IIT-M వద్ద భారతదేశం యొక్క మొట్టమొదటి 3D ప్రింటెడ్ హౌస్ ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ (ఐఐటి-ఎం) లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భారతదేశంలో మొదటి 3D ప్రింటెడ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ 3D ప్రింటెడ్ హౌస్ యొక్క భావనను మాజీ ఐఐటి-ఎమ్ పూర్వ విద్యార్థులు రూపొందించారు. ‘కాంక్రీట్ 3D ప్రింటింగ్’ సాంకేతిక పరిజ్ఞానాన్నిఉపయోగించి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకే అంతస్తు గల ఇంటిని కేవలం ఐదు రోజుల్లో నిర్మించారు.
- ఈ ఇల్లు క్యాంపస్ లోపల,ఐఐటి-మద్రాస్ ఆధారిత స్టార్ట్-అప్- ‘ TVASTA మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్’, హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ యొక్క టెర్విల్లిగర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ షెల్టర్ సహకారంతో ఉంది. 2022 నాటికి ‘అందరికీ గృహనిర్మాణం’ పథకం గురించి ప్రధాని నరేంద్ర మోడీ దర్శనికత గడువును చేరుకోవడానికి 3D ప్రింటెడ్ హౌస్ సహాయపడుతుంది.