతులకు బ్యాంకు ఋణ సదుపాయం కోసం గుర్తింపు పత్రాలు అందించాలి అని సూచించింది. ఈ సూచనతో 2011 లో దేశం లోనే మొట్టమొదటి సారిగా కౌలు రైతు లకు పత్రాలను అందించింది వీటిని లాండ్ లైసెసేడ్ కల్టీవెటర్ యాక్ట్ ను ప్రవేశపెట్టింది.
Andhra Pradesh History Notes – Land Reforms in Andhra Pradesh
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |