NICL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 274 ఖాళీల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. NICL AO 2024 నోటిఫికేషన్ ద్వారా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంస్థ ఈ పోస్టును వివిధ విభాగాలుగా విభజించింది. NICL AO రిక్రూట్మెంట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జనవరి 2 నుంచి ప్రారంభమై 22 జనవరి 2024 వరకు కొనసాగుతుంది. ఇన్షూరెన్స్ రంగంలో తమ కెరీర్ ను ప్రారంభించాలి అని అనుకున్న వారికి ఇదొక చక్కని అవకాశం. ఇక్కడ, ఖాళీలు, ఎంపిక ప్రక్రియ, వేతనం మొదలైన వాటితో సహా ఎNICL AO రిక్రూట్మెంట్ 2024 కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోండి.
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF విడుదలైంది
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF అధికారిక వెబ్సైట్ www.nationalinsurance.nic.co.inలో స్కేల్ I కేడర్‌లోని 274 ఖాళీల కోసం విడుదల చేయబడింది. నోటిఫికేషన్ PDFలో అన్ని వివరాలు పేర్కొన్నారు. ఈ పోస్ట్ లకి దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు నోటిఫికేషన్ PDFని జాగ్రత్తగా విశ్లేషించాలి. NICL AO నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, జీతం మరియు మరిన్ని వంటి వివరాలను కలిగి ఉంటుంది. NICL AO 2024 కి సంభందించి పూర్తి వివరాలు ఈ కధనంలో తెలుసుకోండి.
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDF
APPSC/TSPSC Sure Shot Selection Group
NICL AO నోటిఫికేషన్ 2024: అవలోకనం
NIACL AO నోటిఫికేషన్ 2024 అవలోకనంలో నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలు, ముఖ్యమైన తేదీలు వంటి సమాచారం తెలుస్తుంది. ఈ దిగువన ఇచ్చిన పట్టికలో NICL AO 2024 నోటిఫికేషన్ అవలోకనాన్ని తనిఖీ చేయండి.
NICL AO నోటిఫికేషన్ 2024: అవలోకనం |
|
సంస్థ | నేషనల్ ఇన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ |
పోస్ట్ | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) (Generalists & Specialists Scale I) |
ఖాళీలు | 274 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 2 జనవరి 2024 |
అప్లికేషన్ విధానం | ఆన్లైన్ |
అధికారిక వెబ్సైట్ | www.nationalinsurance.nic.co.in |
NICL AO రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు
NICL AOకి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్ధులకు నోటిఫికేషన్ లో పేర్కొన్న ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకోవాలి. ముఖ్యమైన తేదీలలు ఈ కింద పట్టిక లో అందించాము.
NICL AO రిక్రూట్‌మెంట్ 2024: ముఖ్యమైన తేదీలు |
|
NICL AO అధికారిన నోటిఫికేషన్ విడుదల | 29 డిసెంబర్ 2024 |
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 02 జనవరి 2024 |
ఆన్లైన్ దరఖాస్తు కి చివరి తేదీ | 22 జనవరి 2024 |
ఫేజ్-I పరీక్షా తేదీ | – |
అడ్మిట్ కార్డు | – |
ఫేజ్- II మరియు హిందీ ఆఫీసర్ పరీక్ష తేదీ | – |
NICL AO నోటిఫికేషన్ 2024 ఆన్లైన్ దరఖాస్తు లింక్
NICL AO తన అధికారిక వెబ్సైట్ లో NICL AO 2024 నోటిఫికేషన్ ని విడుదల చేసింది మరియు ఆన్లైన్ అప్లికేషన్ ని 02 జనవరి 2024న అందుబాటులో ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు 22 జనవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా సమర్పించబడిన దరఖాస్తులకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్ధుల సౌలభ్యం కోసం NICL AO నోటిఫికేషన్ 2024 దరఖాస్తు లింక్‌ని ఇక్కడ అందించాము.
NICL AO నోటిఫికేషన్ 2024 ఆన్లైన్ దరఖాస్తు లింక్
NICL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఖాళీలు 2024
NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 2024 నోటిఫికేషన్ లో మొత్తం 274 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో 28 పోస్టులతో డాక్టర్, 20 పోస్టులతో లీగల్, 30 పోస్టులతో ఫైనాన్స్, 02 పోస్టులతో యాక్చురియల్, 20 పోస్టులతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 20 పోస్టులతో ఆటోమొబైల్ ఇంజనీర్లు, 22 పోస్టులతో హిందీ ఆఫీసర్ వంటి వివిధ పోస్ట్ లు ఉన్నాయి. జనరల్ 130 పోస్టులు, బ్యాక్‌లాగ్‌లకు 02 పోస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కింది పట్టికలో పోస్ట్ ల వివరాలు తెలుసుకోండి.
NICL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఖాళీలు 2024 |
||||||
విభాగం | ఖాళీలు | UR | OBC | SC | ST | EWS |
Doctors (MBBS) | 28 | 57 | 33 | 26 | 12 | 14 |
Legal | 20 | |||||
Finance | 30 | |||||
Actuarial | 02 | |||||
Information Technology | 20 | |||||
Automobile Engineers | 20 | |||||
Hindi (Rajbhasha) Officers | 22 | |||||
NICL AO జనరలిస్ట్ మరియు బ్యాక్ లాగ్ ఖాళీలు |
||||||
Generalist | 130 | 68 | 24 | 18 | 07 | 13 |
Backlog | 02 | 02 |
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్ PDFలో తెలిపింది. ఔత్సాహిక అభ్యర్థులు వారు కోరుకున్న పోస్ట్ కి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. వివిధ విభాగలకి వివిధ అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా తగిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ఈ కింద పట్టికలో NICL AO రిక్రూట్‌మెంట్ 2024 యొక్క అవసరమైన అర్హత ప్రమాణాలను అందించాము.
NICL AO విద్యా అర్హతలు
NICL AO విద్యార్హతలు నోటిఫికేషన్ PDFలో అందించారు. ఒక్కో పోస్టుకు విద్యా ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే, జనరలిస్ట్ కు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి.
NICL AO విద్యా అర్హతలు |
|
విభాగం | కనీస విద్యార్హత |
డాక్టర్ (MBBS) | ఎంబీఏ/ ఎండీ/ ఎంఎస్ లేదా పీజీ- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ డిగ్రీ లేదా నేషనల్ మెడికల్ కమిషన్ (గతంలో) గుర్తింపు పొందిన తత్సమాన విదేశీ డిగ్రీలు |
లీగల్ | గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో (ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం) న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత. |
ఫైనాన్స్ | చార్టర్డ్ అకౌంటెంట్ (ఐసీఏఐ) / కాస్ట్ అకౌంటెంట్ (ఐసీడబ్ల్యూఏ) లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి B.COM/ M.COM డిగ్రీ పరీక్షలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55%). |
యాక్చూరియల్ | గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ యాక్చూరియల్ సైన్స్ లేదా మరేదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ (ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం) ఉత్తీర్ణత సాధించాలి. |
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/B.Tech/ఎంఈ/M.Tech (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55 శాతం) ఉత్తీర్ణత. |
ఆటోమొబైల్ ఇంజనీరింగ్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో బీఈ/B.Tech/ఎంఈ/M.Tech డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం) ఉత్తీర్ణత. |
జనరలిస్ట్ | గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎస్సీ/ ఎస్టీలకు కనీసం 55 శాతం) |
హిందీ (రాజ్ భాషా) | గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్ తప్పనిసరి లేదా ఎలక్టివ్ సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులకు) మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. |
NICL AO వయో పరిమితి
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 కనీస వయోపరిమితి 01 డిసెంబర్ 2023 నాటికి 21 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. అర్హులైన అభ్యర్ధులకు వయో సడలింపు కూడా ఉంది పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను తనిఖీ చేయండి
NICL నోటిఫికేషన్ 2024 దరఖాస్తు రుసుము
NICL నోటిఫికేషన్ 2024 కోసం దరఖాస్తు రుసుము SC/ST/PwBD అభ్యర్థులకు రూ.250 మరియు ఇతర అభ్యర్థులందరికీ రూ.1000/-గా నిర్ణయించబడింది. దరఖాస్తు రుసుమును 22 జనవరి 2024లోపు చెల్లించాలి మరియు అది తిరిగి చెల్లించబడదు. వివరాల కోసం మీరు దిగువ పట్టికను తనిఖీ చేయవచ్చు.
NICL నోటిఫికేషన్ 2024 దరఖాస్తు రుసుము | |
SC / ST / PwBD | రూ. 250/- మాత్రమే |
ఇతరులకి | రూ. 1000/- |
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ ఫేజ్ I, ఫేజ్ II మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 పరీక్షా సరళి
NICL AO రిక్రూట్‌మెంట్ 2024 పరీక్షా సరళి రెండు భాగాలుగా విభజించబడింది. హిందీ ఆఫీసర్స్ స్థానానికి దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు పార్ట్ A వర్తిస్తుంది. NICL AO రిక్రూట్‌మెంట్ 2024 ప్రిలిమ్స్ నమూనా కోసం దిగువ పట్టికను చూడండి.
ప్రిలిమ్స్:
100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
NICL AO రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ పరీక్షా సరళి | |||
విభాగం | మార్కులు | సమయం | భాష |
ఇంగ్షీషు | 30 | 20 నిముషాలు | ఇంగ్షీషు |
రీజనింగ్ ఎబిలిటీ | 35 | 20 నిముషాలు | ఇంగ్షీషు / హిందీ |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 35 | 20 నిముషాలు | ఇంగ్షీషు / హిందీ |
మొత్తం | 100 | 60 నిముషాలు |
NICL AO రిక్రూట్‌మెంట్ మైన్స్ పరీక్షా సరళి |
|||
విభాగం = | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ | 50
|
50 | 40 నిముషాలు |
ఇంగ్షీషు | 50 | 50 | 40 min |
జనరల్ ఆవేర్నేస్ | 50 | 50 | 30 min |
కంప్యూటర్ పరిజ్ఞానం | 50 | 50 | 30 min |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | 40 min |
మొత్తం | 200 ప్రశ్నలు & మార్కులు | 3 గంటలు |
NICL AO జీతం 2024
NICL AO జీతం ప్రారంభ మూల వేతనం రూ. 50,925/-. పే స్కేల్ సుమారు రూ.50925-2500(14)-85925 2710(4)-96765. ఇది కాకుండా అభ్యర్థులకు అనేక ఇతర అలవెన్సులు మరియు ప్రయోజనాలు లభిస్తాయి. మొత్తం చెల్లింపులు ప్రాథమికంగా మెట్రోపాలిటన్ కేంద్రాలలో నెలకు రూ.85,000/-
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |