Telugu govt jobs   »   Last Minute Revision For TSPSC Group...

Last Minute Revision For TSPSC Group 2 Exam: Top 20 MCQs on Telangana Economy

TSPSC గ్రూప్ 2 పరీక్ష కోసం చివరి నిమిషంలో రివిజన్ క్విజ్: TSPSC గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్ 15 మరియు 16, 2024 తేదీలలో షెడ్యూల్ చేయబడినందున, సమయం చాలా ముఖ్యమైనది మరియు ప్రతి నిమిషం గణించబడుతుంది. మీ ప్రిపరేషన్‌ను పదును పెట్టడంలో మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో మీకు సహాయపడటానికి, మేము తెలంగాణ ఆర్ధిక వ్యవస్థపై దృష్టి సారించిన టాప్ 20 బహుళ-ఎంపిక ప్రశ్నల (MCQలు) సెట్‌ను మీకు అందిస్తున్నాము. ఈ ప్రశ్నలు తాజా మరియు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలపై మీ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి రూపొందించబడ్డాయి, మీరు మీ తయారీలో ముందుంటారని నిర్ధారిస్తుంది. ప్రతి ప్రశ్న పరీక్ష యొక్క క్లిష్ట స్థాయిని ప్రతిబింబించేలా రూపొందించబడింది, మీ అవగాహనను బలోపేతం చేయడానికి విశ్లేషణాత్మక అంతర్దృష్టులను మరియు వివరణాత్మక వివరణలను అందించడం.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC గ్రూప్ 2 పరీక్ష కోసం చివరి నిమిషం రివిజన్

Quick Revision Quiz for TSPSC Group 2

Q1. తెలంగాణ లో పట్టణ జనాభా గురించి కింద ఇవ్వబడిన అంశాలని గమనించండి.

  1. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లో గల 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో 50% కన్నా తక్కువ జనాభా పట్టణాల లో నివసిస్తున్నారు.
  2. రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, వరంగల్ అర్బన్ మరియు రంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో గ్రామీణ జనాభా కన్నా పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మాత్రమే సరైనది
  2. 2 మాత్రమే సరైనది
  3. 1 మరియు 2 సరైనవి
  4. 1 మరియు 2 సరికావు

S1. Ans(b)

Sol. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లో గల 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో 50% కన్నా తక్కువ జనాభా పట్టణాల లో నివసిస్తున్నారు. రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, వరంగల్ అర్బన్ మరియు రంగారెడ్డి అనే నాలుగు జిల్లాల్లో గ్రామీణ జనాభా కన్నా పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.

Q2. తెలంగాణ రైతు భీమా పథకం గురించి కింద ఇవ్వబడిన అంశాలను గమనించండి.

  1. ఈ పథకాన్ని CM చంద్రశేఖర్ రావు 2017 ఆగస్టు 15 న గోల్కొండ కోట లో ప్రారంభించారు.
  2. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు వయస్సు గల రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఐనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా పరిహారాన్ని అందిస్తారు.
  3. పథకం అమలు లో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఒప్పందం కుదుర్చుకుంది.

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మరియు 2 మాత్రమే సరైనవి
  2. 2 మరియు 3 మాత్రమే సరైనవి
  3. 1, 2,3 అన్నియు సరైనవి
  4. ఏవీ సరికావు

S2. Ans(b)

Sol. ఈ పథకాన్ని CM చంద్రశేఖర్ రావు 2018 ఆగస్టు 15 న గోల్కొండ కోట లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల లోపు వయస్సు గల రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఐనా చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి 5 లక్షల రూపాయల భీమా పరిహారాన్ని అందిస్తారు. పథకం అమలు లో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి రైతు కు సంవత్సరానికి రూపాయలు 2271 చొప్పున ప్రభుత్వం ప్రీమియం గా LIC కి చెల్లిస్తుంది.

Q3. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2002 ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల వద్ద) కన్నా ఎక్కువ ఎక్కువ ఉన్న జిల్లాలు ఎన్ని?

  1. 3 జిల్లాలు
  2. 4 జిల్లాలు
  3. 2 జిల్లాలు
  4. 1 జిల్లా

S3. Ans(c)

Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2002 ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల వద్ద): రూ. 2,78,833

రాష్ట్ర తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల వద్ద) కన్నా ఎక్కువ ఉన్న జిల్లాలు 2 అవి 1) రంగారెడ్డి (6,58,757) 2) హైదరాబాద్ (3,51,332)

Q4. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల ను వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ పేరు ఏమిటి?

  1. TS – aPASS
  2. TS – bPASS
  3. TS – cPASS
  4. TS – dPASS

S4. Ans(b)

Sol. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతుల ను వేగవంతం చేయడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ పేరు TS – bPASS. ఇది భవనాల విస్తృత కేటగిరీల వర్గీకరణ పై ఆధారపడి, భవనాల డిజైన్లను ఆమోదించే ఏక గవాక్ష వ్యవస్థ (Single Window System).

Q5. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం మొత్తం మీద దేశం లో పశుసంపద వృద్ధి లో ఏ రాష్ట్రం తర్వాత తెలంగాణ రెండవ స్థానం పొందింది.?

  1. పశ్చిమ బెంగాల్
  2. మద్య ప్రదేశ్
  3. బీహార్
  4. రాజస్తాన్

S5. Ans(a)

Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం మొత్తం మీద దేశం లో పశుసంపద వృద్ధి లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తర్వాత తెలంగాణ రెండవ స్థానం పొందింది.

Q6. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం మొత్తం మీద దేశం లో గొర్రెల జనాభా లో తెలంగాణ ఎన్నవ స్థానం లో ఉంది. ?

  1. 1వ స్థానం లో
  2. 2వ స్థానం లో
  3. 3వ స్థానం లో
  4. 4వ స్థానం లో

S6. Ans(a)

Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం మొత్తం మీద దేశం లో 19.1 మిలియన్ గొర్రెల జనాభా తో తెలంగాణ మొదటి స్థానం లో ఉంది.

Q7. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం పారిశ్రామిక రంగం గురించి కింద ఇవ్వబడిన అంశాలను గమనించండి

  1. పారిశ్రామిక రంగం లో అత్యదిక ఆదాయం అందిస్తున్న ఉపరంగం తయారీ రంగం.
  2. పారిశ్రామిక రంగం లో అత్యదిక ఉపాధి అందిస్తున్న ఉపరంగం తయారీ రంగం.

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మాత్రమే సరైనవి
  2. 1 మరియు 2 సరైనవి
  3. 2 మాత్రమే సరైనది
  4. ఏవీ సరికావు

S7. Ans(b)

Sol. పారిశ్రామిక రంగం లో అత్యదిక ఆదాయం అందిస్తూ మరియు ఎక్కువ ఉపాధి కల్పిస్తున్న ఉపరంగం తయారీ రంగం.

Q8. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం పారిశ్రామిక రంగం ని అభివృద్ధి చేయడానికి తీసుకు వచ్చిన TS-IPASS కి సంబందించి కింది అంశాలని గమనించండి.

  1. TS-IPASS ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు ధరకాస్తు చేసుకున్న 30 రోజుల్లో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు.
  2. TS-IPASS ద్వారా మొత్తం మీద ఇప్పటి వరకు 3185 పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు.

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మాత్రమే సరైనవి
  2. 1 మరియు 2 సరైనవి
  3. 2 మాత్రమే సరైనది
  4. ఏవీ సరికావు

S8. Ans(b)

Sol. TS-IPASS అనగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థ.

TS-IPASS ని రాష్ట్రం లో నూతన పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియ ను సులభతరం చేయడానికి 2014 లో తీసుకువచ్చారు. TS-IPASS ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు ధరకాస్తు చేసుకున్న 30 రోజుల్లో క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు.

TS-IPASS ద్వారా మొత్తం మీద ఇప్పటి వరకు 3185 పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు.

Q9. రాష్ట్రం లో ప్రతిష్టాత్మకం గా ప్రారంభించబడిన “ తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ “ ప్రాజెక్టు కి సంబంధించి కింది అంశాలని గమనించండి.

  1. రాష్ట్రం లో 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక సిద్దం చేయాలని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ని ప్రారంభించింది.
  2. ఈ ప్రాజెక్ట్ ని ప్రయోగాత్మకం గా రాజన్న సిరిసిల్ల మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల లో ప్రారంభించారు.
  3. ఈ ప్రాజెక్ట్ లో భాగం గా సేకరించిన ఆరోగ్య వివరాలని m-హెల్త్ అనే మొబైల్ యాప్ లో పొందుపరుస్తారు.

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మాత్రమే సరైనది
  2. 2 మరియు 3 మాత్రమే సరైనవి
  3. 1, 2,3 అన్నియు సరైనవి
  4. ఏవీ సరికావు

S9. Ans(a)

Sol. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా హెల్త్ ప్రొఫైల్ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఐ‌టి, పరిశ్రమల శాఖ మంత్రి KTR, ములుగు జిల్లా లో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రాష్ట్రం లో 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక సిద్దం చేయాలని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగం గా సేకరించిన ఆరోగ్య వివరాలని “e-హెల్త్” అనే మొబైల్ యాప్ లో పొందుపరుస్తారు.

Q10. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా ఉత్పత్తి లో రాష్ట్రం లోని మొదటి మూడు జిల్లాలు ఏవి. ?

  1. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి
  2. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి
  3. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి
  4. హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ

S10. Ans(a)

Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా ఉత్పత్తి లో రాష్ట్రం లోని మొదటి మూడు జిల్లాలు వరుసగా

రంగారెడ్డి (1,93,507 కోట్లు)

హైదరాబాద్ (1,62,877 కోట్లు)

మేడ్చల్ మల్కాజ్గిరి (70,870 కోట్లు)

Q11. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా ఉత్పత్తి లో రాష్ట్రం లోని చివరి మూడు జిల్లాలు ఏవి. ?

  1. రాజన్న సిరిసిల్ల, వనపర్తి, కుమురం భీమ్ ఆసిఫాబాద్
  2. వనపర్తి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు
  3. ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నారాయణపేట్
  4. కుమురం భీమ్ ఆసిఫాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల

S11. Ans(c)

Sol. తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్ లుక్ 2022 ప్రకారం ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా ఉత్పత్తి లో రాష్ట్రం లోని చివరి మూడు జిల్లాలు ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నారాయణపేట్

Q12. స్వచ్చ్ సర్వేక్షన్ 2021 లో “ ఉత్తమ స్వయం సమృద్ధి పట్టణం” అవార్డు అందుకున్న తెలంగాణ లోని పట్టణ స్థానిక సంస్థ ఏది. ?

  1. హైదరాబాద్
  2. వరంగల్
  3. సిద్దిపేట్
  4. నిజామాబాద్

S12. Ans(a)

Sol. స్వచ్చ్ సర్వేక్షన్ 2021 లో “ ఉత్తమ స్వయం సమృద్ధి పట్టణం” అవార్డు అందుకున్న తెలంగాణ లోని పట్టణ స్థానిక సంస్థ హైదరాబాద్ (GHMC), 40 లక్షల పైగా జనాభా ఉన్న ఉన్న పట్టణాల కేటగిరీ లో ఈ అవార్డు అందుకున్నది.

Q13. ముల్కీ నిబంధనలకు చట్ట బద్దత కల్పించే GO నం. 36 చెల్లదు అని ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్దం కాదు అని తెల్పిన కమిటీ ఏది. ?

  1. వశిష్ట భార్గవ కమిటీ
  2. కైలాస్ నాథ్ వాంచు కమిటీ
  3. కుమార లలిత కమిటీ
  4. పైవేవీ కావు

S13. Ans(b)

Sol. తెలంగాణ ప్రజల సమస్యలను దృష్టి లో ఉంచుకొని కేంద్రం 1969, మార్చి 28 నా ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్దమా కాదా అన్న విషయం పై స్పష్టత కోరుతూ వాంచు కమిటీ ని నియమించింది.

