Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Shipping Festival in Visakhapatnam.

Milan Naval Exercise 2022 in Visakhapatnam(విశాఖపట్నంలో 2022 మిలాన్ నౌకా విన్యాసాలు)

Milan Naval Exercise-2022 in Visakhapatnam (విశాఖపట్నంలో 2022 మిలాన్ నౌకా విన్యాసాలు): 

అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్‌–2022లో కీలకమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను బీచ్‌ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు . నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్‌ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ ఆదివారం జరిగింది . వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాయి.ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు.

ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ విన్యాసాలు:

ఇక భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు, మెరైన్‌ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్‌ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి.

ఘనంగా మిలాన్‌–2022 ప్రారంభం:

నౌకా యానంలో భారత్‌కు ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, పశ్చిమ తీరం ద్వారా 80 దేశాలతో వర్తకం సాగిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ అన్నారు. ఆయన శనివారం విశాఖలో మిలాన్‌–2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో భారత్‌తో పాటు నాలుగు దేశాలతో మొదలైన మిలాన్‌ ఇప్పుడు 39 దేశాలకు విస్తరించటం అభినందనీయమన్నారు. మిలాన్‌ ద్వారా మారిటైం రంగంలో అక్రమ ఆయుధ రవాణా, టెర్రరిజం, సముద్ర దొంగలు, స్మగర్లకు అడ్డుకట్ట వేయటంపై చర్చించుకునేందుకు వేదిక కానుందన్నారు.

Also Read: Latest-sports-news 

 

Shipping Festival in Visakhapatnam

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Shipping Festival in Visakhapatnam

Sharing is caring!