Telugu govt jobs   »   Last Minute Revision Quiz For TSPSC...

Last Minute Revision For TSPSC Group 2 Exam: Top 20 MCQs on Telangana History

TSPSC గ్రూప్ 2 పరీక్ష కోసం చివరి నిమిషంలో రివిజన్ క్విజ్: TSPSC గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్ 15 మరియు 16, 2024 తేదీలలో షెడ్యూల్ చేయబడినందున, సమయం చాలా ముఖ్యమైనది మరియు ప్రతి నిమిషం గణించబడుతుంది. మీ ప్రిపరేషన్‌ను పదును పెట్టడంలో మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో మీకు సహాయపడటానికి, మేము తెలంగాణ చరిత్రపై దృష్టి సారించిన టాప్ 20 బహుళ-ఎంపిక ప్రశ్నల (MCQలు) సెట్‌ను మీకు అందిస్తున్నాము. ఈ ప్రశ్నలు తాజా మరియు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలపై మీ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి రూపొందించబడ్డాయి, మీరు మీ తయారీలో ముందుంటారని నిర్ధారిస్తుంది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC గ్రూప్ 2 పరీక్ష కోసం చివరి నిమిషం రివిజన్

Q1. జాబితా -1 ను జాబితా -2 తో జతపరిచిన సరైనసమాధానాన్ని ఎన్నుకోండి

జాబితా-1                                జాబితా -2

1) జయపసేనాని                              a) జనాశ్రయ చందోవిచ్చిత్తి

2)నాల్గవ మాధవవర్మ                       b) నృత్యరత్నావళి

3)శాకల్య మల్ల                                  c)ఆంధ్ర దశకుమార చరిత్ర

4)కేతన                                            d) నిరోష్ట్యరామాయణం

(a) 1-d,2-c, 3-b,4-a

(b) 1-a, 2-c,3-b,4-d

(c) 1-c,2-b,3-a, 4-d

(d) 1-b,2-a,3-d, 4-c

Q2. తెలంగాణా ప్రాంతం యొక్క తొలి సాహిత్య గ్రంధాలు శాతవాహన కాలంనాటి బృహత్కథ, గాధసప్తశతి, లీలావతి ఏ భాషలో  వ్రాయబడ్డాయి

(a) కొంకణి

(b) పాళీ

(c) సంస్కృతం

(d) ప్రాకృతం

Q3.జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

జాబితా 1                                  జాబితా 2

1) కీసర గుట్ట శిలా శాసనం                        a) సతార జిల్లా, మహారాష్ట్ర

2)సలేశ్వరం శిలా శాసనం                          b) రంగారెడ్డి జిల్లా

3)చిక్కుళ్ళ రాగి శాసనం                           c) తుని, తూర్పు గోదావరి

4)ఖానాపూర్ రాగి శాసనం                        d)   అమ్రాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా

(a) 1-d,2-c, 3-b,4-a

(b) 1-a, 2-c,3-b,4-d

(c) 1-c,2-d,3-b, 4-a

(d) 1-b,2-d,3-c, 4-a

Q4. కాకతీయ రాజులలో మొదటి స్వతంత్ర కాకతీయ రాజు

(a) గణపతిదేవుడు

(b)ప్రతాపరుద్రుడు

(c) రెండవ ప్రోలరాజు

(d)రుద్రదేవుడు

Q5.జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

జాబితా 1                                  జాబితా 2

1) పెరిష్టా                           a) తజూకీరాత్ ఉల్ – ముల్క్

2) ముల్లా మహమ్మద్         b)తౌఫతూన్ సలాటిన్

3)ముల్లా దావూద్                c) గుల్షన్ – ఐ – ఇబ్రహీమి

4)రఫీవుద్దీన్                       d)సిరాజత్ తారీఖు

(a) 1-d,2-c, 3-b,4-a

(b) 1-a, 2-c,3-b,4-d

(c) 1-c,2-d,3-b, 4-a

(d) 1-b,2-d,3-c, 4-a

Q6. కాపయ నాయకుడు  సింగమనీడు, వేమారెడ్డిల సహాయంతో క్రీ.శ. 1336 లో ఓరుగల్లుపై దండెత్తి అక్కడి ముస్లిం గవర్నర్ మాలిక్ మాక్బులు ఓడించి తరిమివేశాడు. విజయం తరువాత కాపయ ఓరుగల్లు కోటలోకి ప్రవేశించి ఏ  బిరుదులు ధరించాడు.

