Telugu govt jobs   »   Current Affairs   »   NSS National Awards for Andhra Pradesh...

NSS National Awards for Andhra Pradesh Students | ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు NSS జాతీయ అవార్డులు

NSS National Awards for Andhra Pradesh Students | ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు NSS జాతీయ అవార్డులు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జాతీయ సేవా పథకం (నేషనల్ సర్వీస్ స్కీం) 2021-22 అవార్డులు అందుకున్నారు. ఇటీవల సెప్టెంబర్ 29 న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కి చెందిన NSS కార్యకర్త కురుబ జయమారుతి, నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న పెళ్లకూరు సాత్విక్‌లు ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను అందుకున్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ నిర్వహించే ఈ అవార్డులు NSS కార్యకర్తలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, NSS యూనిట్లు మరియు విశ్వవిద్యాలయాలకు అందించే వార్షిక గుర్తింపు. అనంతపురానికి చెందిన కురుబ జయమారుతి, నెల్లూరుకు చెందిన పెళ్లకూరు సాత్వికలు ఆడపిల్లలకు చదువు, డిజిటల్ ఇండియా, డిజిటల్ లిటరసీ, పీఎం ఉజ్వల యోజన, పీఎం జీవన్ జ్యోతియోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన లాంటి ప్రభుత్వ పథకాల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.

ఇద్దరూ కొవిడ్-19 మహమ్మారి సమయంలోనూ ప్రత్యేక సేవలు అందించారు. జయమారుతి 1700 మాస్కులు తయారుచేసి పల్లెల్లో పంపిణీ చేశారు. 120 మొక్కలు నాటారు. రక్తదాన శిబిరాల ద్వారా 238 యూనిట్ల రక్తం సేకరించారు. రూ.23వేల విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని సాయుధ బలగాల్లో పనిచేసి అమరులైన వారి కుటుంబాలకు అందించారు. 2020లో NSS రాష్ట్ర అవార్డునూ గెలుచుకున్నారు. సాత్విక లాక్ డౌన్ సమయంలో అవసరమైన వారికి ఆహారం, సరకులు అందించారు. స్వచ్ఛ భారత్, హెచ్‌ఐవీ అవగాహన, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. 1500 మొక్కలు నాటడంతోపాటు 1000 యూనిట్ల రక్తాన్ని సేకరించిన రక్తదాన శిబిరాలను సమన్వయం చేయడంతో పాటు తానే స్వయంగా మూడు యూనిట్ల రక్తం దానం చేశారు. వరద బాధితులకు ఆహారం అందించే కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 41 మందికి అవార్డులు ప్రదానం చేశారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

NSS విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది?

NSS విద్యార్థి వ్యక్తిగతంగా మరియు సమూహంగా ఎదగడానికి సహాయపడుతుంది. NSS కార్యకలాపాల కింద వివిధ పనుల కోసం స్వచ్ఛందంగా పని చేయడం వల్ల విద్యార్థులు ఆత్మవిశ్వాసం పొందేందుకు, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు వివిధ రంగాలకు చెందిన విభిన్న వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి అనుమతిస్తుంది.