Telugu govt jobs   »   Article   »   Kavitha to deliver keynote lecture at...

MLC Kavitha to deliver keynote lecture on Telangana Government’s Achievements at Oxford | ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలపై కవిత కీలకోపన్యాసం

Kavitha to deliver keynote lecture on Telangana Government’s Achievements at Oxford on 30 Oct 2023 | 30న ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ఉపన్యాసం

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం భారతదేశంలో రాష్ట్రం వేగవంతమైన పురోగతిని గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 30న తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై కీలక ఉపన్యాసం ఇవ్వడానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు ఆహ్వానం అందింది.  డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ప్రోగ్రామ్‌లో ఈ ఉపన్యాసం ఉంటుంది.

గత పదేళ్లలో తెలంగాణలో మారిన స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ నెల 30న లండన్లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో భారాస ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. డెవలప్మెంట్-ఎకనామిక్స్ ఇతివృత్తంలో భాగంగా తెలంగాణ మోడల్ పై ప్రసంగించాల్సిందిగా కవితకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం పంపింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ పురోగమించిన తీరు, రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, విద్యా రంగాల్లో పురోగతి తదితర అంశాలపై కవిత ప్రసంగిస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం పొందేలా కుల వృత్తులను ప్రోత్సహించడం, అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

EMRS Hostel Warden Administrative Aptitude & POCSO Act Material eBook for EMRS Hostel Warden Exams By Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!