Q14. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా నది జలాల పంపిణీ యొక్క వివరాలలో సరైన దానిని ఎన్నుకొనుము?

  1. మహారాష్ట్ర(600 TMC), కర్నాటక(850 TMC), ఆంధ్ర ప్రదేశ్(950 TMC)
  2. మహారాష్ట్ర(630 TMC), కర్నాటక(800 TMC), ఆంధ్ర ప్రదేశ్(900 TMC)
  3. మహారాష్ట్ర(550 TMC), కర్నాటక(750 TMC), ఆంధ్ర ప్రదేశ్(850 TMC)
  4. మహారాష్ట్ర(666 TMC), కర్నాటక(911 TMC), ఆంధ్ర ప్రదేశ్(1005 TMC)

S14. Ans(d)

Sol. 2004 ఏప్రిల్ 2వ తేదీన ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా నదీ జలాల పంపిణీ ని గత 47 ఏళ్ల నుండి కృష్ణ నదికి చేరే సంవత్సరిక వర్షపాతన్ని ఆధారంగా చేసుకొని 65% నీటిని 2582 TMC లను 3 రాష్ట్రాల మద్య పంపిణీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర(666 TMC), కర్నాటక(911 TMC), ఆంధ్ర ప్రదేశ్(1005 TMC)

Q15. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నది జలాల పంపిణీ యొక్క వివరాలలో సరైన దానిని ఎన్నుకొనుము. ?

  1. మహారాష్ట్ర(880 TMC), కర్నాటక(20 TMC), మధ్య ప్రదేశ్(625 TMC), ఒరిస్సా(293 TMC), ఆంధ్ర ప్రదేశ్(1480 TMC)
  2. మహారాష్ట్ర(780 TMC), కర్నాటక(40 TMC), మధ్య ప్రదేశ్(525 TMC), ఒరిస్సా(193 TMC), ఆంధ్ర ప్రదేశ్(1580 TMC)
  3. మహారాష్ట్ర(980 TMC), కర్నాటక(50 TMC), మధ్య ప్రదేశ్(725 TMC), ఒరిస్సా(393 TMC), ఆంధ్ర ప్రదేశ్(1380 TMC)
  4. మహారాష్ట్ర(580 TMC), కర్నాటక(90 TMC), మధ్య ప్రదేశ్(425 TMC), ఒరిస్సా(253 TMC), ఆంధ్ర ప్రదేశ్(1080 TMC)

S15. Ans(a)

Sol. 1976 జూలై 12 న ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ తన రిపోర్టును ను 1980 జులై 7 న సమర్పించింది. బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసిన గోదావరి నీటి వాటాల వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర(880 TMC), కర్నాటక(20 TMC), మధ్య ప్రదేశ్(625 TMC), ఒరిస్సా(293 TMC), ఆంధ్ర ప్రదేశ్(1480 TMC)

Q16. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2022 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలు) గురించి కింది అంశాలను గమనించండి.

  1. రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ గల మొదటి మూడు జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి
  2. రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా చివరి మూడు జిల్లాలు వికారాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్
  3. తలసరి ఆదాయంలో రెండంకెల వృద్ధిరేటు సాధించిన జిల్లాలు సిద్దిపేట్ మరియు మహబూబాబాద్

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మరియు 2 మాత్రమే సరైనవి
  2. 2 మరియు 3 మాత్రమే సరైనవి
  3. 1, 2,3 అన్నియు సరైనవి
  4. ఏవీ సరికావు

S16. Ans(c)

Sol. తెలంగాణలో తలసరి ఆదాయం (ప్రస్తుత ధరలు) 2,78,833

రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ గల మొదటి మూడు జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి

రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా చివరి మూడు జిల్లాలు వికారాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్

తలసరి ఆదాయంలో రెండంకెల వృద్ధిరేటు సాధించిన జిల్లాలు సిద్దిపేట్ మరియు మహబూబాబాద్

Q17. స్వాతంత్ర్యం అంటే విదేశీ పాల నుండి విముక్తి పొందడమే కాదు భారత పెట్టుబడిదారులు  భూస్వాముల దోపిడీ నుండి రైతులను విముక్తి చేయడం అని  అభిప్రాయపడింది ఎవరు?

  1. బాలగంగాధర్ తిలక్
  2. సుభాష్ చంద్రబోస్
  3. మహాత్మా గాంధీ
  4. సర్దార్ వల్లభాయ్ పటేల్

S17. Ans(c)

Sol. స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలన నుండి విముక్తి పొందడమే కాదు భారత పెట్టుబడిదారులు భూస్వాముల దోపిడీ నుండి రైతులను విముక్తి చేయడం అని వ్యాఖ్యానించింది మహాత్మా గాంధీ.

Q18. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నవ అధికరణ లో భూసంస్కరణల లక్ష్యాలు పొందుపరచబడి నాయి.?

  1. 37 వ అధికరణ
  2. 38 వ అధికరణ
  3. 39 వ అధికరణ
  4. 40 వ అధికరణ

S18. Ans(c)

Sol. భారత రాజ్యాంగం లో 39 అధికరణ లో భూసంస్కరణల లక్ష్యాలు పొందుపరిచారు. అవి భారత ప్రజలకు చెందిన ప్రధాన ఆధారభూతాలైన భౌతిక వనరుల మీద యాజమాన్యం నియంత్రణ సకల జాతుల కు ప్రయోజనం కలిగించే విధంగా న్యాయంగా పంపిణీ జరిగే విధంగా ఉండాలి.

Q19. నిజాం పరిపాలన కాలంలో  వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందడం కింది వానిలో దేనికి సరైన అర్థం అగును?

  1. సర్ బస్తా
  2. ఖల్స
  3. సర్ఫ్ ఎ ఖాస్
  4. పైవేవీ కావు

S19. Ans(a)

Sol. వేలంపాట ద్వారా శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందే విధానాన్ని సర్ బస్తా లేదా తహాడ్ అని అంటారు.

Q20. హైదరాబాద్  ప్రాంతంలో కౌలు చెల్లింపు రకాల గురించి కింది అంశాలను గమనించండి.

  1. బెతాయి అనగా పంటలో భాగం కౌలు దారుడు పండించిన పంటలో 50% భాగాన్ని కౌలు గా చెల్లించాల్సి వచ్చేది.
  2. గల్లా మక్త్యా విధానం అనగా ఉత్పత్తి తో సంబంధం లేకుండా స్థిర భాగాన్ని చెల్లించుట.
  3. సర్ఫ్ ఎ ఖాస్ అనగా పంట దిగుబడి తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొంత సొమ్ము భూస్వామి కి చెల్లించాలి.

పై అంశాలను గమనించి కింద ఇచ్చిన 4 ఆప్షన్ల లో సరైన దానిని ఎన్నుకొనుము.

  1. 1 మరియు 2 మాత్రమే సరైనవి
  2. 2 మరియు 3 మాత్రమే సరైనవి
  3. 1, 2,3 అన్నియు సరైనవి
  4. ఏవీ సరికావు

S20. Ans(b)

Sol. బెతాయి అనగా పంటలో భాగం కౌలు దారుడు పండించిన పంటలో కొంత భాగాన్ని కౌలు గా చెల్లించాల్సి వచ్చేది. సాధారణంగా 20% నుండి 40% మధ్య ఉండేది.

గల్లా మక్త్యా విధానం అనగా ఉత్పత్తి తో సంబంధం లేకుండా స్థిర భాగాన్ని చెల్లించుట (Ex: ఎకరానికి 3 బస్తాలు)

సర్ఫ్ ఎ ఖాస్ అనగా పంట దిగుబడి తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొంత సొమ్ము భూస్వామి కి చెల్లించాలి. ఇది ద్రవ్య రూపం లో ఉండేది.

pdpCourseImg

TEST PRIME - Including All Andhra pradesh Exams

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Last Minute Revision For TSPSC Group 2 Exam: Top 20 MCQs on Telangana Economy_6.1