Telugu govt jobs   »   Current Affairs   »   ఏపీపీఎస్సీ పరీక్షల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్...

Persons With Disabilities to Get 4% Reservation in Upcoming APPSC Exams | ఏపీపీఎస్సీ పరీక్షల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ లభించనుంది

Persons With Disabilities to Get 4% Reservation in Upcoming APPSC Exams | ఏపీపీఎస్సీ పరీక్షల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ లభించనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా దివ్యాంగులకు 3శాతం గా ఉన్న రిజర్వేషన్ ను 4శాతంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో చేపట్టబోయే APPSC, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. గతం లో ఇచ్చిన ఉత్తర్వులు a ఫిబ్రవరి 19, 2020 తేదీతో మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్‌ల విభాగం ద్వారా GO విడుదల చేయబడింది
ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో వికలాంగులకు 4% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఫిబ్రవరి 19, 2020 తేదీలలో మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్‌ల విభాగం ఇచ్చిన ఉత్తర్వులకు ఇది పొడిగింపుగా వర్తిస్తుంది. కొత్తగా ఇచ్చిన  GOలో ఆటిజం, మానసిక రుగ్మతలు, బహుళ వైకల్యాలు మరియు మేధోపరమైన వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా రిజర్వేషన్ పొందేందుకు అర్హులు. ఈ తాజా ఉత్తర్వుల వలన ఎంతో మంది వివిధ వైకల్యాలు ఉండి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందుతారు.
2011 నుంచి వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు కానీ 2016 లో కేంద్రప్రభుత్వం వీటిని పెంచింది, ఆ పెంచిన వాటిని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా GO తీసుకుని వచ్చింది.
 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!