Telugu govt jobs   »   Last Minute Revision For TSPSC Group...

Last Minute Revision For TSPSC Group 2 Exam : Top 25 MCQs on Telangana Movement

TSPSC గ్రూప్ 2 పరీక్ష కోసం చివరి నిమిషంలో రివిజన్ క్విజ్: TSPSC గ్రూప్ 2 పరీక్ష డిసెంబర్ 15 మరియు 16, 2024 తేదీలలో షెడ్యూల్ చేయబడినందున, సమయం చాలా ముఖ్యమైనది మరియు ప్రతి నిమిషం గణించబడుతుంది. మీ ప్రిపరేషన్‌ను పదును పెట్టడంలో మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో మీకు సహాయపడటానికి, మేము తెలంగాణ ఉద్యమంపై దృష్టి సారించిన టాప్ 25 బహుళ-ఎంపిక ప్రశ్నల (MCQలు) సెట్‌ను మీకు అందిస్తున్నాము. ఈ ప్రశ్నలు తాజా మరియు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలపై మీ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి రూపొందించబడ్డాయి, మీరు మీ తయారీలో ముందుంటారని నిర్ధారిస్తుంది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC గ్రూప్ 2 పరీక్ష కోసం చివరి నిమిషం రివిజన్

Q1. ముల్కీ ఉద్యమం యొక్క ఉధృతిని గమనించిన ప్రభుత్వం సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘంను నియమించింది.

జాబితా – I                  జాబితా – II

  1. కొండా వెంకటరంగారెడ్డి           1. విద్యాశాఖ మంత్రి
  2. డా. మెల్కోటే                            2. పబ్లిక్ వర్క్స్ శాఖమంత్రి
  3. పూల్ చంద్ గాంధీ                    3. ఎక్సైజ్ శాఖామంత్రి
  4. నవాజ్ జంగ్                               4. ఆర్థికమంత్రి

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q2. సాలర్జుంగ్ 1862లో న్యాయశాఖను ఏర్పాటు చేశాడు. మొదటి న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దేలా ను నియమించాడు. నగరాల్లో నూతనంగా మూడు కోర్టులను ఏర్పాటు చేశారు. కింది వాటిలో సరిగ్గా జతకానిది ఏది?

  1. అదాలత్ – ఎ – పాదా షాహి –  1860
  2. సైన్య వివాదాలకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు –  1855
  3. ఇలాకా పేష్కారీ ప్రాంతంలో వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి గోవిందరావ్ నేతృత్వంలో కోర్టును ఏర్పాటు చేశాడు -1853

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3 మాత్రమే

(c) 3 మాత్రమే

(d) 1, 2, 3

Q3. ప్రతిపాదన (A):  ‘నిజాం సబ్జెక్ట్ లీగ్’ 1939లో రద్దయింది.

కారణము (R) : కొందరు ప్రముఖ ముస్లిం సోదరులు ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంత ప్రభావంతో ఈ లీగ్ ను వదిలి ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ సంస్థకు నాయకత్వం వహించారు.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Q4. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయమైన తరువాత ఉద్యమ నిర్వహణకు ఒక సంస్థను నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది. కొంతమంది పెద్దలు సమావేశమై ఏ సంస్థను ఏర్పరచినారు?

  1. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్
  2. తెలంగాణ రాష్ట్ర సాధన సమితి
  3. తెలంగాణ ప్రాంతీయ కమిటీ
  4. తెలంగాణా అడ్వకేట్ ఫోరం

Q5. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I                                      జాబితా – II

  1. రాష్ట్ర కళాకారుల, రచయితల, మేథావుల ఐక్యవేదిక        1. గూడ అంజయ్య (కన్వీనర్)
  2. తెలంగాణ పాటకవుల ఐక్యవేదిక                                        2. బి.యస్.రాములు (కన్వీనర్)
  3. తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన                         3. సుజాత సూరేపల్లి (కన్వీనర్)
  4. దళిత మహిళా వేదిక                                                          4. యస్.పృథ్వీరాజ్ (అధ్యక్షులు)

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q6. మహిళ సదస్సు కు సంబంధించి కింది ప్రకటనలో సరి కానిది ఏది?

  1. 2016 జనవరి 30న రాష్ట్రస్థాయి మహిళల సదస్సు హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో 2009 డిశంబర్ 9 నాటి కేంద్రహోంమంత్రి చిదంబరం ప్రకటనను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు
  2. తన భావ జాలానికు దగ్గరగా ఉన్న ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’ లో మహిళా జె.ఎ.సి భాగస్వామ్య సంస్థగా చేరింది.
  3. శ్రీకృష్ణ కమీషన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ‘శ్రీకృష్ణ గో బ్యాక్’ అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించింది.
  4. తెలంగాణ నుండి కేంద్ర పారామిలిటరీ బలగాలను వెనక్కు పంపాలని మహిళా జె.ఎ.సి (TWJAC) హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సభ నిర్వహించింది.

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Q7. ‘ది జుడిషియరీ ఐ సర్వ్ డ్’ అనే తన ఆత్మకథలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతమంతటా వ్యాపించాయని పేర్కొన్నది ఎవరు?.

  1. పింగళి జగన్మోహనరెడ్డి
  2. బూర్గుల రామకృష్ణారావు
  3. ఎస్. కె, థార్
  4. సయ్యద్ ఫజల్ అలీ

Q8. ప్రతిపాదన (A):  ఆంధ్రమాతను తెలుగుమాతగా మార్చి తెలంగాణ వారి మాతగా చేశారు.

కారణము (R) : తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించలేదు.

సమాధానం :

(a) (A) మరియు (R) నిజం (R), (A) కు సరియైన వివరణ

(b) (A) మరియు (R) రెండూ నిజం కాని (R), (A) కు సరియైన వివరణ కాదు.

(c) (A) నిజం (R) తప్పు

(d) (A) తప్పు కాని (R) నిజం

Q9. మలిదశ తెలంగాణ ఉద్యమం లో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు ఎవరు?

  1. జె. సి. దివాకర్ రెడ్డి
  2. టి. జి. వెంకటేష్
  3. a మరియు b
  4. పై వేవీ కావు

Q10. ‘ ప్రజల మనిషి’ నవల రచయిత ఎవరు?

  1. పుచ్చలపల్లి సుందరయ్య
  2. దొడ్డ నర్సయ్య
  3. వట్టికోట ఆళ్వారుస్వామి
  4. పైన పెర్కునవేవి కావు

Q11. ‘బండేనక బండి గట్టి 16 బండ్లు గట్టి.. నైజాం సర్కరోడ’ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు?

  1. గద్దర్
  2. బండి యాదగిరి
  3. దాశరథి రంగాచార్యులు
  4. దేవులపల్లి వెంకటేశ్వరరావు

Q12. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై తాడో, పేడో తేల్చుకోవటానికి ఉద్యోగ, ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడానికి ఉద్యోగ సంఘాలన్ని కలిసి ఏర్పాటు చేసిన కమిటి ఏది?

  1. చలో అసెంబ్లీ
  2. జాయింట్ యాక్షన్ కమిటీ
  3. విద్యార్ధి జాయింట్ యాక్షన్ కమిటీ
  4. తెలంగాణా ఉద్యోగుల సంఘం

Q13. కింది వాటిని జతపరుచుము.

జాబితా – I                            జాబితా – II

  1. నందిని సిద్ధారెడ్డి              1. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం
  2. మిట్టపల్లి సురేందర్          2. పల్లే కన్నీరు పెడుతుందో
  3. గోరటి వెంకన్న                3. రాతి బొమ్మల్లోనా
  4. అభినయ శ్రీనివాస్           4. నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ

(a) A – 2, B – 1, C – 4, D – 3

(b) A – 4, B – 3, C – 1, D – 2

(c) A – 3, B – 4, C – 1, D – 2

(d) A – 4, B – 3, C – 2, D – 1

Q14. ‘తెలంగాణ జాగృతి’ కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?

  1. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ‘తెలంగాణ జాగృతి’ ఆవిర్భవించింది.
  2. తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం.
  3. పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం.
  4. బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి.
  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 3 మరియు 4 మాత్రమే
  4. పైవన్నీ

Q15. అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు చేసింది ఎవరు?

  1. శ్రీకాంతచారి
  2. జాక్
  3. జార్జి రెడ్డి
  4. బండారు శ్రీనివాస్

Q16. ఓయులోని విద్యార్థి సంఘాలు, సంఘాలకు అతీతమైన విద్యార్థులు తమ సిద్ధాంతాలు, జెండా, ఎజెండాలు పక్కన పెట్టి రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడానికి ఏర్పాటు చేసిన కమిటి ఏది?

  1. చలో అసెంబ్లీ
  2. జాయింట్ యాక్షన్ కమిటీ
  3. విద్యార్ధి జాయింట్ యాక్షన్ కమిటీ
  4. తెలంగాణా ఉద్యోగుల సంఘం

Q17. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి ‘మిషన్ తెలంగాణ’ అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది ఎవరు. తెలంగాణ ఉద్యమంలో ఇతను చేసిన కృషికిగాను తె.రా.స. ప్రభుత్వం ఇతనికి తెలంగాణ ఐటి సెల్ డైరెక్టర్ గా పదవీబాధ్యతలు అప్పగించింది?

  1. కొణతం దిలీప్
  2. పరకాల ప్రభాకర్
  3. సందీప్ కుమార్
  4. రాణా ప్రతాప్

Q18. పార్లమెంటులో తెలంగాణ బిల్లు కు సంబంధించి కింది ప్రకటనలలో సరైంది ఏది?

  1. 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి “సుశీలక్కుమార్ షిండే”, “రాష్ట్ర పునర్విభజన బిల్లును” లోక్సభలో ప్రవేశపెట్టారు.
  2. 2014 ఫిబ్రవరి 14న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్సభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. ఈ పెప్పర్ స్ప్రే వలన తీవ్ర అనారోగ్యమునకు గురైన ఎంపీ – “పొన్నం ప్రభాకర్”.
  3. లోక్సభ ముజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 18 న ఆమోదించారు.
  4. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Q19. తెలంగాణ రక్షణ ఒప్పందంలోని అంశం?

  1. ఆదాయంలోను మిగులును రెండు రాష్ట్రాలకు సమానంగా ఇవ్వడం
  2. ఆదాయంలోను మిగులును తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చెయ్యడం
  3. సబార్డినేట్, సర్వీసుని భర్తీ విషయంలో తెలంగాణ ఒక యూనిట్గా ఉండాలి.

(a) 1 మరియు 3

(b) 2 మరియు 3

(c) 1 మరియు 2

(d) 1, 2, 3

Q20. తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు ఏవి?

  1. కిరీటంలో, వడ్డాణంలో ప్రసిద్ధి చెందిన కోహినూరు,జాకబ్ వజ్రాలుంటాయి (ఈ రెండు వజ్రాలు కూడా తెలంగాణ ప్రాంతంలో లభ్యమైనవే).
  2. పట్టుచీర – పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తు
  3. వెండి మట్టలు – కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నం
  4. చేతిలోకి మొక్కజొన్న తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తు

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Q21.  ఈ క్రింది వానిలో సరియైన వాక్యాలను గుర్తించండి.

  1. తెలంగాణ ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులు ఉండాలి
  2. తెలంగాణ ప్రాంతంలో స్థానిక నియమకాలు పొందాలంటే 12 సం॥లు నివాసం ఉండాలి.
  3. మంత్రిమండలిలో ఆంధ్ర, తెలంగాణ నిష్పత్తి 60:40.
  4. ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ ఆమోదించాలి.

(a) 1, 2 మరియు 3 మాత్రమే

(b) 2, 3 మరియు 4 మాత్రమే

(c) 1, 3 మరియు 4మాత్రమే

(d) 1, 2, 3 & 4

Q22. ఇతర రాష్ట్రాలలో అప్పటివరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)తో గాని, స్వతంత్రంగా గాని ఉన్న రైతాంగ నాయకులు మొదటి ‘అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి’ లో ఏకమై ఎప్పుడు భారతకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు)ని స్థాపించారు?

  1. ఏప్రిల్ 22, 1969
  2. మే 25, 1969
  3. జూన్ 17, 1978
  4. జూన్ 20, 1978

Q23. మహిళా విముక్తి సంఘం పేరుతో సుమారుగా 25 గ్రామాలలో భూస్వాముల ఆగడాలను, కూలీ పెరగాలనీ తెలుపుతూ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చైతన్యం చేయడంలో గణనీయమైన పాత్రపోషించిన మహిళా విముక్తి సంఘం అధ్యక్షురాలు ఎవరు?

  1. చాకలి ఐలవ్వ
  2. సదా లక్ష్మి
  3. రాజవ్వ
  4. పైనవారందరు

Q24. నక్సలైట్లు ప్రజల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్నారని, ఎన్నో దోపిడిలు, హత్యలు చేస్తున్నారని అసెంబ్లీలో ఆరోపణలు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఏ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఈ ఆదేశం అక్టోబర్ 4 నుంచే అమలులోకి వస్తుందని తెలిపాడు?

  1. సిరిసిల్ల
  2. జగిత్యాల
  3. a మరియు b
  4. పైనవేవి కావు

Q25. తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళారూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరకించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థగా  2008 జూన్ లో ఏర్పడింది. దీనిని ఏర్పాటు చేసింది ఎవరు?

  1. కల్వకుంట్ల కవిత
  2. గోరటి వెంకన్న
  3. విమలక్క గూడ అంజయ్య
  4. కల్వకుంట్ల తారక రామారావు

Last Minute Revision – Telangana Schemes and Policies

Solutions:

S1. Ans (c)

Sol: ముల్కీ ఉద్యమం యొక్క ఉధృతిని గమనించిన ప్రభుత్వం సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘంను నియమించింది.

ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు :

  • కొండా వెంకటరంగారెడ్డి – ఎక్సైజ్ శాఖామంత్రి
  • డా. మెల్కోటే – ఆర్థికమంత్రి
  • పూల్ చంద్ గాంధీ – విద్యాశాఖ మంత్రి
  • నవాజ్ జంగ్ – పబ్లిక్ వర్క్స్ శాఖమంత్రి

S2. Ans (a)

Sol: సాలర్జుంగ్ 1862లో న్యాయశాఖను ఏర్పాటు చేశాడు. మొదటి న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దేలా ను నియమించాడు.

న్యాయపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలను న్యాయ శాఖ మంత్రి దివాన్ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి.

నగరాల్లో నూతనంగా మూడు కోర్టులను ఏర్పాటు చేశారు.

  • అదాలత్ – ఎ – పాదా షాహి (1853)
  • సైన్య వివాదాలకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు (1855)
  • ఇలాకా పేష్కారీ ప్రాంతంలో వచ్చే సివిల్ వివాదాలను పరిష్కరించడానికి గోవిందరావ్ నేతృత్వంలో కోర్టును ఏర్పాటు చేశాడు (1860)

S3. Ans (a)

Sol: కొందరు ప్రముఖ ముస్లిం సోదరులు ముస్లిం సార్వభౌమాధికారం అనే సిద్ధాంత ప్రభావంతో ఈ లీగ్ ను వదిలి ‘ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ సంస్థకు నాయకత్వం వహించారు. ఈ సంస్థలో హిందువులు, ముస్లింలు, పారశీలు (అన్ని కులాలు, మతాలు) వారు సభ్యులుగా ఉన్నారు. కావున ఈ లీగ్ మత పాక్షిక సంస్థ అను నేరారోపణ చేయుటకు ప్రభుత్వానికి వీలులేకుండా పోయింది. ఈ లీగ్ ఒత్తిడి తీవ్రం కావడంతో ప్రభుత్వం ఆరవముదు అయ్యంగార్ నేతృత్వంలో ఓ కమిటీనివేసి, పరిస్థితులను సమీక్షించిన అనంతరం 1939లో ముల్కీ నిబంధనల్ని సవరించారు. కొందరు ముస్లిం మేథావులు ముస్లిం సార్వహౌమాధికారం అనే సిద్ధాంత ప్రభావంతో దీనిని వదిలి ‘ఇత్తేహాదుల్ ముస్లీమీన్’ సంస్థలో చేరటంతో ‘నిజాం సబ్జెక్ట్ లీగ్’ 1939లో రద్దయింది

S4. Ans (a)

Sol: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని నిర్ణయమైన తరువాత ఉద్యమ నిర్వహణకు ఒక సంస్థను నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడింది. కొంతమంది పెద్దలు సమావేశమై 18 ఫిబ్రవరి, 1969 నాడు శ్రీ ఎ.మదన్ మోహన్ కన్వీనర్గా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే సంస్థను ఏర్పరచినారు. సంస్థ 26 ఫిబ్రవరి నాడు ప్రథమ పత్రికా సమావేశాన్ని జరిపి తన కార్యాచరణను ప్రకటించింది. 3 మార్చి, 1969 నాడు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను జరపాలని నిర్ణయించింది.

S5. Ans(a)

Sol:

  • రాష్ట్ర కళాకారుల, రచయితల, మేథావుల ఐక్యవేదిక : బి.యస్.రాములు (కన్వీనర్)
  • బి.సి. సంఘర్షణ సమితి – వి.జి.ఆర్.నారగోని (అధ్యక్షులు)
  • తెలంగాణ పాటకవుల ఐక్యవేదిక – గూడ అంజయ్య (కన్వీనర్)
  • తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన – యస్.పృథ్వీరాజ్ (అధ్యక్షులు)
  • దళిత మహిళా వేదిక: సుజాత సూరేపల్లి (కన్వీనర్), శ్రీమతి మేరికుమారి మాదిగ (కో-కన్వీనర్)

S6. Ans(b)

Sol: మహిళ సదస్సు:

  • 2010 జనవరి 31న రాష్ట్రస్థాయి మహిళల సదస్సు హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి పెద్దమొత్తంలో మహిళలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2009 డిశంబర్ 9 నాటి కేంద్రహోంమంత్రి చిదంబరం ప్రకటనను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ శ్రేణులన్నింటితో కలిసి ఐక్యంగా పోరాడుతామనే ప్రతిపాదనను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో TWIAC అప్పటికే ఏర్పడ్డ TJAC లో భాగస్వామ్య సంఘంగా చేరింది.
  • కాని శ్రీకృష్ణ కమీషన్ను స్వాగతించడం మరియు ఇతర మనస్పర్ధల వలన TJAC నుండి TWJAC బయటకు వచ్చింది. శ్రీకృష్ణ కమీషన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ‘శ్రీకృష్ణ గో బ్యాక్’ అంటూ నిరసన ప్రదర్శన నిర్వహించింది
  • తర్వాతి కాలంలో తన భావ జాలానికు దగ్గరగా ఉన్న ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’ లో మహిళా జె.ఎ.సి భాగస్వామ్య సంస్థగా చేరింది.
  • తెలంగాణ నుండి కేంద్ర పారామిలిటరీ బలగాలను వెనక్కు పంపాలని మహిళా జె.ఎ.సి (TWJAC) హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి సభ నిర్వహించింది.

S7. Ans(a)

Sol: పోలీసుల కాల్పులపై విచారణ జరిపేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి ‘పింగళి జగన్మోహనరెడ్డి’ ఆధ్వర్యంలోన్యాయ విచారణ సంఘాన్ని నియమించింది.

  • జస్టిస్ పింగళి జగన్మోహనరెడ్డి యొక్క ఆత్మకథ – ‘ది జుడిషియరీ ఐ సర్వ్ డ్‘.
  • ‘ది జుడిషియరీ ఐ సర్వ్ డ్’ అనే తన ఆత్మకథలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతమంతటా వ్యాపించాయని పేర్కొన్నాడు.

S8. Ans(c)

Sol: తెలుగువారి మధ్య భావసమైక్యతను సాధించి తెలంగాణ ఉద్యమాన్ని మరుగున పడేయడానికి కంకణం కట్టుకున్న వెంగళరావు 1975 ఏప్రిల్ లో ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాదులో నిర్వహించాడు. ఈ తెలుగు మహాసభలకు చార్ మినార్ నుండి లాల్ బహదూర్ దాకా ముఖ్యమంత్రి పెద్ద ఊరేగింపుగా వెళ్ళి తెలుగు మహాసభలకు ప్రాచుర్యం కల్పించాడు. ఈ తెలుగు మహాసభల కోసమే శంకరంబాడి సుందరాచారి అనే ఆంధ్ర కవి “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనే గేయాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. ఈ పాటలో కేవలం రుద్రమదేవి మినహా మరే ఇతర అంశము తెలంగాణకు సంబంధించినది లేదు. వెంగళరావు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ తెలుగు మహాసభల సందర్భంగా సన్మానించబడిన కవులలో కేవలం ఇద్దరు కవులు (కాళోజీ, పెంబర్తి) మాత్రమే తెలంగాణావారు ఉన్నారు. ఈ విధంగా ఒక క్రమపద్ధతిలో ఆంధ్రమాతను తెలుగుమాతగా మార్చి తెలంగాణ వారి మాతగా కూడా చేశారు.

S9. Ans.(c)

Sol: మలిదశ తెలంగాణ ఉద్యమం లో రాయల తెలంగాణ అనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన నాయకులు – జె. సి. దివాకర్ రెడ్డి, టి. జి. వెంకటేష్.

S10. Ans.(c)

Sol: రైతులు, కౌలుదార్ల కష్టాన్ని కబళించిన విధానం, వెట్టి చాకిరీ దయనీయ స్థితి పై వట్టికోట ఆళ్వారుస్వామి ‘ ప్రజల మనిషి’ నవలలో వివరంగా ఉంది. ఇది తెలగాణ లోని తొలి నవలగా ప్రసిద్ధి చెందింది.

S11. Ans (b)

Sol: ‘బండేనక బండి గట్టి 16 బండ్లు గట్టి.. నైజాం సర్కరోడ’ అనే ప్రసిద్ధ గేయాన్ని రాసిన వారు- బండి యాదగిరి.

S12. Ans (b)

Sol: హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై తాడో, పేడో తేల్చుకోవటానికి ఉద్యోగ, ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడానికి ఉద్యోగ సంఘాలన్ని జాయింట్ యాక్షన్ కమిటీ (జె.ఎ.సి)గా ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాలకు బాసటగా తెరాస నిలిచింది. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు 2009 అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పిలుపునిచ్చాయి. తెలంగాణ నలువైపుల నుంచి ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఉద్యోగ గర్జనకు హాజరై విజయవంతం చేశారు.

S13. Ans (d)

Sol:

  • నాగేటి సాల్లళ్ళ నా తెలంగాణ – నందిని సిద్ధారెడ్డి
  • పల్లే కన్నీరు పెడుతుందో, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, – గోరటి వెంకన్న
  • రాతి బొమ్మల్లోనా – మిట్టపల్లి సురేందర్
  • ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం – అభినయ శ్రీనివాస్

S14. Ans (d)

Sol:’తెలంగాణ జాగృతి’ :

  • తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా ‘తెలంగాణ జాగృతి’ ఆవిర్భవించింది.
  • తెలంగాణ ప్రాచీన గ్రంథాల సేకరణ, శాసనాలను తెలుగులోకి అనువదించి భద్రపరచ్చడం.
  • పురాతన రాతప్రతుల్ని సేకరించి భావి తరాలకు అమూల్య సంపదను అందించడం.
  • బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలంగాణ జాగృతి

S15. Ans (a)

Sol: తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దహనకాండకు నిరసన హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ చౌరస్తాలో అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల సాక్షిగా నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంత చారీ తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. శ్రీకాంతచారి అగ్నికి ఆహు అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ మరో జన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తాను అంటూ నినాదాలు ఇచ్చాడు.

S16. Ans (c)

Sol: ఓయులోని విద్యార్థి సంఘాలు, సంఘాలకు అతీతమైన విద్యార్థులు తమ సిద్ధాంతాలు, జెండా, ఎజెండాలు పక్కన పెట్టి విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటి (ఓయుజాక్)గా 2009 నవంబర్ 30న ఆర్ట్స్ కాలేజి వేదికగా ఆవిర్భవించింది. నాటి నుంచి ఆర్ట్స్ కాలేజీ ఉద్యమ కేంద్రంగా మారింది. ఇకపై రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థి జాయింట్ యాక్షన్ (జెఏసి) కమిటి ప్రకటించింది

S17. Ans(a)

Sol:

  • తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచడానికి కొణతం దిలీప్ ‘మిషన్ తెలంగాణ’ అనే వెబ్ సైట్ ను ప్రారంభించారు.
  • పరకాల ప్రభాకర్ రాసినటువంటి ‘తెలంగాణ నూటా ఒక్కటి అబద్ధాలు’ అనే పుస్తకానికి ధీటుగా 101 వివరణలతో ‘ఏ రిబట్టల్ టూ విశాలాంధ్ర గ్లోబెల్స్ ప్రాపగండ’ అనే పుస్తకమును TDF సహకారంతో ముద్రించారు.
  • ఈయన ఒక అమెరికా ఎకనామిక్ హిట్ మ్యాన్ రాసిన పుస్తకాన్ని తెలుగులోకి ‘దళారి పశ్చాత్తాపం’ పేరుతో అనువదించి ప్రపంచీకరణ ముసుగులో అమెరికా చేస్తున్న అకృత్యాలను తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇతను చేసిన కృషికిగాను తె.రా.స. ప్రభుత్వం ఇతనికి తెలంగాణ ఐటి సెల్ డైరెక్టర్ గా పదవీబాధ్యతలు అప్పగించింది.

S18. Ans(d)

Sol: పార్లమెంటులో తెలంగాణ బిల్లు:

  • 2014 ఫిబ్రవరి 13న హోంమంత్రి “సుశీలక్కుమార్ షిండే”, “రాష్ట్ర పునర్విభజన బిల్లును” లోక్సభలో ప్రవేశపెట్టారు.
  • బిల్లు ప్రవేశపెడుతున్నట్లు షిండే ప్రకటిస్తున్న సమయంలో ఆంధ్ర ఎంపీలు గొడవ చేశారు. ఈలోపు స్పీకర్ మీరాకుమార్ సభలో బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.
  • 2014 ఫిబ్రవరి 14న ఎంపీ లగడపాటి రాజగోపాల్ లోక్సభలో పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడు. ఈ పెప్పర్ స్ప్రే వలన తీవ్ర అనారోగ్యమునకు గురైన ఎంపీ – “పొన్నం ప్రభాకర్”.
  • 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైంది. బిల్లుపై హోంమంత్రి షిండే మాట్లాడారు.
  • లోక్సభ ముజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి18న ఆమోదించారు.
  • లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బిజెపి పార్టీ ఫ్లోర్ లీడర్ సుష్మా స్వరాజ్ పరిపూర్ణ మద్దతు ఇవ్వడంతో తెలంగాణ బిల్లు సునాయాసంగా ఆమోదం పొందింది.
  • 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో హోంమంత్రి షిండే బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో బిజెపి ఫ్లోర్ లీడర్ అరుణ్ జైట్లీ తెలంగాణకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
  • “ది బిల్ ఈజ్ పాడ్” అని డిప్యూటీ చైర్మన్ కురియన్ ప్రకటించడంతో తెలంగాణవాదుల హర్షాతిరేకాలు చేశారు.

S19. Ans(b)

Sol: తెలంగాణ రక్షణ ఒప్పందంలోని అంశం:

  • ఆదాయంలోను మిగులును తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చెయ్యడం
  • సబార్డినేట్, సర్వీసుని భర్తీ విషయంలో తెలంగాణ ఒక యూనిట్గా ఉండాలి

S20. Ans(d)

Sol: తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు

  • కిరీటంలో, వడ్డాణంలో ప్రసిద్ధి చెందిన కోహినూరు,జాకబ్ వజ్రాలుంటాయి (ఈ రెండు వజ్రాలు కూడా తెలంగాణ ప్రాంతంలో లభ్యమైనవే).
  • పట్టుచీర – పోచంపల్లి, గద్వాల చీరలకు గుర్తు.
  • కాలి మెట్టెలు – ముత్తైదువకు చిహ్నం.
  • వెండి మట్టలు – కరీంనగర్ ఫిలిగ్రీ ఆభరణాలకు చిహ్నం.
  • చేతిలోకి మొక్కజొన్న తెలంగాణ మెట్ట ప్రాంతాలకు గుర్తు.

S21. Ans(d)

Sol:

  • తెలంగాణ ప్రాంతీయ సంఘంలో 20 మంది సభ్యులు ఉండాలి
  • తెలంగాణ ప్రాంతంలో స్థానిక నియమకాలు పొందాలంటే 12 సం॥లు నివాసం ఉండాలి.
  • మంత్రిమండలిలో ఆంధ్ర, తెలంగాణ నిష్పత్తి 60:40.
  • ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ ఆమోదించాలి

S22. Ans (a)

Sol: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, బీహార్లోని ముషాహరి, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ – భేరి, బెంగాల్లోని బీర్భం, కేరళలోని వైనాడు, పంజాబ్లోని ఫిరోజ్ పూర్ వంటి ఎన్నో చోట్ల రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల రైతాంగ పోరాట నాయకులు నక్సల్బరీ పంథాను అంగీకరించి, నక్సల్బరీ పోరాట నాయకులతో సంబంధం పెట్టుకున్నారు. ఆయా రాష్ట్రాలలో అప్పటివరకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)తో గాని, స్వతంత్రంగా గాని ఉన్న రైతాంగ నాయకులు మొదటి ‘అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి’ లో ఏకమై చివరికి ఏప్రిల్ 22, 1969న భారతకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు)ని స్థాపించారు

S23. Ans (c)

Sol: మహిళా విముక్తి సంఘం పేరుతో సుమారుగా 25 గ్రామాలలో భూస్వాముల ఆగడాలను, కూలీ పెరగాలనీ తెలుపుతూ ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని చైతన్యం చేయడంలో గణనీయమైన పాత్రపోషించిన మహిళా విముక్తి సంఘం అధ్యక్షురాలు రాజవ్వ.

S24. Ans (c)

Sol:  నక్సలైట్లు ప్రజల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్నారని, ఎన్నో దోపిడిలు, హత్యలు చేస్తున్నారని అసెంబ్లీలో ఆరోపణలు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అక్టోబర్ 20, 1978న సిరిసిల్ల, జగిత్యాల తాలుకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఈ ఆదేశ అక్టోబర్ 4 నుంచే అమలులోకి వస్తుందని తెలిపాడు.

S25. Ans (a)

Sol:

  • తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి, కళారూపాల, జానపదులు, సాహిత్యం, తెలంగాణ ప్రాంతం మాండలికం మొదలైనవి పరిరకించడానికి తెలంగాణ జాగృతి సాంఘిక-సాంస్కృతిక సంస్థగా 2008 జూన్ లో ఏర్పడింది.
  • దీనిని కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసింది.
  • పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించడానికి తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది.
  • తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి, వాటికి విశిష్ఠ ముగింపుగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై లక్షలాది మంది ప్రజలతో బతుకమ్మ పండుగ జరిగి సాంస్కృతిక కవాతు నిర్వహిస్తుంది.

Last Minute Revision –  Telangana History

Last Minute Revision – Telangana Economy

TEST PRIME - Including All Andhra pradesh Exams

pdpCourseImg

Sharing is caring!

Last Minute Revision For TSPSC Group 2 Exam : Top 25 MCQs on Telangana Movement_6.1