(a) ఓరుగల్లు చొర

(b) ఆంధ్ర ధీర

(c) “ఆంధ్రసురత్రాణ ”, “ ఆంధ్రాదీశ్వర “

(d) ఆంధ్ర పుండరీకం

Q7. ఆపరేషన్ పోలో ‘ లేదా ‘ పోలీస్ చర్య హైదరాబాద్ సంస్థానంపై  ఐదు రోజుల పాటు కొనసాగింది.అయితే ఇది ఏ రోజున ప్రారంభమై ఏ రోజు ముగిసింది.

(a) సెప్టెంబర్ 13,సెప్టెంబర్ 17

(b)జూలై 5,జూలై 10

(c) ఆగస్ట్ 10, ఆగస్ట్ 15

(d)నవంబర్ 14, నవంబర్ 19

Q8.గుల్బర్గాలో జామా మస్జీద్ ఎవరి  కాలంలో నిర్మించబడింది

(a) ఫిరోజ్ షా

(b)మూడవ మహమ్మదా షా

(c) రెండవ  మహమ్మదా షా

(d)మొదటి మహమ్మదా షా

Q9. 1947 నవంబర్ 29 న గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, నిజాం రాజు ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే క్రింది వాటిలో సరికాని వాక్యం

(a) సమాచార వ్యవస్థ, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు సహా పలు ఉమ్మడి అంశాలకు సంబంధించి 1947 ఆగస్ట్ 15 కు ముందు బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం రాజుకు మధ్య ఉన్నటువంటి పాలనాపరమైన విధానాలే ఇకపై భారత ప్రభుత్వం, నిజాం రాజుకు మధ్య కొనసాగుతాయి.

(b) ఒప్పందాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం కోసం హైదరాబాద్, ఢిల్లీల్లో తమ ఏజెంట్లను నియమించి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని భారత ప్రభుత్వం, నిజాం రాజు నిర్ణయించారు.

(c) ఆధిపత్యం చూపించుకునేందుకు ఉద్దేశించిన చర్యలేవీ చేపట్టకూడదు.

(d) రెండు సంవత్సరాల  పాటు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది.

Q10. మాదరి భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి  క్రింది వాటిలో సరికాని వాక్యం

(a) 1910 వ సంవత్సరంలో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధకోసం వైదిక ధర్మ ప్రచారిణీ సభను స్థాపించాడు.

(b) 1912 వ సంవత్సరంలో స్వస్తిక్ వాలంటీర్ల సంఘాన్ని ప్రారంభించి దళితుల సేవకు ఈ దళాన్ని ఉపయోగించాడు.

(c) 1911 వ సంవత్సరంలో జగన్మిత్రమండలి పరిధిని విస్తృతపరచి మన్య సంఘాన్ని ఏర్పర్చాడు.

(d) 1913 వ సంవత్సరంలో ఆర్యసమాజికుడు అయిన అరిగే రామకృష్ణ  భాగ్యరెడ్డికి ఆర్యసమాజ దీక్ష ఇచ్చి వర్మ బిరుదు ఇచ్చాడు.

Q11. మేజర్ జనరల్ జే.న్.చౌదరి నేతృత్వంలో దళాల గూర్చి జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

జాబితా 1                                  జాబితా 2

1)   స్ట్రైక్ ఫోర్స్           a) పదాతి, అశ్విక, స్వల్పస్థాయి శతఘ్నిదళాల సమ్మేళనం

2) స్మాష్ ఫోర్స్          b) పదాతి దళం, ఇంజినీరింగ్ యూనిట్లు

3) కిల్ ఫోర్స్              c) సాయుధ దళాలు, శతఘ్ని దళం

4)వీర్ ఫోర్స్               d) పదాతి దళం, యుద్ధ ట్యాంక్ విధ్వంసక దళం, ఇంజినీరింగ్ యూనిట్

(a) 1-d,2-c, 3-b,4-a

(b) 1-a, 2-c,3-b,4-d

(c) 1-c,2-d,3-b, 4-a

(d) 1-b,2-d,3-c, 4-a

Q12. కాంగ్రెస్ నాయకుడైన రామానంద తీర్థ నిజాం నిర్ణయానికి వ్యతిరేకంగా జాయిన్ ఇండియా యూనియన్ ఉద్యమాన్ని ఏ తేదిన ప్రారంభించాడు

(a) జూలై 14  , 1947

(b) జూలై 7, 1947

(c) జూలై 12, 1947

(d) జూలై 13  , 1947

Q13.క్రింది కాకతీయ రాజులలో సామంతరాజు కానీ వారు

(a) మొదటి బేతరాజు

(b) మొదటి ప్రోల రాజు

(c) రెండవ బేతరాజు

(d)రెండవ ప్రతాప రుద్రుడు

Q14.జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

జాబితా 1                                  జాబితా 2

1)1878                           a) యువతీ శరణాలయం

2)1907                           b) అఖిలభారత మహిళా కాన్ఫరెన్స్

3)1922                           c) ఆంధ్ర సోదరి సమాజం

4)1916                           d) అఘోరనాధ ఇంప్రూమెంట్ అసోసియేషన్

(a) 1-d,2-c, 3-a,4-b

(b) 1-a, 2-c,3-b,4-d

(c) 1-c,2-d,3-b, 4-a

(d) 1-b,2-d,3-c,4-a

Q15.చివరి గోల్కొండ సుల్తాను అబుల్షాసన్ తానీషా కాలంలో మొత్తం గోల్కొండ సామ్రాజ్యం ఎన్ని  సర్కార్లుగా, ఎన్ని పరగణలుగా విభజించబడింది.

(a) 37  సర్కార్లుగా, 517 పరగణలు

(b) 38  సర్కార్లుగా, 525  పరగణలు

(c) 42 సర్కార్లుగా, 532 పరగణలు

(d) 53 సర్కార్లుగా, 3 17 పరగణలు

Q16. అమోఘ వర్షుడు రాష్ట్రకూట రాజ రచించిన  గ్రంథాలు

(a) జనశ్రీయ చందో విచితి,రత్న మాలిక

(b) కవిరాజమార్గం, జనశ్రీయ చందో విచితి

(c) కవిరాజమార్గం ‘ ‘ రత్నమాలిక

(d) నృత్య రత్నావళి, జనశ్రీయ చందో విచితి

Q17. విజయం సాధించిన ప్రతి చోటా రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించిన రాజు

(a) మొదటి  మాధవవర్మ

(b) రెండో మాధవవర్మ

(c) రెండవ మాధవవర్మ

(d) రెండవ ఇంద్ర

Q18. మొదటి శాతకర్ణి పశ్చిమ మాళ్వా, అనూప లేదా నర్మదా లోయ, దక్షిణ విదర్భ మొదలగు ప్రాంతాలను జయించినట్లు, ఇతనికి శూర, అప్రతహతిచక్ర, దక్షిణాపథపతి అను బిరుదులు ఉన్నట్లు ఏ  శాసనం ద్వారా తెలుస్తున్నది.

(a) సాతానికోట శాసనం

(b) నానాఘట్ శాసనం

(c) విజయపురి శాసనం

(d) మ్యాకదోని శాసనం

Q19.  జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

జాబితా 1                                            జాబితా 2

1)ఉస్మానియా విశ్వవిద్యాలయం                                a) హిందూ – ముస్లీం పాశ్చత్య శైలి

2) హైకోర్టు భవనం                                                        b) సారసానిక్ రాజస్థానీ శైలి

3) అసెంబ్లీ భవనం                                                       c) మొఘల్ – ఇండో వాస్తు నిర్మాణ శైలి

4)హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు             d) ఇండో – సారసానిక్ శైలి

(a) 1-d,2-c, 3-a,4-b

(b) 1-a, 2-c,3-b,4-d

(c) 1-c,2-d,3-b, 4-a

(d) 1-b,2-d,3-c, 4-a.

Q20. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన, అలాగే దానిని నిజాం నిషేధించిన తేది

(a) 1939  జనవరి 29, సెప్టెంబర్ 8  , 1939

(b)1938 జనవరి 28, సెప్టెంబర్ 7, 1939

(c) 1937 జనవరి 29, సెప్టెంబర్ 7, 1938

(d) 1938 జనవరి 29, సెప్టెంబర్ 7, 1938

Last Minute Revision – Telangana Schemes and Policies

Solutions:

S1.Ans.(d)

Sol.విష్ణుకుండిన రాజవంశానికి చెందిన నాల్గవ మాధవవర్మ రచించిన జనాశ్రయ చందోవిచ్చిత్తి, రాష్ట్రకూటలు వారి సామంతులైన వేములవాడ చాళుక్యుల పోషణలో అనేక గ్రంథాలు రచించబడ్డాయి. ఈ కాలంలోని ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, తెలంగాణలోని వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడ ఆదికవి పంప నివసించారు. కాకతీయ కాలంలో భారీస్థాయిలో సాహిత్య సృష్టి జరిగింది సాహిత్యానికి ఇది భారీ నిధి లాంటిది. వీటిలో:

  • విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్రీయం, శాకల్య మల్ల నిరోష్ట్యరామాయణం,
  • గంగాదేవికి చెందిన మధురావిజయం
  • జయపసేనాని గొప్ప రచనలైన నృత్యరత్నావళి, సంగీతరత్నావళి, వాద్యరత్నావళి
  • తిక్కన సోమయాజీ రచించిన ఆంధ్ర మహాభారతం
  • గోన బుద్దారెడ్డి రాసిన రంగనాథ రామాయణం
  • మారన రచించిన మార్కండేయ పురాణం
  • కేతన రచన ఆంధ్ర దశకుమార చరిత్ర
  • కాకతీయ రుద్రదేవుడు రచించిన నీతిసారం
  • పాల్కురికి సోమనాధుని పండితరాధ్య చరిత్ర
  • బద్దెన సుమతిశతకం మొదలైనవి.

S.2.Ans.(d)

Sol.తెలంగాణా ప్రాంతం యొక్క తొలి సాహిత్య గ్రంధాలు శాతవాహన కాలంనాటి బృహత్కథ, గాధసప్తశతి, లీలావతి ప్రాకృతంలో వ్రాయబడ్డాయి

S.3.Ans.(d)

Sol.శాసనం పేరు                                        ప్రాంతం

  1. తుమ్మల గూడెం రాగి శాసనాలు -2  వలిగొండ మండలం, నల్గొండ జిల్లా
  2. చైతన్యపురి శిలా శాసనం  హైదరాబాద్
  3. కీసర గుట్ట శిలా శాసనం రంగారెడ్డి జిల్లా
  4. సలేశ్వరం శిలా శాసనం అమ్రాబాద్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా
  5. వేల్పూరు శిలా శాసనం సత్తెనపల్లి, గుంటూరు జిల్లా
  6. ఈపూరు రాగి శాసనాలు -2 తెనాలి, గుంటూరు జిల్లా
  7. రామతీర్థం రాగి శాసనం విశాఖపట్నం జిల్లా
  8. చిక్కుళ్ళ రాగి శాసనం  తుని, తూర్పు గోదావరి
  9. తుండి రాగి శాసనం తుని, తూర్పు గోదావరి జిల్లా
  10. పొలమూరు రాగి శాసనాలు రామచంద్రాపురం, తూర్పు గోదావరి జిల్లా
  11. ఖానాపూర్ రాగి శాసనం  సతార జిల్లా, మహారాష్ట్ర

S4.Ans(d )

Sol.రుద్రదేవుడు మొదటి స్వతంత్ర కాకతీయ రాజు. ఇతడు క్రీ.శ. 1163 లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నట్లు అతడు వేయించిన అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం తెలియచేస్తుంది. రుద్రదేవుడు తన సమకాలీన నాయకులైన దొమ్మరాజు ( నగర – కరీంనగర్), మేడరాజు (పొలవాస -కరీంనగర్), మల్లిగదేవుడు, చౌడ ఉదయనుడు మొదలైన వారిని ఓడించి యావత్ తెలంగాణపై తన అధికారాన్ని నెలకొల్పినట్లు ఈ శాసనంలోని వివరాలు తెలియచేస్తున్నాయి. ఇతని సేనాధిపతియైన వెల్లంకి గంగాధరుడు తెలుగు చోళరాజైన కందూరి చోళ భీమున్ని ఓడించెను. రుద్రదేవుడు తన అధికారులు, సేనాధిపతుల సహకారంతో కాకతీయ వంశాధికారాన్ని తెలంగాణలో స్థిరపర్చినాడు.

Sol.5.Ans.(c)

Sol.బహమనీ సామ్రాజ్య పునర్నిర్మాణానికి అనేక సాహిత్య, విదేశీ ఆధారాలు తోడ్పడుతున్నాయి.

  • బహమనీ కాలం నాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను పెరిష్టా తన రచన “ గుల్షన్ – ఐ – ఇబ్రహీమి ” లో సంపూర్ణంగా వివరించాడు.
  • ముల్లా మహమ్మద్ లారీ తన రచన “ సిరాజత్ తారీఖు ” లో బహమనీ పాలనకు సంబంధించిన అనేక అంశాలను రాశాడు.
  • ముల్లా దావూద్ బిద్ర రచన “ తౌఫతూన్ సలాటిన్ ” లో పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులను వివరించాడు.
  • రఫీవుద్దీన్ రచన “ తజూకీరాత్ ఉల్ – ముల్క్ ” లో బహమనీ రాజ్యంలోని అనేక అంశాలను పేర్కొన్నాడు.

S6.Ans(c)

Sol.కాపయ నాయకుడు ( క్రీ.శ. 1335-1368): ప్రోలయకు సంతానం లేనందువల్ల అతని మరణం తరువాత అతని పినతండ్రి కుమారుడు కాపయ నాయకుడు సింహాసనం అధిష్ఠించాడు. ఇతడు విశ్వేశ్వర భక్తుడు. ఓరుగల్లును సాధించవలెననే లక్ష్యంతో సింగమనీడు, వేమారెడ్డిల సహాయంతో క్రీ.శ. 1336 లో ఓరుగల్లుపై దండెత్తి అక్కడి ముస్లిం గవర్నర్ మాలిక్ మాక్బులు ఓడించి తరిమివేశాడు. విజయం తరువాత కాపయ ఓరుగల్లు కోటలోకి ప్రవేశించి “ ఆంధ్రసురత్రాణ ”, “ ఆంధ్రాదీశ్వర ” అనే బిరుదులు ధరించాడు. దాంతో ఓరుగల్లుపై తుగ్లక్ అధికారం అంతం అయింది.

S7.Ans(a)

Sol.ఆపరేషన్ పోలో ‘ లేదా ‘ పోలీస్ చర్య ఐదు రోజుల పాటు కొనసాగింది. 1948 లో సెప్టెంబర్ 13 న ప్రారంభమై, లో సెప్టెంబర్ 13 న ముగిసింది. సెప్టెంబర్ 17 న ప్రధానమంత్రి లాయక్ అలీ మంత్రివర్గం రాజీనామా చేసింది. పాలనాధికారం నిజాం రాజుకు అప్పగించింది. మునీ ద్వారా నిజాం రాజు భారత ప్రభుత్వానికి ఒక సందేశం పంపించారు.

S8.Ans(d)

Sol.గుల్బర్గాలో జామా మస్జీద్ మొదటి మహమ్మదా కాలంలో నిర్మించబడింది. ఇది చాలా అద్భుతమైన నిర్మాణం. ఈ భవనంలో పర్షియా, సిరియా, టర్కీ వారి నుండి స్వీకరించిన శైలులతో హిందూ ప్రభావంతో నిర్మించబడిన వాస్తు ఉంది. దీని ముఖ్య లక్షణం ఏమిటంటే సమావేశ మందిరం మొత్తం కప్పబడి ఉంది. భారతదేశంలో ఏ నిర్మాణం దీని మాదిరిగా నిర్మించబడలేదు.

S9.Ans(d)

Sol.ఈ ఒప్పందంపై 1947 నవంబర్ 29 న గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్, నిజాం రాజు సంతకాలు చేశారు. అయితే, ఇది తాత్కాలిక ఒప్పందమేనని, తాను శాశ్వతంగా తన సౌర్వభౌమాధికారాన్ని వదులుకుంటానన్నది ఈ ఒప్పందం ఉద్దేశం కాదని అదే రోజు మౌంట్బాటన్కు నిజాం రాజు లేఖ రాశారు.

ఆ ఒప్పందంలోని ముఖ్యాంశాలు

  • సమాచార వ్యవస్థ, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు సహా పలు ఉమ్మడి అంశాలకు సంబంధించి 1947 ఆగస్ట్ 15 కు ముందు బ్రిటిష్ ప్రభుత్వం, నిజాం రాజుకు మధ్య ఉన్నటువంటి పాలనాపరమైన విధానాలే ఇకపై భారత ప్రభుత్వం, నిజాం రాజుకు మధ్య కొనసాగుతాయి,
  • ఒప్పందాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం కోసం హైదరాబాద్, ఢిల్లీల్లో తమ ఏజెంట్లను నియమించి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని భారత ప్రభుత్వం, నిజాం రాజు నిర్ణయించారు.
  • ఆధిపత్యం చూపించుకునేందుకు ఉద్దేశించిన చర్యలేవీ చేపట్టకూడదు.
  • ఈ ఒప్పందానికి సంబంధించి ఏవైనా వివాదాలు తలెత్తితే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి. ఇందుకు భారత ప్రభుత్వం, నిజాం రాజు చెరొక మధ్యవర్తిని నియమించాలి. వారిద్దరు కలిసి ఒక న్యాయ నిర్ణేతను ఎంపిక చేస్తారు. ఈ బృందం వివాద పరిష్కారానికి కషి చేస్తుంది.
  • ఒక సంవత్సరం పాటు ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది.

S10.Ans(d)

Sol.హైదరాబాద్ రాజ్యంలో దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ, అంటరానితనానికి కులవివక్షకు వ్యతిరేకంగా ఆది హిందూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ఆద్యుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ. 1910 వ సంవత్సరంలో దళితుల్లో ధార్మిక నైతిక ప్రబోధకోసం వైదిక ధర్మ ప్రచారిణీ సభను స్థాపించాడు. 1913 వ సంవత్సరంలో ఆర్యసమాజికుడు అయిన బాజీ కృష్ణారావు భాగ్యరెడ్డికి ఆర్యసమాజ దీక్ష ఇచ్చి వర్మ బిరుదు ఇచ్చాడు. ఆంగ్ల భాషలో అనర్గళంగా ఉపన్యాసాలు చేయడమేకాక, హిందీ, మరాఠి, కన్నడ, తమిళంలో కూడా ప్రవేశం ఉండేది. దళితుల్లో వివిధ ఉపకులాల మధ్య సఖ్యత కోసం వారికి సామూహిక ప్రీతి భోజన కార్యక్రమాలు నిర్వహించేవాడు. 1912 వ సంవత్సరంలో స్వస్తిక్ వాలంటీర్ల సంఘాన్ని ప్రారంభించి దళితుల సేవకు ఈ దళాన్ని ఉపయోగించాడు. 1911 వ సంవత్సరంలో జగన్మిత్రమండలి పరిధిని విస్తృతపరచి మన్య సంఘాన్ని ఏర్పర్చాడు. 1918 లో సంవత్సరంలో దీన్ని ‘ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’గా మార్చాడు. బ్రహ్మసమాజ విధివిధానాల్ని తెలుసుకోడానికి మన్య సంఘం సభ్యుల సమావేశానికి ఆంధ్రప్రాంత బ్రహ్మ సమాజికులైన పాలపర్తి నర్సింహం, హనుమంతు హాజరైనారు.

S11.Ans.(b)

Sol.స్ట్రైక్ ఫోర్స్ : పదాతి, అశ్విక, స్వల్పస్థాయి శతఘ్నిదళాల సమ్మేళనం.

స్మాష్ ఫోర్స్ : సాయుధ దళాలు, శతఘ్ని దళం

కిల్ ఫోర్స్ : పదాతి దళం, ఇంజినీరింగ్ యూనిట్లు.

వీర్ ఫోర్స్ : పదాతి దళం, యుద్ధ ట్యాంక్ విధ్వంసక దళం, ఇంజినీరింగ్ యూనిట్

S12.Ans(b)

Sol.జాయిన్ ఇండియా ఉద్యమం – 1947:

బ్రిటీష్ పాలనానంతరం తరవాత నిజాం ప్రభుత్వం స్వాతంత్ర్యాన్ని ప్రకటించ పూసుకొన్నారు. కాంగ్రెస్ నాయకుడైన రామానంద తీర్థ నిజాం నిర్ణయానికి వ్యతిరేకంగా జాయిన్ ఇండియా యూనియన్ ఉద్యమాన్ని జూలై 7, 1947 న ప్రారంభించాడు. శాంతియుత హక్కులు, స్వచ్ఛందంగా కార్మికులు పని నిలిపివేత, విద్యార్థుల తరగతుల బహిష్కరణలకు పిలుపునిచ్చాడు.

S13.Ans(d)

Sol.రెండవ ప్రతాప రుద్రుడు – స్వతంత్ర్య కాకతీయ రాజు

S14.Ans(a)

Sol.తెలంగాణలో మహిళలపై సాంఘిక దురాచారాలు, వారి వెనుకబాటుతన నిర్మూలనకై అనేక సంఘాలు స్థాపించి ఉద్యమాలు నిర్వహించారు. క్రీ.శ.1878 లో అఘోరనాధ ఇంప్రూమెంట్ అసోసియేషన్ ‘ స్థాపించారు. సాంఘిక విషయాలను చర్చించడం, మూఢనమ్మకాలు, మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆ కాలంలోనే మరో సంస్కర్త ముల్లా అబ్దుల్ ఖయ్యూం స్త్రీ విద్య కోసం కృషిచేశారు. మహిళాభ్యుదయం కోసం అనేక సమాజాలు స్థాపించబడ్డాయి. ఇందులో స్త్రీలను చైతన్యవంతులను చేయడానికి కృషిచేసేవారు. క్రీ.శ. 1907 లో సీతాబాయి ‘ భారత మహిళా నడింపల్లి సుందరమ్మ ‘ ఆంధ్ర సోదరి సమాజం ‘, 1922 లో యామినీ పూర్ణ తిలకం సికింద్రాబాద్లో ‘ యువతీ శరణాలయాన్ని ‘ స్థాపించింది. ఇవి కేవలం పఠనాలయాలుగానే కాకుండా పాఠశాలలు, వయోజన విద్య ప్రచార కేంద్రాలుగా ఉండేవి. స్త్రీ అభ్యున్నతిలో వీటి పాత్ర ముఖ్యమైంది.అఖిలభారత మహిళా కాన్ఫరెన్స్ 1916 లోనూ, ఆంధ్రమహిళా సభ 1930 లోనూ స్థాపించబడ్డాయి. ఇవి సంస్కరణవాదులవే అయినప్పటికి, స్త్రీలకు ఒక వేదికను కల్పించగలిగాయి. ఫ్యూడల్ సంస్కృతివల్ల ముస్లిం స్త్రీలే కాకుండా మధ్య తరగతి, ధనికవర్గానికి చెందిన హిందూ స్త్రీలు, పరదాలేకుండా బైటికి రాలేకపోయే వాళ్ళు, బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడటమనేది ఊహకందని విషయంగా ఉండేది

S15.Ans(a)

Sol.చివరి గోల్కొండ సుల్తాను అబుల్షాసన్ తానీషా కాలంలో మొత్తం గోల్కొండ సామ్రాజ్యం 37 సర్కార్లుగా, 517 పరగణలుగా విభజించబడింది. నాటి రేవు పట్టణాదిపతి ‘ షాబందర్ ‘. వెలంపాటలో ఎక్కువ ధరకు వేలంపాడిన వారికి సుల్తానులు భూమిశిస్తు వసూలు అధికారాన్ని ఇచ్చేవారు. ఈ విషువసూలు హక్కులు పొందిన వారిని “ ముస్తగీర్స్ ” అంటారు.

S16.Ans(c)

Sol.అమోఘ వర్షుడు రాష్ట్రకూట రాజ రచించిన ‘ కవిరాజమార్గం ‘ ‘ రత్నమాలిక ‘ ( నీతి కావ్యం ‘ )

S17.Ans(b)

Sol.రెండో మాధవవర్మ ( క్రీ.శ. 440-495 ) విష్ణుకుండి రాజులందరిలోకీ గొప్పవాడు. ఈయన అనేక యుద్ధాలు ( ఇంచుమించు వందకు పైగా ) చేసి, బహుశా అన్ని యుద్ధాల్లోనూ విజయం సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసర గుట్ట పైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఈయన విజయం సాధించిన ప్రతి చోటా రామలింగేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. అలా, ఈ రోజు వరకు కూడా ఈయన కట్టించిన రామలింగేశ్వర దేవాలయాలు, వేల్పూరు ( గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా ), ఈపూరు, ఇంద్రపాలనగరం, కీసర గుట్టల్లో పూజలు అందుకొంటున్నాయి.

S18.Ans(b)

Sol.మొదటి శాతకర్ణి ( క్రీ.పూ. 180-170 ) శాతవాహన వంశంలో 3 వ వాడైన మొదటి శాతకర్ణి యొక్క అధికార విస్తరణకు రథికులతో ఇతనికి గల వివాహ సంభంధం ఉపయోగపడినది. ఇతని గొప్పతనం, విజయాల గురించి తెలుసుకోవడానికి ఇతని భార్య నాగానిక వేయించిన నానాఘట్ శాసనం ప్రధాన ఆధారం. ఇతడు పశ్చిమ మాళ్వా, అనూప లేదా నర్మదా లోయ, దక్షిణ విదర్భ మొదలగు ప్రాంతాలను జయించినట్లు, ఇతనికి శూర, అప్రతహతిచక్ర, దక్షిణాపథపతి అను బిరుదులు ఉన్నట్లు ఈ శాసనం ద్వారానే తెలుస్తున్నది.

S19.Ans(c)

Sol.మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాస్తుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, మొఘల్ – ఇండో వాస్తు నిర్మాణ శైలిలో, హైకోర్టు భవనం ఇండో – సారసానిక్ శైలిలో, అసెంబ్లీ భవనం సారసానిక్ రాజస్థానీ శైలిలో నిర్మించబడింది. మిగతా భవనాలైన సిటీ కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, యునాని ఆసుపత్రి, అసఫియా గ్రంథాలయం, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, టౌన్ హాల్, ఇడన్ బాగ్, జూబిలీ హాల్, మొదలైన నిర్మాణాలు హిందూ – ముస్లీం పాశ్చత్య శైలిలో నిర్మించబడ్డాయి

s20.Ans(d)

Sol.హరిపుర కాంగ్రెస్ సమావేశాలకు వెళ్లి వచ్చిన యువకులు చర్చోపచర్చల అనంతరం ఒక రాజకీయ సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అని పేరుపెట్టారు. మొత్తానికి 1938 జనవరి 29 న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఈ మొత్తం కార్యక్రమంలో రామానంద తీర్థ కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు మతతత్వ చర్యగా నిజాం రాజు ప్రకటించారు. అదీకాకుండా, హైదరాబాద్ రాజ్యం వెలుపల ఉన్న భారత జాతీయ కాంగ్రెస్లో ఇది భాగమని తెలిపారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సభ్యుల్లో ఎక్కువ మంది హిందువులే ఉండటం వల్ల, రాజకీయ హక్కులు కోరుతున్న వారిలో అత్యధికులు హిందువులే కావడం వల్ల హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసు మతతత్వ సంస్థగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఇలాపలు కారణాలతో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నిషేధిస్తున్నట్లు సెప్టెంబర్ 7, 1938 న నిజాం ప్రభుత్వం ప్రకటించింది.

Last Minute Revision – Telangana Economy

TEST PRIME - Including All Andhra pradesh Exams

pdpCourseImg

Sharing is caring!

Last Minute Revision Quiz For TSPSC Group 2 Exam : Top 20 MCQs on Telangana History_6.1