Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Nellore tops the list of new...

కొత్త జిల్లాల జనాభాలో నెల్లూరు, విస్తీర్ణంలో ప్రకాశంలదే అగ్రస్థానం,Nellore tops the list of new districts in terms of population and Prakasham is the largest in terms of Area

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల లెక్క తేలింది. 72 రెవెన్యూ డివిజన్లతో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు తొలి స్థానంలో, ప్రకాశం జిల్లా రెండో స్థానంలో నిలిచాయి. రెండు జిల్లాల్లోనూ 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 38 మండలాల చొప్పున ఉన్నాయి.

నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు జనాభా పరంగా ముందున్నాయి. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో (2011 లెక్కలు) ఈ 5 జిల్లాల వాటాయే 23%పైగా ఉండటం గమనార్హం.

విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ప్రకాశం నిలిచింది. 14,322 చ.కి.మీ.విస్తీర్ణంలో ఇది ఉంది. తర్వాత స్థానంలో అల్లూరి సీతారామరాజు 12,251 చ.కి.మీ., కడప జిల్లా 11,228 చ.కి.మీ.చొప్పున ఉన్నాయి. రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలే 23.19 శాతం ఆక్రమించాయి.

విస్తీర్ణం, మండలాల పరంగా చూస్తే రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం నిలిచింది. 11 మండలాలతో ఉన్న జిల్లా విస్తీర్ణం 1,048 చ.కి.మీ.మాత్రమే. తర్వాతి స్థానంలో కోనసీమ జిల్లా 2,083, పశ్చిమగోదావరి 2,178, గుంటూరు 2,443, తూర్పుగోదావరి 2,561, కాకినాడ 3,019 చ.కి.మీ. ఉన్నాయి. ఈ 6 జిల్లాల మొత్తం విస్తీర్ణం కలిపినా ప్రకాశం జిల్లా కంటే తక్కువే.

ఎస్‌పీఎస్‌ నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోని మొత్తం మండలాల సంఖ్య 240.. అంటే రాష్ట్రంలోని మొత్తం మండలాల్లో 35.35% మండలాలు ఈ 7 జిల్లాల్లోనే ఉన్నాయి.

****************************************************************************

Nellore tops the list of new districts in terms of population and Prakasham is the largest in terms of Area

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Nellore tops the list of new districts in terms of population and Prakasham is the largest in terms of Area

Sharing is caring!

Nellore tops the list of new districts in terms of population and Prakasham is the largest in terms of Area_5.1