Telugu govt jobs   »   Article   »   వలసలు APPSC & TSPSC గ్రూప్స్ ప్రత్యేకం
Top Performing

వలసలు APPSC & TSPSC గ్రూప్స్ ప్రత్యేకం | Migration APPSC & TSPSC Groups Special

వలస లేదా మైగ్రేషన్ అనేది ఒక ప్రాంతం లేదా దేశం లోని ప్రజలు మరొక చోటకి జీవనం కోసం మారడం. వివిధ కారణాల వల్ల వలసలు జరుగుతాయి అందులో ప్రధానంగా సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాలు. వలసలు దేశం లో ఒక ప్రాంతం లేదా రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి జరిగితే వాటిని “ఇన్ మైగ్రేషన్” మరియు “అవుట్ మైగ్రేషన్” అని అంటారు అదే దేశం వెలుపల జరిగితే “ఇమ్మిగ్రేషన్” మరియు “ఎమిగ్రేషన్” అని అంటారు. కోవిడ్ 19 వంటి అనూహ్య పరిణామం తర్వాత జాతీయంగా మరియు అంతర్జాతీయంగా వలసల పై అన్నీ సంస్థలు అనుకూలమైన చర్యలకు సిద్దపడ్డాయి.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Group

భారతదేశంలో వలసల ధోరణి

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశం లోపల గత దశాబ్దంలో సుమారు 21 కోట్ల మంది వలస వెళ్లారు. ఈ వలసలు ప్రధానంగా అంతర్గత-రాష్ట్రం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వలసల వాటా దాదాపు 88% మరియు , అంతర్రాష్ట్ర వలసల వాటా 12%. అంతర్రాష్ట్ర వలసలలో మహిళలు, రాష్ట్రం-రాష్ట్రం వాలశాలలో పురుషులు ఎక్కువగా ఉన్నారు.

వలసల రకాలు

భారతదేశంలో అంతర్గత వలసలు ప్రధానంగా రెండు రకాలు:
దీర్ఘకాలిక వలస, లేదా స్వల్పకాలిక వలస. చట్ట విరుద్ధంగా జరిగే వలసలను అక్రమ వలసలు అంటారు, వలసలలో వలస వెళ్ళే ప్రదేశాన్ని బట్టి రకాలు ఉంటాయి అవి:

  • ఒక దేశం నుండి మరొక దేశానికి వలస వెళ్ళడాన్ని అంతర్జాతీయ వలస (International Migration) అంటారు. అదే ఒక దేశంలో ఒక రాష్ట్రంలో లేదా వివిధ ప్రాంతాలకి వలస వెళ్తే దానిని (Internal Migration) అంటారు.
  • చదువుకున్న మేధావులు ఉపాధి, అభివృద్ది కోసం వేరే దేశాలకు వెళ్లాడాన్ని మేధావుల వలస లేదా Brain Drain అంటారు. వీటి వలన ఒక దేశంలో ఉండే మానవ వనరులు కోల్పోతుంది.
  • ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి జరిగే వలసను అంతర్రాష్ట్ర వలస (Interstate Migration). మరియు  ఒకే రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంనకు జరిగే వలసలను అంతః రాష్ట్ర వలస అంటారు.
  • ఒక ప్రాంతం నుంచి వలస వచ్చిన వారిని In Migration ఇన్ మైగ్రేషన్ అని ఒక ప్రాంతం వలస వెళ్ళిన వారిని Out Migration అవుట్ మైగ్రేషన్ అని అంటారు.
  • ప్రజలు స్వచ్చందంగా వలస వెళ్లాడాన్ని (స్వచ్ఛంద వలస) అని బలవంతంగా వలస వెళ్ళితే (అసంకల్పిత వలస) అని అంటారు.
  • ఒక కాలం లో మాత్రమే ఒక ప్రాంతం నుంచి స్వల్ప కాలం వలస వెళ్లాడాన్ని ఋతుపరమయిన Seasonal Migration వలసలు అంటారు.
  •  గ్రామాల నుండి పట్టణాలకు జరిగే వాలశాలను హారస్ & టొరడో వలసలు అంటారు అదే పట్టణాల నుంచి పల్లెటూరుకి వలస వెళ్లాడాన్ని రివర్స్ మైగ్రేషన్ అంటారు. చిన్న పట్టణాల నుంచి పెద్ద పట్టణాలకి జరిగే వలసలను స్టెప్ మైగ్రేషన్ అంటారు.

భారతదేశంలో వలస తీవ్రత మరియు చట్టాలు

భారత రాజ్యాంగం (ఆర్టికల్ 19) ద్వారా పౌరులందరికీ “భారత భూభాగం అంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది మరియు భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడే హక్కును కల్పించింది.

భారతదేశంలోని 2011 గణాంకాల ప్రకారం వలసదారులు 30.7 మిలియన్ల మంది ఉన్నారు అంతర్గత వలసదారులు జనాభాలో 30 శాతం ఉన్నారు. వలసలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్. మరియు వలసలు చేరే రాష్ట్రాలు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, పంజాబ్ మరియు కర్ణాటక. 2011 జనాభా లెక్కల ప్రకారం 5.4 కోట్ల మంది అంతర్ రాష్ట్ర వలసదారులు ఉన్నారు. మొత్తం అంతర్గత వలసదారులలో, 70.7 శాతం మహిళలు (2001 జనాభా లెక్కల ప్రకారం) మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో స్త్రీల వలసలకు వివాహాలు ప్రధాన కారణాలలో ఒకటి.

భారతదేశంలో వలసల నివేదిక 2020-21:
జూన్ 2022లో గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. జూలై 2020-జూన్ 2021 కాలంలో దేశ జనాభాలో 0.7% మంది ‘తాత్కాలిక వాలసదారులు’గా నమోదయ్యారు.
తాత్కాలిక వాలసదారులు మార్చి 2020 తర్వాత ఇంటికివచ్చి 15 రోజులనుంచి 6 నెలలు ఇంటిలో ఉండేవారిని పరిగణిస్తారు. 0.7% మంది తాత్కాలిక వాలసదారులు 84% మంది మహమ్మారి కారణంగా వారు ప్రాంతాన్ని మారారు. జూలై 2020-జూన్ 2021కి జాతీయ వలస రేటు 28.9%, గ్రామీణ ప్రాంతాల్లో 26.5 % మరియు పట్టణ ప్రాంతాల్లో 34.9% ఉంది. ప్రధానంగా స్త్రీలు 47.9% అధిక వాటాతో ఉన్నారు; గ్రామీణ ప్రాంతాల్లో 48%, పట్టణ ప్రాంతాల్లో 47.8% ఉంది.
పురుషుల వలస రేటు 10.7%, గ్రామీణ ప్రాంతాల్లో 5.9% మరియు పట్టణ ప్రాంతాల్లో 22.5%గా ఉంది. 86.8% స్త్రీలు వివాహం కోసం వలస వెళ్ళగా, 49.6% మంది పురుషులు ఉపాధి వెతుక్కుంటూ వలస వెళ్లారు.

వలస కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ క్రింది చట్టాలు అమలులో ఉన్నాయి అవి:

  • అంతర రాష్ట్ర వలస కార్మికుల చట్టం – 1979
  • వెట్టిచాకిరి నిషేధ చట్టం 1976
  • కనీస వేతనాల చట్టం – 1974
  • బాల కార్మిక నిషేద చట్టం 1986

వలస సూత్రాలు

రావెన్స్టీన్ వలస సూత్రం: 

  • సామాజిక & ఆర్థిక అంతరాల వల్ల గ్రామాల నుండి పట్టణాలకు వలసలు జరుగుతున్నాయి.
  • వలసలు దశల వారీగా జరుగుతాయి, వయోజనులు అధికంగా వలస వెళతారు

బోగ్తో వలసల సిద్ధాంతం

బోగ్తో వలస సిద్దాంతం ప్రకారం వలస పుష్ (నెట్టబడే కారకాలు) మరియు పుల్ల్ ఫ్యాక్టర్స్ (ఆకర్షించే కారకాలు) మీద ఆధార పడి ఉంటాయి.

పుష్ ఫ్యాక్టర్స్ (నెట్టబడే కారకాలు)

  • పేదరికం
  • నిరుద్యోగం
  • వ్యవసాయ వైఫల్యం
  • కరువు
  • అల్ప ఉత్పాదకత
  • ఉపాధి దెబ్బతినడం
  • ప్రకృతి వైపరీత్యాలు
  • కుల సంఘర్షణలు

ఆకర్షించే కారకాలు

  • పట్టణీకరణ
  • అవకాశాలు
  • సదుపాయాలు
  • ఉద్యోగా అవకాశాలు
  • పరిశ్రమల స్థాపన
  • అధిక వేతనాలు
  • సౌకర్యాలు

భారతదేశంలో వలసవాదంAPPSC group 2 Prelims Free Live Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

వలసలు APPSC & TSPSC గ్రూప్స్ ప్రత్యేకం_5.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. My focus includes State PSCs, Banking, Insurance, SSC, and other exams. Having appeared for exams like APPSC Groups, IBPS, SBI, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.