ఎన్.టి.ఆర్ జిల్లా లో ఉన్న మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయంలో వివిధ విభాగాలలో పోస్ట్ ల కొరకు ఆశక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ బ్యాంకు, పోషణ అభయాన్ సంయుక్త ప్రాజెక్టు లో భాగంగా పని చేసేందుకు జిల్లా కలెక్టర్ మరియు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎస్. ఢిల్లీ రావు గారు మంగళవారం ఒక ప్రకటన చేశారు.
NTR జిల్లా ICDS లో ఖాళీలు
NTR జిల్లాలో WCD లో 2023 నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ, విధ్యఅర్హతలు మొదలైన పూర్తి సమాచారం ఈ కధనం లో అందించాము. ఎన్. టి. ఆర్ జిల్లా డైరెక్టరేట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆంధ్ర ప్రదేశ్ లో సహాయక సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను ఆహ్వానించింది. ఆశక్తి గల అభ్యర్ధులు తగిన అర్హతలు ఉంటే తప్పక దరఖాస్తు చేసుకోండి. ఎన్టీఆర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ PDF ను గమనించండి. ఎన్టీఆర్ జిల్లా ICDS WCD లో జిల్లా కొఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్, బ్లాక్ కొఆర్డినేటర్ పోస్ట్ ల కొరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు ఫారం పూర్తి చేసి తగిన దృవపత్రాలతో విజయవాడ కార్యాలయానికి పంపించాలి. అధికారిక వెబ్ సైటు https://ntr.ap.gov.in/notice_category/recruitment/ లో రిక్రూట్మెంట్ కి సంభందించిన పూర్తి సమాచారం అందించారు.
APPSC/TSPSC Sure shot Selection Group
NTR జిల్లా ICDS లో ఖాళీలు ముఖ్యమైన తేదీలు
NTR జిల్లా ICDS లో జిల్లా కొఆర్డినేటర్, బ్లాక్ కొఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. NTR డిస్ట్రిక్ట్ అంగన్ వాడి నోటిఫికేషన్ లో ముఖ్యమైన తేదీలు ఈ కింద పట్టికలో గమనించండి
NTR జిల్లా ICDS లో ఖాళీలు ముఖ్యమైన తేదీలు | |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 25-10-2023 |
దరఖాస్తు చివరి తేదీ | 07-11-2023 |
NTR జిల్లా ICDS నోటిఫికేషన్ PDF
NTR జిల్లా ICDS నోటిఫికేషన్ లో దరఖాస్తు ఫారం అందించారు, అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ప్రింట్ అవుట్ తీసుకుని పూర్తి చేసి తగిన దృవపత్రాలు జత చేసి NTR జిల్లా ICDS కార్యాలయానికి పంపించాలి. అంగన్వాడీ లో జిల్లా కొఆర్డినేటర్, ప్రాజెక్టు అసిస్టెంట్, బ్లాక్ కొఆర్డినేటర్ పోస్ట్ ల కోసం దరఖాస్తు నోటిఫికేషన్ని పరిశీలించండి.
NTR జిల్లా ICDS నోటిఫికేషన్ PDF
ఎన్టీఆర్ జిల్లా ICDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు
NTR జిల్లా ICDS రిక్రూట్మెంట్ 2023 కోసం మొత్తం 8 ఖాళీలకు దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఖాళీల గురించి పూర్తి సమాచారం ఈ కింద పట్టిక లో అందించాము.
ఎన్టీఆర్ జిల్లా ICDS రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు | |||
క్ర . సం | పోస్ట్ పేరు | ఖాళీలు | జీతం |
1 | జిల్లా కొఆర్డినేటర్ | 1 | 30,000 |
2 | ప్రాజెక్టు అసిస్టెంట్ | 1 | 18,000 |
3 | బ్లాక్ కొఆర్డినేటర్ | 6 | 20,000 |
ఎన్టీఆర్ జిల్లా WCD కార్యాలయం రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు విధానం
ఎన్టీఆర్ జిల్లా WCD కార్యాలయం రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకుని పూరించి తగిన దృవ పత్రాలను జత చేసి నవంబర్ 7వ తేదీలోపు NTR జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత-అధికారి కార్యాలయం, విజయవాడ కి రిజిస్టర్ పోస్ట్ లేదా నేరుగా దరఖాస్తుని అందించాలి. చివరి తేదీ లోపు దరఖాస్తు ఫారం ను సమర్పించాలి అని చివరి తేదీ దాటిన అప్లికేషన్ లను పరిగణలోకి తీసుకోరు అని అధికారులు తెలియజేశారు. ఈ దిగువన అందించిన దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి పంపించవచ్చు లేదా ఇలాంటి దరఖాస్తు ని పూరించి పంపించవచ్చు.
ఎన్టీఆర్ జిల్లా WCD రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫారం
NTR జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత-అధికారి కార్యాలయం ఎంపిక విధానం
NTR జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత-అధికారి కార్యాలయం లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసేందుకు నియామక ప్రక్రియ గురించి తెలుసుకోండి. NTR WCD నియామకం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన అప్లికేషన్ లను తనిఖీ చేసి అర్హులైన అభ్యర్ధులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. మౌఖిక పరీక్ష గురించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్ సైటు లేదా ఈ లింకు లో https://ntr.ap.gov.in/notice_category/recruitment/ తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూ
ఎన్టీఆర్ జిల్లా ICDS రిక్రూట్‌మెంట్ 2023 విద్యార్హతలు
ఎన్టీఆర్ జిల్లా ICDS రిక్రూట్‌మెంట్ 2023 విద్యార్హతలు తప్పనిసరిగా దరఖాస్తుదారులు తెలుసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా తగిన విధ్యార్హతలు కలిగి ఉండాలి. NTR జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం ఖాళీలు 2023 కోసం వివిధ విభాగాలలో ఖాళీల కోసం విధ్యార్హతలు తనిఖీ చేయండి.
ఎన్టీఆర్ జిల్లా ICDS రిక్రూట్‌మెంట్ 2023 విద్యార్హతలు | ||
క్ర. సం | పోస్ట్ పేరు | విధ్యార్హతలు |
1 | జిల్లా కొఆర్డినేటర్ | డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం లో డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ప్రాంతీయ భాష పై పరిజ్ఞానం మరియు ఇంగ్షీషు భాష తెలిసి ఉండాలి. 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ & సపోర్ట్ లో అనుభవం ఉంటే మంచిది. |
2 | ప్రాజెక్టు అసిస్టెంట్ | న్యూట్రీషన్, సోషల్ సైన్స్, మ్యానేజ్మెంట్ లో డిగ్రీ/ డిప్లొమా కలిగి ఉండాలి. ప్రాంతీయ భాష పై పరిజ్ఞానం మరియు ఇంగ్షీషు భాష తెలిసి ఉండాలి. 2 సంవత్సరాలు సూపర్వైజరీ, కెపాసిటీ బిల్డింగ్ లో అనుభవం ఉంటే మంచిది. |
3 | బ్లాక్ కొఆర్డినేటర్ | డిగ్రీ పూర్తి చేసి కనీసం 2 సంవత్సరాలు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్ లో అనుభవం ఉంటే మంచిది. |
NTR జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం 2023 వయోపరిమితి
అన్నీ పోస్ట్ లకు సంభందించిన వయోపరిమితి గురించి సమాచారం అధికారిక ప్రకటన లో తెలియజేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 01.07.2023 నాటికి వారి వయస్సు లెక్కించుకోవాలి. నోటిఫికేషన్ లో తెలిపిన కనిష్ట మరియు గరిష్ట వయస్సు వివరాలు.
- కనిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
NTR జిల్లా WCD నోటిఫికేషన్ 2023 చిరునామా
అధికారిక వెబ్ సైటు నుంచి డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫారం ను అభ్యర్ధులు చివరి తేదీ అనగా 07-11-2023 లోపు NTR జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత-అధికారి కార్యాలయంనకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్ళి అందించాలి. రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించే అభ్యర్ధులు ఈ కింద అధికారిక చిరునామాకి పంపించాలి.
“To The District Women & Child Welfare & Development Officer,
D.no: 6 93, SNR Academy Road,
Uma Sanker Nagar, 1st Line, Kanuru,
NTR District, Vijayawada- 520007”
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |