26 వేల కోట్ల రూపాయలతో విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ:
విశాఖపట్నంలోని రిఫైనరీని రూ.26,264 కోట్లతో ఆధునికీకరణ, విస్తరణ చేయాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయితే రిఫైనరీ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుతుందన్నారు.
- కేంద్ర రక్షణశాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ సంస్థలున్నట్లు రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, జీవీఎల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
- మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, విశాఖపట్నంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లు పనిచేస్తున్నాయన్నారు.
- ఇప్పటివరకు బీఈఎల్ రూ.190.20 కోట్లు, బీడీఎల్ రూ.95.40 కోట్లు, హెచ్‌ఎస్‌ఎల్ రూ.211.88 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.
- బీఈఎల్ సంస్థ కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మలూరులో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking