తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో కొత్త విధానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. TSPSCలో ఖాళీగా ఉన్న చైర్మెన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దరఖాస్తు పత్రాలను www.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జనవరి 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
TSPSC చైర్మెన్, సభ్యుల రాజీనామా ఆమోదం
TSPSC ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో ఛైర్మన్, సభ్యుల నియామకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
APPSC/TSPSC Sure shot Selection Group
గతంలో ఎప్పుడూ లేని విధంగా TSPSC చైర్మెన్, సభ్యుల నియామకం
గతంలో ఎప్పుడూ లేని విధంగా TSPSC చైర్మెన్, సభ్యుల పదవుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. చైర్మెన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఆ వెబ్ సైటు లో అందుబాటులో ఉంచింది. TSPSC చైర్మెన్, సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి వివరాలు మరియు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాల కోసం TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్, మాజీ కార్యదర్శి వాణీ ప్రసాద్ బృందాలు కేరళ, UPSCని సందర్శించి పలు వివరాలను సేకరించాయి.
జనవరి నెలాఖరు వరకు కొత్త కమిషన్
జనవరి నెలాఖరు వరకు కొత్త కమిషన్ TSPSC చైర్మెన్, సభ్యుల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించిన తర్వాత సెర్చ్ కమిటీ లేదా స్క్రీనింగ్ కమిటీ వాటిని పరిశీలిస్తుంది. ఈనెలాఖరులోగా TSPSC కి కొత్త పాలకమండలిని నియమించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
త్వరలోనే TSPSC పరీక్షలకు తేదీలు విడుదల
TSPSC కి కొత్త పాలకమండలి ఏర్పాటైన తర్వాతే TSPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 2, TSPSC గ్రూప్ 3 రాతపరీక్షలకు తేదీలను ఖరారు చేసే అవకాశముంటుంది. TSPSC చైర్మెన్, సభ్యుల నియామకాల తర్వతనే TSPSC గ్రూప్ 4 రాతపరీక్షల ఫలితాలను వెల్లడిస్తుంది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |