తెలంగాణాలో త్వరలో విడుదల కానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు | New Job Notifications in Telangana : తెలంగాణా రాష్ట్రంలో త్వరలో 50000 ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్లు విడుదల చేయడానికి రంగం సిద్దంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. రాష్ట్రపతి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల వివరాలను వివిధ ప్రభుత్వ విభాగాల నుండి సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఖాళీలన్నికి సంబంధించి నోటిఫికేషన్లను నవంబర్ నెలకు ముందే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. Adda247 తెలుగు New Job Notifications in Telangana కు సంబంధించిన సమాచారాన్ని మీకు ఇక్కడ అందించడం జరిగింది.
New Job Notifications in Telangana | Highlights(ప్రధాన అంశాలు)
స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల వారీగా, మంజూరైన పోస్టులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో వివిధ శాఖల నుండి ప్రభుత్వం సమాచారం సేకరణ పూర్తి చేసింది.
- రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల అమలుకు సర్వం సిద్ధం చేసిన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం.
- వివిధ స్థాయి ఉద్యోగ కేడర్లను ఆధారంగా చేసుకొని వివరాల సేకరణ జరిగింది.
- ఈ ఖాళీల సమగ్ర సమాచారం పై ప్రభుత్వ స్థాయిలో మూడు రోజుల పాటు సమావేశం జరగనున్నది.
- త్వరలో భర్తీలపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్న ముఖ్యమంత్రి.
Read More : తెలంగాణా చరిత్ర PDF
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమతమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65 వేలకు పైగా ఖాళీలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
New Job Notifications in Telangana | 50000+ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానుంది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శాఖల వారీగా ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదికను సిద్ధం చేయనుంది.
Read more: TS SI exam Pattern
రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించనుంది. ఈనెల 9తో అన్ని శాఖల్లోని కేడర్ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం రానుంది. దానికితోడు రిక్రూట్మెంట్ ఇతరత్రా సర్వీసు నిబంధనలు తదితర అంశాలన్నింటిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు.
New Job Notifications in Telangana | అభ్యర్ధులకు ముఖ్య సూచన
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా నోటిఫికేషలను విడుదల చేయడం ఖాయం. కాని నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా మీ సాధనలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నమే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులను చేస్తుంది తప్ప, అనుకున్న సమయానికి వచ్చే నోటిఫికేషన్ అయితే ఏ మాత్రం కాదు. కాబట్టి సమయంతో సంబంధం లేకుండా మీ సాధన మీద దృష్టి పెట్టండి. ఇప్పటికీ సాధన మొదలుపెట్టకపోతే ఇకమీధనైనా మొదలు పెట్టండి. మన విజయం మన చేస్తుల్లోనే ఉంటుంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Also Download:
New Job Notifications in Telangana : FAQs
Ans.
Name of the Post | Salary |
---|---|
Deputy Collector | Rs 20,680 – Rs 46,980 |
District Registrar | Rs. 18,030 – Rs 43,630 |
Deputy Superintendent of Police | Rs 20,680 – Rs 46,960 |
Divisional Fire Officer | Rs 19,050 – Rs 45,850 |
District Backward Caste Welfare Officer | Rs 19,050 – Rs 45,850 |
Municipal Commissioner | Rs 16,150 – Rs 42,590 |
Commercial Tax Officer | Rs 20,680 – Rs 46,960 |
Assistant Audit Officer | Rs 16,150 – Rs 42,590 |
District Panchayat Raj Officer | Rs 19,050 – Rs 45,850 |
Assistant Treasury Office | Rs 18,030 – Rs 43,630 |
Mandal Parishad Development Officer | Rs 16,150 – Rs 42,590 |